31, డిసెంబర్ 2012, సోమవారం

అనర్ధాలకు దారి తీస్తున్న అనైక్యత



అనర్ధాలకు దారి తీస్తున్న అనైక్యత
గీటురాయి 28-6-1991

                             దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా ? ఎంత మాత్రం       లోటు కాదు. ఒకే రకం ఈకలు గల పక్షులు ఒకేచోట చేరతాయంటారు. ఈ   మధ్య పరుపులు కుడతాం అంటూ కవ్వానుబద్ధ భుజాన వేసుకుని     తిరుగుతున్న ఇద్దరు మనుషులు నా కంట బడ్డారు. ఎంతో కాలం నుంచి       పెండింగ్ లో ఉన్న పరుపు కొనుగోలు ప్రతిపాదన వాళ్ళను, చూడగానే        మంజూరయ్యింది. పరుపు కుట్టడం పూర్తయ్యాక మీరు దూదేకుల    సాయిబులేనా ?’ అని అడిగాను. కాదండీ బాబూ, మేము కాపులం మాది      ఏలూరు అని జవాబిచ్చారు. కులంగాదు, తలంగాదు కురవోళ్ళ పిల్ల      య్యమై పట్టినట్లు, కాపులు గూడా దూదేకుతున్నారంటే వీళ్లను బీసీల్లో ఎందుకు చేర్చగూడదు అనిపించింది. తురకలు లేని ఊళ్ళో దూదేకుల వాడే   ముల్లా అంటుంటారు. దూదేకుల వాళ్ళు కూడా లేని ఊళ్ళో ముల్లా పని        ఏమోగాని దూదేకే పని మాత్రం ఏదో ఒక కులపోళ్ళు నెత్తిన వేసుకొని        చేస్తుండటం మూలాన కులవృత్తిసిద్ధాంతం దెబ్బతిని పోయింది.

              టర్కీ (తుర్కీ) భాష మాట్లాడే వాళ్ళను పూర్వం తురక వాళ్ళు అని    ఉంటారు. కానీ ఇప్పుడు ర్దూ మాట్లాడే ముస్లిములందరినీ తురకోళ్ళు       అంటున్నారు. సర్వీస్ కమీషన్ పరీక్షల్లో కూడా ఇదే మాట ప్రయోగించారు. దూదేకుల సాయిబుల్నీ, మామూలు సాయిబుల్నీ వేరు చేసి ఇలా రెండు    పేర్లతో పిలుస్తున్నారు. తురకా దూదేకుల పొత్తులో మురిగీ ముర్దార్ అనే   సామెత ఉంది. కాక బీకర కాకు జాతారే? అంటే దూబగుంటకు దూదేకను       జాతారే అని ఇద్దరు దూదేకుల వాళ్ళు సంభాషించుకున్నారట. బావి    తవ్వితే భూతం బయటపడ్డట్లు లోతుకు పోయే కొద్దీ కొత్త సంగతులు        బయట పడుతున్నాయి.

