1, జనవరి 2013, మంగళవారం

చేవలేని చేను - లేవ లేని ఆవు



చేవలేని చేను - లేవ లేని ఆవు
గీటురాయి 24-4-1990
              అడుగుటేగాని ఇచ్చుట అసలె లేక
              అప్పులెగాని వనరుల ఆ లేక
              జరుగనున్నది తెలియక జనులు కుంద
              మంత్రి వర్యుల మాటలన్ మార్పు రాదు
              ప్రజల కోర్కెలు దీర్చెడి ప్రగతి లేదు
              ప్రాణ భయమున కుత్పత్తి ప్రాంతమైన
              ఆంథ్రి నెచ్చట గలదోయి ఆత్మశాంతి ?

              అని ఓ కవిగారు చాలా బాధపడ్డారు. అప్పుడు నేను చెప్పాను :        కూతురు చెడితే తప్పు తల్లిదంటారు. మంత్రులు చెడితే ఆ తప్పు జనానిదే.        కూరకు తాలింపు, చీరకు జాడింపు, మంత్రులకు వాయింపు ఉండాలి.      లేకపోతే పాలకులు మన మీద ఏకు మేకై కూర్చుంటారు. కూన అని   పెంచితే, గండైకరవ వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. పీనిగలపై కప్పే గుడ్డల్ని     పట్టు బట్టల్లా స్వీకరించి శరీరాలపై సింగారించుకునే జీవచ్ఛవాల్లారా, రక్తమోడ్చి సంపాదించిన ప్రజల కష్టర్జితాన్ని రాబందుల్లా కొట్టేసే        దుర్మార్గుల్లారా గుడిగుడి దగ్గరా చెప్పులిడిచి పెళ్ళున చెంపలేసుకుంటే   పుణ్యమోస్తుందా ? రాళ్ళకి మొక్కి తీర్ధాల్లో మునిగితే మీ పాపాలు        క్షమించబడతాయా ?” అని సి. వి. గారి లాగా మొహాన అడుగకుండా ,      ఆత్మశాంతి లేదని బాధపడితే ప్రయోజనం శూన్యమని చెప్పాను. ఏ మనిషి       తో మాట్లాడినా ఏవో బాధలు పెల్లుబికి వస్తున్నాయే గాని, సుఖశాంతుల సమాచారం అందటం లేదు.

              చెన్నా గారి పాలనలో నమలక మింగక నానవేసిన రీతిలో సమస్యలు        మురిగిపోతున్నాయి. ఏ పని చెయ్యటానికీ ఆయన వల్లకావటం లేదు.      స్వంత బృందంలోనే అపశకునపు వాదులు తయారయ్యారు. అంతకు మించి అధిష్టాన వర్గం అదుపు ఎక్కువయ్యింది. అది చేస్తాం ఇది చేస్తాం అనే       కూతల ఆర్భాటమే గాని కుప్పలో ఇత్తులు లేవు. మంత్రులకు మనసులు లేవు,అధికారులకు ఆదేశాలు లేవు. పుణ్యకాలం కాస్తా వెళ్లిపోతూనే ఉంది.       ఏది చేయాలన్న ఢిల్లీకి పరుగెత్తక తప్పటం లేదు.

              ఉదాహరణకు కూలిపోయిన వంతెనలు కట్టడం దగ్గర నుండి కొత్త     జిల్లాల సమస్య దాకా, కోనసీమ, నాగార్జున, నల్లమడ, బాలాజీ, నంద్యాల,      గుంతకల్లు, మంచిర్యాల, మెదక్, ఈ రకంగా ఎన్నో ప్రాంతాల వాళ్ళు కొత్త      జిల్లా కోసం కనబడిన ప్రతి మంత్రినీ యాచించారు. చెన్నారెడ్డి గారు   ఎట్టకేలకు మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మెదక్ శాసనసభ్యునికి        హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ఏమయ్యిందో గాని అసెంబ్లీలో రెవిన్యూ       మంత్రి అసలుకే ఎసరు పెట్టారు. కొత్త జిల్లాల ప్రసక్తే లేదు పొమ్మన్నారు. ఖర్చు ఎక్కువ అవుతుందంట. అకాడమీలు, కౌన్సిళ్ళ ఏర్పాటు       మానుకుంటే మరి ఖర్చు తగ్గేది కాదా ? ఇక్కడొక మాట, అక్కడొక మాట    జారవిడుస్తూ, సక్రమంగా ఉన్న ఒక్కొక్క పకానికీ బొక్కలు పెట్టుకుంటూ        పోవడం మినహా చెన్నా పాలనలో కొత్తదనం గాని, అభివృద్ధి గాని ఏమీ లేదు. మండలాలను  ముంమోయించి, ప్రజలంతా వద్దు బాబో   అంటున్నా వినకుండా తాలూకాలను తిరిగి తెచ్చే ప్రయత్నం ఆపలేదు.     జనం ఎంతగా మొరపెట్టినా కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకోవటం లేదు.        రెవిన్యూ డిపార్టుమెంటును పంచాయితీరాజ్ తో విలీనం చేసి పంచాయితీల శక్తిని పెంచాలనే డిమాండును పెడచెవిని పెట్టారు. పౌరసరఫరాల కోసం ఒక      ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి రెవిన్యూ శాఖపై వత్తిడి తగ్గించాలనే   ప్రతిపాదనను గిరాటేశారు. 805 మంది డిప్యూటీ తహసీల్దార్లను గజిటెడ్ గా ప్రకటించి ప్రజలకు చేరువలో నిజమైన అధికారుల్ని ఉంచాలనే వాదనను   వమ్ము చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి అదుపులో        ఉన్నట్లుగానే కలెక్టర్లను, జిల్లా పరిషత్ చైర్మన్ల అదుపులో ఉంచాలనే  ప్రజా        ప్రతినిధుల కోర్కెను కాలదన్నారు. అసెంబ్లీ లో వీళ్ళ ముచ్చట్లు,వాదులాలు చూస్తే గుడిపూడి జంగాలు ఙ్ఞాపకం వస్తున్నారు.



             

కాపులు, కారణాలు ఎలా ఉండాలి ?



కాపులు, కారణాలు ఎలా ఉండాలి ?
గీటురాయి 11-1-1991

                   ఒక ఊరికి ఒక కరణము
              ఒక తీర్పరియైన గాక నొగిధరచైనన్
              కకవికలు గాక యుండునె
              సకలంబును గొట్టు నడకసహజము సుమతీ !

              అనే సుమతీ శతకారుని మాట అక్షరాల నిజమయ్యింది.      రెండూళ్ళకు ఒక గ్రామపాలనాధికారి అనేటప్పటికీ మాజీ కరణాలు, మునసబులందరికీ ఉద్యోగాలు రావటం లేదు. అధికార పార్టీలోని ఎమ్మేల్యేలు కూడా పాత వ్యవస్థ పునరుద్ధరణ పట్ల పెదవి విరిచారు. చివరికి        ఊరికొక గ్రామాధికారిని నియమించి రెవిన్యూ వ్యవస్థలో కొన్ని మార్పులు   తెచ్చే ఉద్దేశంతో ఈ నియామకాలు వాయిదా వేశారు. ఈ గ్రామాధికారుల వ్యవస్థ సత్ఫలితాల నివ్వాలంటే, జన సామాన్యంలో ప్రాచుర్యం పొందిన      కొన్ని సామెతలను, పద్యాలను, మననం చేసుకొని, వాటిలో చెప్పబడిన చెడు నివారించబడి, ప్రజలకు మేలు జరిగేలా నియమావళిని   రూపొందించటం ఈనాటి అవరం. ఉద్యోగాల్లోకి రాబోతున్న కరణాలు     మునసబులు,టేళ్ళు, పట్వారీలు కూడా ఈ సామెతలు, పద్యాలను     గమనించి తమ భవిష్యత్ కార్యక్రమాలను, ప్రవర్తనా నియమాలను     రూపొందించుకోవాలి : -
1.    కరణము కరణము నమ్మిన
   మరణాంతక మౌనుగాని మనలేడు సుమీ
   కరణము తన సరి కరణము
   మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ

2.    కరణము సాదై యున్నను
కరిమదముడిగినను, పాము కరువక యున్నన్
ధరతేలు మీట కున్నను
కరమరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ

3.    కరణములననుసరింపక,
విరసంబున తిన్న తిండి వికటించు సుమీ
ఇరుసున కందెన బెట్టక
పరమేశ్వరు బండియైన పాదు సుమతీ