              ఈ మధ్య నన్ను ఆకివీడుకు బదిలీ చేశారు. బదిలీ కాగితం చేతికిస్తూ ఓ సాయిబుగారు నాకు ఉర్దూ రానందుకు చాలా సిగ్గుపడి పోయారు.    ఆయన భాషాభిమానం ఎంత గొప్పదంటే, ఖురాన్ ఉర్దూ లోనే       అవతరించిందట. బావిలోని కప్పకూ గానుగ ఎద్దుకూ అవే లోకాలు అన్నట్లు ఉర్దూ పిచ్చి పట్టిన వాళ్ళకు మరో సంగతి తలకెక్కదు. లాగే తెలుగు        మాట్లాడటం మన ప్రత్యేకత మన సంస్కృతి అంటూ ఉపన్యాసం చేసిన ఒక నూర్ బాష  నాయకుణ్ణి సంకుచితత్వం వదలి పెట్టమని హితోపదేశం చేశాను. భాషలు ఆయా ప్రాంతాలకు సంబంధించినవి అయితే దైవ ధర్మం విశ్వవ్యాప్తమైంది. అన్ని భాషల ద్వారా ధర్మం వ్యాపించాలి       అంటుండగానే, మరో సాయిబుగారు ఆకివీడులో మీ కేర్ వాళ్ళు చాలా        మంది ఉన్నారండీ అన్నారు. ఇస్లాం లో చేరిన తరువాత అంతా ఒకే       కేర్ అవుతారు. ఇంకా ఎందుకీ భేదాలు ?” అన్నాను. రంగా        హత్యానంతరం జరిగిన దౌర్జన్య కాండలో నువ్వు సాయిబువైతే ఉర్దూలో     మాట్లాడు అని దూదేకుల సాయిబుని తన్నారు గదా ? మీకు మాకు తేడా     లేదా?” అన్నాడాయన. గూని వీపు నయం కాదు లెమ్మని నేను మౌనం        వహించి ఆకివీడు చేరాను. అక్కడ ఇంకో సాయిబుగారు నా వివరాలన్నీ     అడిగి ఈ దూదేకుల వాళ్ళంతా ఒక ముస్లిం తండ్రికీ హిందూ తల్లికీ        జన్మించిన సంతానమండీ అన్నాడు. కన్ను కైకలూరులో కాపురం      డోకిర్రులో అన్నట్లుయింది నా పని. ఎంతగా ధర్మ ప్రచారం     జరుగుతున్నప్పటికీ ఈ రెండు రకాల సాయిబులూ కలిసి పోవటం లేదు.   ఏమిటీ దుస్థితి అని ఒక స్థానిక ముస్లిం నాయకుడిని అడిగాను.      గోంగూరలో చింతకాయ వేసినట్లు, గోకి దురద తెచ్చుకున్నట్లు వీళ్లతో    మాకెందుకండీ తంటా? బయటి వాళ్ళకు చెప్పుకోవటం నయం అన్నాడు.
       సాయిబుల పిల్లల్ని చేసుకొని వాళ్లలో కలిసిపోగూడదా ఎందుకీ అదగస్తపు బతుకు? అని ఒక దూదేకుల శ్రీవారిని అభ్యర్ధించాను. అమ్మో ఇంకా   ఏమయినా ఉందా? మనం బ్రతకడానికేనా ? అడుగడుగునా లదాఫ్,పింజారీ         అని ఎత్తి పొడవరూ ?” అని ఎదురు బెదిరించాడు. గ్రామాల్లో పరిస్థితి ఇలా        ఉంది. హైదరాబాదులో తల పండిన పెద్దలు, పట్టణాలలోని ముస్లిం    పండితులు ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి చేస్తారని     ఆశిస్తున్నాను (అక్కడ కూడా ఇలాగే లేకపోతే).


ఉయ్యాల వైద్యం



ఉయ్యాల వైద్యం
గీటురాయి 12-7-1991
         
          ఉయ్యాల జంపాల ఊగరావయా
      ఎనలేని భోగాల ఊగి తూగి                                      || ఉయ్యాల ||

అంటూ పసిపిల్లల్ని గుడ్డ ఉయ్యాల్లోనో, తొట్టి ఉయ్యాల్లోనో లాలిపాడుతూ ఊపితే ఎక్కువ మంది పసిపిల్లలు నిద్రపోతారు. ఏతాము పాటకు ఎదురు లేనట్లుగా చిట్టినాన్నలు గొడవ చేయకుండా గమ్మునుంటా రు. అయితే కొంతమంది గడుగ్గాయలు ఊపేకొద్దీ ఎడుపెక్కువ
చేస్తారు. ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లుగా ఉయ్యాల స్పీడు పెరిగే కొద్దీ చంటివాడి ఏడుపు జోరు కావటమే గాక ఉయ్యాలలోని పొత్తిగుడ్డలన్నీ ఖరాబు అవుతాయి. ఇందుకు ఉయ్యాల భయమే కారణం అంటారు.

       పసివాళ్ళ విషయం అలా ఉంచితే పెద్ద వాళ్ళు సైతం ఈ భయంతో సతమతమౌతుంటారు. కండలు మెలిదిరిగి, కోరమీసాలతో దర్శనమిచ్చే వస్తాదు కూడా రంగుల రాట్నం, జెయింట్ వీల్, తాటి చెట్లకు వేసిన పెద్ద మోకుల ఉయ్యాల మొదలైనవి ఎక్కాలంటే గుండే పిచపిచలాడి చస్తాడు. అట్లతద్ది పండక్కి మగవాళ్ళు టుంగుటుయ్యాల పోటీలు పడి తొక్కితే, ఆడవాళ్ళు ఎదురు ఊపుల ఉయ్యాల ఊగుతారు. సన్నగా, పీలగా ఉండే వాళ్ళు ఎంతో ఎత్తుకు పోతుంటారు. లావుగా పీపాలాగా ఉండే వాళ్ళు రెండు ఊపులకే కిందికి దిగిపోతారు. ఊపటం ఆపకపోతే పెద్దగా కేకలు వేస్తూ నేల మీదికి దూకేస్తారు కూడా. ఉడత ఊపులకు కాయలు రాలతాయా, ఇంకా ఊపండి అంటూ కొందరు అదేపనిగా, ఊపే వాళ్ళకు అలుపొచ్చేదాకా ఊగుతారు. పండగపూ ఒక్క ఊపైనా ఊగాలని పట్టి బలవంతాన కొంతమందిని ఉయ్యాల మీద కూర్చోబెడితే అమ్మోనాయనో అంటూ కళ్ళు తిరిగి దబాలున కిందపడేవాళ్లు, కడుపులో ఉన్నదంతా కక్కేవాళ్లూ, ఉయ్యాల దిగనీ నీ పని చెబుతానే వాళ్లూ, దిగినాక ఊపిన వాళ్ళను కొట్టేవాళ్లూ... ఇలా అట్లతద్దినాడు ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకో వాయనం అన్నట్లు అవుతుంది. వాతఆవరణం. అట్టు పెట్టినమ్మకు అట్టున్నర ముట్టుతుంది.

       పెద్ద పెద్ద భూస్వాముల ఇళ్ళల్లో ఇనపగొలుసులకు వేలాడుతూ బల్ల ఉయ్యాలలుంటాయి. దాని మీద ఊగుతూ భోగుల్లాగా నిద్రపోయే స్వాములు సైతం, ఉయ్యాల వెళ్ళి గోడలకు తగిలేం పెద్ద ఊపులు వేస్తే దిమ్మర పోయి కింద పడతారు. పాతరలో పడ్డ కుక్కను తీయబోతే కరవవచ్చినట్లుగా ఒక్కొక్కసారి కిందపడ్డ ఆసామిని లేవదీయటానికొచ్చినవాడు దెబ్బలు తింటాడు. ఉపకారానికి పోతే అపకారం ఎదురవటం అంటే ఇదే.

       సరే, ఈ ఉయ్యాల గురించిన ఊగులాటం ఎందుకని మీరనొచ్చు. వాటి అవసరం వచ్చింది కాబట్టే ఈ ఉపోద్ఘాతం ఇచ్చాను. ఈ మద్య మాట తప్పిన ఎమ్మెల్యే ఒకాయన్ని హాహాకారాలు పెట్టేలా ఉయ్యాల ఊపార బీహార్ జనం. చేసిన వాగ్దానం నెల రోజుల్లో నెరవేరుస్తాను బాబో అని మరో వాగ్దానం చేయించుకుని మరీ ఉయ్యాలలో నుంచి దినిచ్చారట. ఇలాంటి ప్రయోగం మన ఆంధ్ర వాళ్ళు కూడా చేస్తే మంచి ఫలితాలుండొచ్చు. మేనిఫెస్టోలతో అరచేతిలో వైకుంఠం చూపించే రాజకీయనాయకులు, నాసిరకంగా పనులు చేయించి లక్షలు స్వాహా చేసిన కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రోగుల ప్రాణాలతో చెలగాటమాడే డాక్టర్లు, సుఖభోగాల్లో తేలుతూ ప్రజాక్షేమం పట్టని సినిమా యాక్టర్లు, నిర్మాతలు, డైరెక్టర్లు, గజ దొంగలు, బందిపోట్లు, రౌడీషీటర్లు, కేసులు తేల్చక నానవేసే న్యాయవాదులు,డ్జీలు, పోలీసులు... ఇలా అన్నీ రంగాల్లోని హేమాహేమీలకు ఈ ఉయ్యాల వైద్యం ఏడాదికొసారి అట్లతద్దినాడే చేయిస్తే పండుగకో నిండుదనం వస్తుంది. పుణ్యం పురుషార్ధం కలిసొచ్చి పండుగ సార్ధకం అవుతుంది. మరి రెడీగా ఉండండి అక్టోబర్ 25 నే అట్లతద్ది !


      





                            

ఇదీ మన భక్తి



ఇదీ మన భక్తి
గీటురాయి 30-3-1990
              దూదేకుల సిద్దా సాహెబ్ గారిని ఆ రోజుల్లో కొందరు శాస్త్రులు    ఇంటర్వ్యూ చేశారు. భక్తి తొమ్మిది స్థాయిల్లో ఉంటుందని ఆయన వారికి       చెబుతాడు. అవి ఏమిటంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, సేవనము,     అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము.

              మిగతా స్థాయిల సంగతి ఎలా ఉన్నా శ్రవణము కీర్తనము అనే రెండు        స్థాయిలు దాటి మనుషులు దైవభక్తిలో ముందుకు పోలేకపోయారన్నది నిజం. పోయిన వాళ్ళు బహు కొద్దిమంది. పాటలు పాడటం – పాటలు      వినడం ఈ రెండు పనులు చాలా తేలిక. ఇక దాస్యము, ఆత్మనివేదనము    అంటారా అవి ఎక్కువ మందికి అసాధ్యమైన పనులుగానే        కనబడుతున్నాయి.

              నేల మీద బూరె అని వ్రాసి, ఇం తింటావా అంత తింటావా అని      అడిగినట్లు పరమ భక్తులని పేరు గాంచిన వారు ఒక లాంటి మిధ్యా వాదాన్ని, క్తి పేరిట శృంగార సంకీర్తనల్నీ వెదజల్లిపొయ్యారు. నిజమైన    బూరె కమ్మగానే ఉంటుంది గాని, బూరె అనే అక్షరాలే కమ్మగా ఉండవు కదా ? అలానే దేవుని స్తుతియించుడీ ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడీ        అని కొందరు క్రైస్తవ సోదరులు దావీదు కీర్తనను గళమెత్తి కమ్మగా    పాడుతారు. సన్నని తంతుల సీతారతో, చక్కని స్వరములతో, తంబురతో,     నాట్యముతో, తంతి వాయిద్యముతో, మ్రోగు తాళములతో, పిల్లనగ్రోవి       బూరధ్వనితో సైతము ఆ మహాదేవుని స్తుతించండి అంటూ శ్రావ్యంగా    పాడుతారు.  

              ఈ భక్తి శ్రవణ స్థాయిని దాటి కీర్తన స్థాయిలో పడిందన్న మాట.       అయితే నాకు ఈ శ్రావణానందం ఎక్కువసేపు నిలువలేదు. మంచి శుక్రవారం రోజు మొన్నీ మధ్య చర్చికి హాజరయ్యాను. When I survey the Wondrous cross”  అనే పా ఎత్తుకొన్నారు. గిటారు, హార్మోనియం,      వయొలిన్   మొదలైన సంగీత వాద్యాలతో గాయక శిఖామణులు        తయారయ్యారు. See from His head, His hands, His feet – sorrow        and love flow mingled down…” అనే చరణం వచ్చింది. ఎంతో బాధతో        హృదయవేదనతో పాడవలసిన ఈ పాటను చెవులు గింగుర్లెత్తే      వాయిద్యాలతో, రాగతా యుక్తంగా, బృందగీతం లాగా అర్ధాన్ని        ఆస్వాదించకుండా పాడుతున్నా రేమిటా అని నాకు బాధవేసింది.

              అపరాధిని సయ్యా – కృప జూపి బ్రోవు మయ్యా... ప్రక్కలో   బల్లెపుపోటు – గ్రక్కున బొడిచితి నేనే

              అనే పా నిజమైన భక్తిపరుడు ఎలా పాడాలి ? కానీ ఓ చర్చిలో      డ్రమ్ము, సైడ్రమ్ము, తాళాలు, చప్పట్లు, కంజీరాలతో యమజోరుగా  పాడారు.   నాకైతే సిగ్గు వేసింది. ఇక్కడ ఈ కీర్తన భావంలో లీనం కాకుండా కేవలం   శ్రవణ పేయంగా పాడజూసిన పసిభక్తులు ఆత్మ నివేదన స్థాయికి ఎదగాలని    ప్రయత్నం చేయటం లేదు.

              ఇక స్మరణం సంగతి ఓ రామ నీ నామ మెంతో రుచిరా... జుంటితేనెల       కన్నా, పనసతొనల కన్నా, వెన్న మీగల కన్నా ఎంతెంతో రుచిరా అని    నామస్మరణం చేశారు బాగానే ఉంది. అదే నోటి తోటి ఎంతో చేదురా అని       కూడా అంటున్నారు. అర్చనం, సేవనం ప్రక్కన పెట్టి అసలు దేవుణ్ణి ఎలా      బుట్టలో వేసికోవాలా, ఆయనకు ఎలా గ్యాస్ కొట్టాలా నే యావలో భక్తులు పడిపోయారు. ముఖస్తుతి బెడిసి కొట్టినప్పుడు ముఖాన పట్టుకొని        దేవుడంతటి వాడిని దూషించి దులిపేయటానికి సైతం మనిషి వెనుకాడలేదు.

              నను బ్రోవమని చెప్పవే అని దేవుళ్ళ భార్యలను రికమెండేషన్     కోసం పంపారు. ఆయన గారు చక్కగా మరుకేళిలో సొక్కియున్నప్పుడో,        మీరిద్దరు కలిసి ఏకాంతంలో ఏకశయ్యపై నున్నప్పుడో కాస్త చెప్పు వింటాడు    అని ఆవిడకు నూరిపోశారు. పతిదేవు వడిలో మురిసేటి వే విభునికి     మామాట వినిపించవమ్మ అని చిట్కా చెప్పారు. ఎంతకీ కోర్కె లీడేరని      భక్తుడు ఎవడబ్బసొమ్మను కొన్నావు నీకే నేను పెట్టుబడి పెట్టాను అని        చొక్కా కాలరు పట్టుకుని దేవుణ్ణి నిలదీశాడు.

              ఇక వందనము, దాస్యము ఎంత చక్కగా చేస్తున్నారో మనము       ఎరిగినవే. తరువాత స్థాయి సఖ్యము. అంటే దేవుడితో వివాదం తీరి భక్తుడు     మరో రకం పా అందుకుంటాడు. కమలాకుచ చూచుక కుంకుమతో –   నియతారుణి తాతుల నీలతను అంటూ దేవుడి బుగ్గలపై సిగ్గులు మొగ్గలు తొడిగేలా చేస్తాడు. కూచోన్నతే కుంకుమ రాగ శోణే  నమస్తే అంటూ దైవం   మెలికలు తిరిగి పోయేలా చేస్తాడు. పట్టుపానుపు పైన పవ్వళించరసామి       అని దేవుడిని పడుకోబెట్టి జోల కూడా పాడుతాడు. దూదేకు సిద్దయ్య        చెప్పిన తొమ్మిది రకాల భక్తి నాకు నిజానికి తొంభై రకాలుగా   కనపడుతున్నది. ఏ రకంగా భక్తి చేసినా మనిషి కోరేది ఒక్కటే. అది సుఖం.    భక్తి కూడా సుఖంగా ఉండాలి. మనం కొట్టే గ్యాసుకు దేవుడు ఉబ్బితబ్బిబ్బుకావాలి. మనం తిడితే దేవుడు ఒంగి లొంగిరావాలి. మన        బాటకు ఆయన అడ్డు రాకూడదు. అడ్డొస్తే అయిపు లేకుండా చెయ్యాలి.      దేవుడు మనం చెప్పినట్లు వినాలి. దేవుడు ఉన్నదే మన కోసం. లేకపోతే       దేవుడుంది ఎవరి కోసం ? అందువల్లనే దేవుడు మనిషి కోరుకున్న    రూపంలోకి మారుతూ మనిషి చేతిలో మైనపు ముద్దలాగానో, మట్టి      సుద్దలాగానో ఉండి తీరాలి. నీ చేతికి ఎముకలేదంటే, సంపదలియ్యాలి. నీ        రూపం మనోహరం అంటే సై పోవాలి. మరి ఇం మంచి దేవుణ్ణి      కీర్తించాలంటే ఎంత మంచి వాయిద్యాలు కావాలి ? అందుకే ఈ మధ్య పెద్ద   కేసియోలు, లౌడ్ స్పీకర్లు కూడా వాడుతున్నారు. అందుకే నా కనిపిస్తుంది   సర్వసృష్టిలో మనిషి తల మానిక అని.