4.    కాదన్నవాడె కరణము
వాదడచిన వాడె పేడి, వసుదేశున్
లేదన్న వాడె చనవరి
గాధలు పేక్కాడువాడె కావ్యుడు సుమతీ

5.    నరపతులు మేర దప్పిన
తిరమొప్పుగా విధవ ఇంట తీర్పరియైనన్
కరణము వైదికుడైనను
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ

6.    పొరుగున పగవాడుండి
నిరవొంగ వ్రాతకాడె ఏలికయైనను
ధరకాపు కొండె మాడిన
కరణాలకు బ్రతుకు లేదు గదరా సుమతీ

          కరణము అనే సంస్కృత పదానికి గ్రామగుమాస్తా అని
        అర్ధం. వ్రాసే వాడిని గూడా కరణం అంటారు. బాగా రాయలేకపోయిన వారిని       చూచ్చి జనం కూతకరణమేగాని వ్రాతకరణంకాదు అనేవాళ్ళు. జిల్లా రిజిస్ట్రార్       ను స్థలకరణం అంటారు. మునసబును తీర్పరి అనేవాళ్ళు. మనస్సు,        బుద్ధి, చిత్తము, అహంకారాలను కరణ చతుష్టయమంటారు. ఆలోచన,        మాట, ఆచరణలను త్రికరణాలంటారు. కరణీకమంటే గుమాస్తాగిరీ.  కరణా  మీద కొన్ని సామెతలు చూద్దాం : -

1.    కరణం, కంసాలీ కపటం విడువరు.
2.    కరణం కాపూ నా పక్కనుంటే కొట్టరా మొగుడా ఎట్లా కొడతావో అన్నద.
3.    కరణం గంట మెత్తితే కంఠానికి రావాలిగాని, లేకుంటే శంఠానికి రాదు.
4.    కరణంతో కంటు, కాటికి పోయినా తప్పదు.
5.    కరణంతో కంటు పడితే కాడి కదలదు.
6.    కరణం, కంసాలి లేకుండా కథ చెప్పమన్నారు.
7.    కరణం సాధుకాదు, కాకి తెలుపు కాదు.
8.    కరణం గ్రామదండుగగోరు, జంబుకంబేవేళ వము గోరు.
9.    కరణానికీ కాపుకే జత, ఉలికీ గూటానికే జత.
10.           కరణానికి తిట్టు దోషం లేదు చాకలికి ముట్టు దోషం లేదు.
11.           కరణాన్ని కంసాలిని కాటికిపోయినా నమ్మరాదు.
12.           కరణాలు కాపులూ ఏకమయితే కాకులు కూడ ఎగురవు.
13.           ఆకలిగొన్న కరణం పాతకవిలె బయటికి తీశాడట.
14.           ఆదూరు కరణం బ్రతికీ ఏడ్పించాడు, చచ్చీ ఏడ్పించాడు.
15.           ఇచ్చింది ఇస్తే కరణాన్ని కాదు అన్నాడట.
16.           ఏమండీ కరణం గారూ, గోతిలో పడ్డారే అంటే కాదు, మషాకత్తు      
   చేస్తున్నాను అన్నాడట.
17.           కలిగిన మాత్రం తిని, కరణం గారి కమతం చేయమన్నట్లు.
18.           కల్లం దగ్గర కరణీకం, కంచం దగ్గర రెడ్డి రికం.
19.           కాపు కక్కసం, కంసాలికువాడం.
20.           వ్రాతరానివాడు కోత కరణం, వ్రాతా కోతా రానివాడు మేకరణం.

   ఇవన్నీ తెలుగు విశ్వ విద్యాలయం వారు ముద్రించిన సామెతల గ్రంధంలో కూడా చోటు చేసికున్నాయి. సామెతలు ప్రజల అనుభవంలోంచి పుట్టి భావి తరాల వారికి పాఠంగా మిగిలి ఉంటాయి. సామెతలు ప్రజల భావాలకు, అనుభవాలకు అద్దం పడతాయి. కాబట్టి పదవులు చేపట్టబోతున్న మాజీ కరణాలు, కాపులు కొత్త తరహాలో ప్రజలకు సేవలందించి, వారి మీదున్న చెడ్డ పేరును తొలగించుకోవాలి. పై సామెతల్లో వారిపై మోపబడిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలి.