31, డిసెంబర్ 2012, సోమవారం

ఓ గొప్ప పరిష్కారం

ఓ గొప్ప పరిష్కారం
గీటురాయి 12-1-1990
              నా కవితా వధూటి వదనంబు        నెగాదిగా జూచి  రూపరేఖా
                 కమనీయ వైఖరులు గాంచి,ళీ భళీ యన్న వాడె,
                 మీదేకులమంచు ప్రశ్నవెలయించి చివాలున లేచి పోవుచో
              బాకున గృమ్మినట్లగును ప్రార్ధివ చంద్ర !వచింప సిగ్గగున్ !

              అని ఆనాడు గుర్రం జాషువ గారు బాధపడ్డారు. కులం ఏదో     తెలుసుకున్న        తరువాతనే గౌరవం ఇవ్వటం మన దేశ సంస్కృతిగా     స్థిరపడిపోయింది. కులం తక్కువ వానే ఏకలవ్యుడి వేలు నరికించారు.       కులం తక్కువవానే కర్ణున్ని అపహసించారు. కులం తక్కువ వానే    అంబేద్కర్ ను అంరానివాడిగా చూచారు. కులం తక్కువ వానే జగ్జీవన్        రామ్ తాకిన విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశారు. కులం తక్కువ వాళ్ళు        కావటం వల్లనే దళితుల్ని ఆలయాలలోకి రాకుండా అడ్డుపడుతున్నారు.      కులం తక్కువ వాళ్లందరికీ ఆస్తిహక్కు లేకుండా, ఆయుధం ధరించే హక్కు    లేకుండా, మనుధర్మ శాస్త్రాలు అమలు చేశారు. కులం తక్కువ వాడు     కూటికి ముందు అంటూ చీత్కరించటం సామెతగా మారింది. అంరాని        వాళ్ళుగా ప్రకటించి సాటి మానవుల్ని ఊరిబయట ఉంచి శతాబ్దాల తరబడి వారిని సాంఘికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా అణచివేశారు. సత్యకామ     జాబాలి మొదలు అంబేద్కర్, వి.టి. రాజశేఖర్, వీరమణి, కత్తి పద్మారావు వరకు దళిత నాయకులందరి వాదనా ఇదే. 25-12-1989 న హైదరాబాదులో మనుస్మృతిని తగులబెడుతూ దళిత నాయకులంతా ఈ విషయాలే        మాట్లాడారు.

              అయితే హిందూ మతంలోని సంస్కరణ వాదులు మాత్రం జరిగిన     అన్యాయాలేవో జరిగిపోయాయి. ఇక మీదట పాత తప్పులు సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిభ అనేది అగ్ర కులాల వారి గుత్త సొత్తు ఏమి కాదని       వారు నిరూపిస్తున్నారు. అసితకేశకంబళ్, మక్కలి ఘోషాల్, పూర్ణకాశ్యప,   ప్రకృ కాత్సాయన్ మొదలైన మేధావులంతా హీన కులాల వారేనని వారు        చెబుతారు. పైగా రామాయణం రాసిన వాల్మీకి బోయ, భారతం రాసిన        వ్యాసుడి తల్లి బెస్త, నాయనమ్మ చండాల స్త్రీ, అవ్వ మాదిగ అని అంటారు.      తెలివికి కులానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాకపోతే తరతరాలుగా      కులాల పేరుతో దళితుల మీద దోపిడీ కొనసాగింది. గనుక వారిని అందరి    స్థాయిలోకి తేవటం కోసం వారు చదువుకొని ఉద్యోగాలలోకి వచ్చేందుకు       రిజర్వేషన్లు ఇచ్చారు గనుక అది సమంజసమే నంటున్నారు. అన్ని పార్టీల        నాయకులు ఈ విధానాన్ని సమర్ధించారు.

              కాని దేశంలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అనే రెండు కులాలే    ఉన్నాయి కాబట్టి కులం ప్రాతిపదిక మీద గాక ఆర్ధిక ప్రాతిపదిక మీద       రిజర్వేషన్లు ఇవ్వాలని అల్లర్లు లేవదీశారు కొందరు. అలాగైతే ఉన్న వాళ్ళ        ఆస్తి లేని వాళ్ళకు పంచి అసమానతలు రూపు మాపండి. భూమిని    పరిశ్రమలను జాతీయం చెయ్యండి. కులాలను రద్దు చేసి అందరూ విచక్షణా        రహితంగా వివాహాలు చేసుకోండి అని దళితులంతా ఎదురు ప్రతిపాదనలు చేశారు. ఎక్కడైనా బావా అను గాని ఇక్కడ మాత్రం అనోద్దు అని అగ్రవర్ణాల   నాయకులు కొందరు అడ్డుపడ్డారు. అటు కులాలను రద్దు చేయక, ఇటు       రిజర్వేషన్లు ఇవ్వక మమ్మల్ని డకత్తెరలో పెట్టాలని చూస్తే సహించమనీ, హరిహరాదులు ఏకమై వచ్చినా మమ్మల్ని ఆపలేరని హరిజనులు       అరిచారు.

              ఇరు పక్షాల వారి వాదోపవాదాలు, అల్లర్లు ఆందోళనలు సభలూ       సమావేశాలు ఊరేగింపులూ ఉపన్యాసాలు చూశాక కుల నిర్మూలన అనేది   ఇండియాలో అసాధ్యమైన విషయం అని నిర్ధారణ అయ్యింది. కులసంఘాలు     మరింత పటిష్టం అవుతున్నాయి తప్ప అవి కూలిపోవటం లేదు. కాంగ్రెస్    నేతలే కొంతమంది ఈ మధ్య జనాభా ప్రాతిపదిక మీన్ని కులాలకు   రిజర్వేషన్లు ఇవ్వటం మంచిదని సూచించారు. ఇది శాశ్వత పరిష్కారాన్ని   ప్రసాదించే ప్రతిపాదన. ఎలాగంటే న దేశ జానాభాలో ప్రస్తుతం స్థూలంగా       షెడ్యూల్డ్ కులాల వారు 18% , షెడ్యూల్డ్ తెగలవారు 8%, వెనుకబడిన       తరగతులవారు 44%, అగ్రకులాల వారు 12%, ముస్లిములు 12%, క్రైస్తవులు    3%, సిక్కులు 2%, బౌద్దులు జైనులు 1% ఉన్నారు. ఈ నిష్పత్తిలో అందరికీ     రిజర్వేషన్లు ప్రసాదిస్తే సమస్యకు శాశ్వత సమాధి కట్టవచ్చు. ప్రతి పదేళ్ళకు        జరిగే జనాభా లెక్కల్లో కులాలవారీ జనాభా వివరాలు కూడా సేకరిస్తే రిజర్వేషన్ల శాతం ఈజీగా లెక్కకట్టి ఆయా కులాల వాళ్ళకు ఇవ్వవచ్చు.    ఏమంటారు ?











బంగారంలాంటి సలహా



బంగారంలాంటి సలహా
గీటురాయి 6-12-1991
         
          ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఈశ్వరరావు పరిస్థితి అచ్చం ఇలాగే తయారైంది. ఎప్పుడూ దిగులు ముఖం పెట్టుకొని అప్పు అడిగే ఈశ్వర్రావును అసలు సంగతి ఏమిటి అని అడిగాను. ఢామ్మని పగలిన నీళ్ళ కుండలాగా భోరున ఏడుస్తూ తన కథ వివరించాడు. తాను అక్కడా ఇక్కడా పరాని పాట్లుపడి సంపాదించి తెచ్చిందంతా భార్య బంగారం కోసం ఖర్చు చేస్తుందట. బంగారం పోగయ్యిందన్న సంబరమేగాని ఇంట్లో గానీ లేక డబ్బుకు కటకట లాడాల్సి వస్తుందనీ, ఈ అప్పుల వేట తప్పటం లేదనీ వాపోయాడు.

              ఏ బ్యాంకులోనో డబ్బు దాచుకోవచ్చు గదా అని ఓ ఉచిత సలహా పారేశాను. రేప్పొద్దున బ్యాంకులో వేద్దాం లెమ్మని బీరువాలో దాస్తే, రాత్రికి రాత్రే ఈశ్వర్రావు భార్య ఆ డబ్బు కాజేస్తున్నదట. ఇంటిగుట్టు పొరుగిళ్ళలో చెప్పే చెల్లెలు, దొంగిలించే భార్య, చేసే అప్పులు తీర్చే అప్పులతో యమ యాతనలు పడే ఈశ్వర్రావు కొంప నరకప్రాయమయ్యిందట.ఆ ఇంటికేం బంగారం లాంటి సంసారం అంటారు గాని ఆ బంగారమే ఈ సంసారంలో చిచ్చు పెడుతుందని గ్రహించాను. వచ్చిన డబ్బంతా బంగారం రూపంలోకి మారిపోతే అవసరాలు తీరేదెలా?అవసరానికి బంగారం అమ్ముదామంటే ఆ భార్య ఊరుకోదు. పుట్టింటికి ప్రయాణమౌతుంది. ఇంట్లో నానా అల్లరీ చేస్తుంది. ఇంటి పేరు క్షీర సాగరం వారు. ఇంట్లో మజ్జిగ చుక్కకు గతిలేదు అన్నట్లయ్యింది ఈశ్వరావు కుటుంబ పరిస్థితి. ఇంట్లో ఇల్లాలి పోరు, బయట బాకీల పోరు – ప్చ్ ! ఈశ్వరరావు ! ఎవర్రా నిన్ను ఆదుకొనేది అని ఆఫీసు స్టాఫంతా ఈడిగిలబడ్డారు.

              పొట్టకూటికి పైసలు దొరకని దేశంలో పొదుపు పొదుపు అని పెద్ద ఉద్యమం చేపట్టారు. పొదుపు పేరుతో పేదవాళ్లు జమ చేసిన డబ్బంతా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు తరలి వెళుతోంది. మనం చేసిన పొదుపుకు బ్యాంకుల వాళ్ళు ఇచ్చే వడ్డీ తక్కువ, మనం చేసిన అప్పుకు గుంజే వడ్డీ ఎక్కువ. ఈ వడ్డీ వ్యాపారం తోటే బ్యాంకులు బ్రతుకుతున్నాయి. ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే ఒకసారి మనం డబ్బు బ్యాంకులో ఫిక్స్ డ్ అయిందంటే, అది భార్య జాతీయం చేసుకున్న బంగారం లాగా మారిందన్నమాటే. దాన్ని తీసుకుందామంటే సవాలక్ష షరతులు. ఆగబోగాలు అంకమ్మవి, పొలికేకలు పోలేరమ్మవి అన్నట్లుగా భార్య పెద్ద బ్యాంకర్ లాగా మారితే, ఈశ్వర్రావు దరిద్రపు పెద్దన్న లాగా తయారయ్యాడు. ఆకలిగొన్న సింహానికి నిగ దొరికినట్లుగా ఆవిడ సంతోషపడుతున్నదేగాని, అవతల ఈశ్వర్రావు ఎన్ని అవస్థలు పడుతున్నాడో గమనించడం లేదు. తెలుగింటి ఆడపడుచులు, భాగ్యనగరంలోని బూబమ్మలు కూడా ఈశ్వర్రావు కొంపలో కొనసాగుతున అలజడిని గమనించి, బంగారం కోసం పాకులాడి బంగారం లాంటి కాపురాలు కూల్చుకోవద్దని గోల్డ్ బాండ్ లాంటి సలహా పారేస్తున్నాను.

వికృత చేష్టలు విపరీత ఫలితాలు



వికృత చేష్టలు విపరీత ఫలితాలు
గీటురాయి 27-11-1992

ఆలిని వంచుకోలేక తగవర్లను బతిమాలుకొనేవాడి బతుకు రోత. నాట్యకత్తెల వెనక జేరి తాళాలు వాయించే వాడి బతుకు రోత. వేశ్య కడుపున పుట్టిన వాడి బతుకు రోత. చుట్టు పక్కాల జనం చీదరించుకొనే వాడి బతుకు రోత. ఆఫీసర్ల ఆగ్రహానికి గురైన వాడి బతుకు రోత. సెక్స్ మార్పిడి చేయించుకున్న వాడి బతుకు రోత. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన దాని బతుకు మరీ రోత అంటూ డెన్మార్క లోని పియరీ తన బతుకును గురించి తెగ బాధపడి పోతోంది.

ఏమిటి సంగతి అని ఆరా తీస్తే ఆవిడ గారు పెమ్మీ అండర్సన్ అనే మరో ఆమెతో కలసి కాపురం పెట్టిందట. కొన్నేళ్ల పాటు ఇద్దరు ఆడవాళ్ళూ గుట్టుగా కాపురం నెట్టుకొచ్చారు. ఈ దశలో పెన్నీ గారికి పిల్లల మీద మక్కువ కలిగింది. పియరీకి తెలియకుండా ఆసుపత్రికి వెళ్లి కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా చక్కని ఆడపిల్లను కంది. పిల్ల పోషణ భారంలో సగం పియరీ భరించాలంటూ పేచీ మొదలు పెట్టింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నది.

సలక్షణంగా మగాళ్లను పెళ్ళి చేసుకొని కాపురం చేసి పిల్లలని కని మంచి కుటుంబాలను నిర్మించుకోలేక, ఇలాంటి కృత్రిమమయిన, పనులకు పాల్పడి వాళ్ళు సాధించింది ఏమిటి? మీగాళ్ళు వాచినమ్మా , నీ బిడ్డ పెళ్ళి ఎప్పుడంటే మోకాళ్ళు వాచినమ్మా , మొన్ననే అయ్యింది అన్నదట. ఈ పాపపు అలవాటులో పెద్ద పెద్ద క్రీడాకారులు, సినిమా తారలు, రాజకీయ వేత్తలు కూడా ఉండటం గమనించాలి. బాగుపడదామని పోతే బండ చాకిరీ తగులు కుందట. అలాగే వీళ్ళేదో సుఖపడదామని వెర్రి వ్యామోహంలో ఇలాంటి పనులకు పాల్పడతారు గాని దాని పర్యవసానం దిక్కుమాలిన తనంగా ఉంటుంది. 

భాస్కరాచార్యుల వెంట్రుకలైతే మాత్రం వీణకు తంత్రుతౌతాయా ? అలాగే ఎంతటి అందగత్తెలైనా ఏక జాతి కాపురంతో వారసత్వం వర్ధిల్లుతుందా ? కాపురం ఎట్లా చేశావే కమ్మ తిమ్మక్కా అంటా, నువ్వు చెప్పినట్లే చేశానే బొచ్చు తిమ్మక్కా అందట. పాశ్చాత్య దేశాల మహిళలు స్వలింగ వివాహాలను చట్ట బద్ధం చెయ్యాలని ఉద్యమాలు చేశారు. తమ వక్షోజాలను కనబరుస్తూ స్వేచ్ఛగా తిరగటానికి అనుమతించాలంటూ కెనడా నుండి అమెరికా సరిహద్దు వరకూ యాత్ర చేశారు. అక్కడి పురుషులు కూడా స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చెయ్యాలని కోరుతూ సంఘాలు పెట్టారు. ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఈ అలవాట్ల వల్లనే వస్తున్నాయని చెప్పినా వారు వినటం లేదు.

సొదొమ, గొమొర్రా పట్టణాలు ఈ అలవాటు వల్ల మాడి మసై పోయాయట. ఆనాడు ఈ దురలవాటు ఆ పట్టణాలకే పరిమితమై ఉంటే, ఈనాడు క్రమేణా దేశ దేశానా విస్తరిస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. హాస్టళ్ళలో, జైళ్ళలో, స్కూళ్ళలో ఈ అలవాటు స్నేహంవల్ల పుడుతుందనీ, దీన్ని నైతిక విద్య ద్వారా అరికట్టాలని కొందరు సిఫారసు చేశారు. వివాహానంతర జీవితం పట్ల, పిల్లల పెంపకం పట్ల భయంతో కొందరు దీనికి అలవడతారని వారి భయం పోగొట్టాలనీ కొందరు చెప్పారు. చిలకను పెంచి బావురు గానికి అప్పజెప్పినట్లు కాకుండా తల్లి దండ్రులు తమ పిల్లల పెంపకం లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. సమాజంలో మెజారిటీ జనం చెడిపోయినప్పుడు సొదొమ గతే మనకూ పడుతుంది. చీరపోతు లేరేయటం కంటే బొంతను కాల్చేయటమే మేలనుకుంటాడు దైవం.







ఏడ్పు ఏడందాల లాభం



ఏడ్పు ఏడందాల లాభం
                   నవ్వు నాలుగందాల చేటు – ఏడుపు ఏడింటికి అనర్ధం అంటుంటారు.        ఈ సంగతి ఏమో గాని నవ్వాల్సిన సమయంలో నవ్వటం ఏడవాల్సిన    సమయంలో ఏడవటం గనుక చేయకపోతే చేటు తప్పదని ఈనాటి శాస్త్రజ్ఞూలు తేల్చి చెబుతున్నారు. ఖేదానికి మోదానికి తేడా తెలియని రాళ్ళ     లాంటి మనుషులు కొంరుంటారు. వాళ్ళు నవ్వరూ ఏడ్వరూ.           ఇతరులెవారైనా తమ ముందు నవ్వినా ఏడ్చినా స్పందించరు.        తప్పుకుపోతుంటారు. అసలు వాళ్ళ ముఖాలలో ఏ భావమూ మనకు    కనిపించదు. అలాంటి వారి ముఖాలను ఆండ్రీ గ్రోమికో ఫేసెస్ అంటారట.      ఇలాంటి వాళ్ళకు పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ అని తేల్చారు.

              నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. ఏకన్నీటి వెనకాల ఏముందో     ఎవడికి తెలుసు అని ఓ కవి ప్రశ్నించాడు. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే     మగవాడినీ నమ్మరాదని కొంత మంది సూత్రీకరిస్తే, అసలు నవ్వలేని వాళ్ళ నెవరినీ నమ్మవద్దని కొందరు తీర్మానించారు. నవ్వే వాళ్ళ ముందే జారిపడి   కొందరు ఏడుస్తూ ఉంటారు. పొర్లించి పొర్లించి చక్కలిగిలి పెట్టినా కొంతమంది నవ్వరు.  ఇహి అంటారు అంతే. అట్లకాడ ఎర్రగా కాల్చి వాలు పెట్టినా       కొందరు ఏడవరు. అబ్బా అంటారు. కన్నీళ్ళు రాకుండా ఎంతగా నవ్వినా       ఎంతగా ఏడ్చినా ఎంత మాత్రం ప్రయోజనం ఉండదని మానసిక వైద్యులు        కొంత మంది గంట కొట్టి  చెబుతున్నారు. దుఃఖపడువారు ధన్యులు వారు     ఓదార్చబడుదురు అని ఏసుక్రీస్తు చెబితే, విషాదవదనం హృదయాన్ని      గుణ పరుస్తుంది అని సొలోమోను  చెప్పాడు. వాళ్ళ మాటలు నిజమేనని        తెలుస్తోంది. ఏడ్చి మొహం కడుక్కున్నట్లు అనే సామెత చాలా తీసివేతగా   నిర్లక్ష్యంగా అంటుంటాము. ఫలానా పని చేయటం ఏడ్చి మొహం    కడుక్కున్నట్లుగా ఉంది.  అంటే ఏమీ బాగోలేదు అనే అర్ధంతో వాడుతారు.   కానీ హృదయపూర్వకంగా ఏడ్చి , మనసు తేలిక పరుచుకుని, మొహం    కడుక్కున్నాక ఎంత హాయిగా ఉంటుందో అలా ఉందని దాని అసలు అర్ధం.        ట్రాజెడీ సినిమాకు వెళ్ళిన తెలుగు ఆడపడుచులు ఏడ్చి మొహం        తుడుచుకున్నట్లుగా బయటికొస్తారు.
              అప్పుడే పుట్టిన శిశువు ఏడవకపోతే పెద్దవాళ్ళకు పుట్టెడు దుఃఖం    ముంచుకు వస్తుంది. ఏడుస్తున్నావెందుకు బ్రాహ్మడా అంటే, ఒకనాడు నా మొహం  నవ్వి చచ్చిందా అన్నాడట. ఏడ్చి వెంకట స్వామి      అనిపించుకున్నట్లు, ఏడ్చి తద్దినం పెట్టించుకున్నట్లు ఉండకుండా ఎవరికీ      కాన రాకుండా గది లోకి  పోయి తలుపులు మూసి బిగ్గరగా శక్తి కొద్దీ        ఏడవాల. ఆ ఏడవటం కూడా మొక్కుబడి కార్యక్రమంలాగా కాకుండా,     నిజంగానే బాధపడుతూ కన్నీళ్ళు బయటికి పేల్లుబికి వచ్చేలా ఏడవాలట.      అలా చేస్తే దేహంలోని నవనాడులూ సేదదీరి హృదయాలు తేలికపడి     ఆరోగ్యం బాగుపడుతుందని కలకత్తా డాక్టర్ శ్రీ ప్రణయ్ పోతే దార్        అంటున్నాడు. ఈయన ఆ మహా పట్టణంలో ఒక డ్పుల వైద్యశాల (క్రై        క్లినిక్ ) నడుపుతున్నాడు. నిత్యం పని వత్తిడులతోగాని, ఇంటి సమస్యలతోగాని, ఆధ్యాత్మిక మిధ్యాత్మక చింతనలతో గాని సతమతమై   పోతూ అనారోగ్యం పాలైన బాధాసర్పదష్టులు తీరిగా కూర్చుని ఏడవటానికి   అందులో ఆయన సకల సౌకర్యాలు సమకూర్చాడు. అక్కడ చేరిన పేషెంట్లు     ఎవరికి వారే విడివిడిగా ఏకాంతంగా ఏడ్చుకోవచ్చు. లేదా పదిమందితో      కలిసి బృందగానంగా కూడా విలపించవచ్చట. ఒకవేళ ఎంతగా ప్రయత్నించినా ఏడుపురాని గ్రోమీకోలకు గోర్భచెవులకు విషాదభరితమైన      కథలు చెబుతార. అప్పటికీ వారి వదనాల మీద విషాదం అలుముకోకపోతే గుండె చెదిరిపోయే స్థాయిలో, విషాద సినిమాలు ఏడుపు నిషా ఎక్కిందాకా        చూపిస్తార. ఏడుపు రావటం తోటే  వాటిని ఆపకుండా కళ్ళు చెమ్మగిల్లి     ధారాపాతంగా ఓ బొచ్చె నిండేంత వరకూ కన్నీళ్లు రప్పిస్తారట. ఆ దెబ్బతో        మనిషి సంపూర్ణ స్వస్తత పొందుతాట. మానసిక రోగాలన్నీ ఈ వైద్యంతోనే        మటుమాయం అవుతాయట. కానీ ఖర్చులేకుండా రోదన తోనే రోగాలు   పోయే ఈ పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహించి ప్రతి మండల కేంద్రంలో ఒక      డ్పుల ఆసుపత్రి కట్టిస్తే బాగుంటుందని నా సూచన.





             

అర్ధం లేని వాదన



అర్ధం లేని వాదన

                   ప్రకాశం జిల్లాలోని ఒక ఊళ్ళో తురకపాలెంలో అద్దెకు ఉన్నాను.       అక్కడొక అమ్మాయికి పెళ్ళయింది. పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసి తెచ్చారు.    పది మంది అమ్మలక్కలూ చూచి సంతోషించారు. పెళ్లి కొడుకు తరపున       ఒకామె పెళ్లికూతురును చూచి అమ్మాయి ముఖం లద్దాఫ్ ముఖంలా      ఉంది అందట. ఈ మాటతో పెద్ద గొడవ చెలరేగింది. ఇరు వర్గాల వారు        గిరిగీసుకుని పోరాటాలకు దిగారు. పెళ్లి ఆగిపోయింది. వారం రోజుల పాటు ఆ        వీధిలో లద్దాఫ్, లద్దాఫ్ అనే పదాలు మారుమోగి పోతున్నాయి. నాకు    ఉర్దూ రాదు. ఈ లద్దాఫ్ అనే మాట తప్ప మిగతా మాటలు నాకు అర్ధం   కావటం లేదు. సరే నాకెందుకులే అని పట్టించుకోలేదు. నాలుగు రోజుల      తరువాత మా ఆవిడ ఉండబట్టలేక ఇంటావిడను సంగతి ఏమిటని అడిగింది.       అమ్మాయి ముఖం దూదేకులామె ముఖంలాగా ఉంని ఎవరో        అన్నందుకేనమ్మా ఈ తగాదా అని ఆమె చెబితే మా ఆవిడ ఆగ్రహానికి      అంతులేకుండా పోయింది.

              సరాసరి నా దగ్గరకు వచ్చి ఏమండీ, తురక వాళ్ళ ముఖాలు బాగుంటాయా? దూదేకులవాళ్ళ ముఖాలు బాగుంటాయా తేల్చండి అంది.     శ్రీమతి ఇం విజ్ఞానదాయకమయిన ప్రశ్న వేసేటప్పటికి నేను ఆలోచనలోపడ్డాను. దూదేకులవాళ్ళ ముఖాలే బాగుంటాయి అన్నాను తడుముకోకుండా. మరయితే ఈ తన్నులాట ఎందుకు?” అని సంగతి        వివరించింది. ఇన్ని రోజుల్నుండి జరుగుతున్న యుద్దానికి కారణం ఇం   చిన్న విషయమా అని ఆశ్చర్యపోయాను. అసలీ భావన ముస్లిం లలో       ఎందుకు చోటు చేసుకుంది ? అన్న ప్రశ్నే నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.   దోషం ఎక్కడుందీ? దోషం ఇస్లాం స్వీకరించి దాని ఒడిలోకి వచ్చిన వివిధ కులాలు, తెగలవారికి తగిన శిక్షణ నివ్వలేకపోయిన ముస్లిం పెద్దలదా?        ఇస్లాం స్వీకారం తర్వాత కూడా తమ మనసుల్లో నుండి ఆత్మన్యూనతాభావాన్ని తొలగించుకోలేకపోతున్న లద్దాఫ్ లదా ? లేక    ముస్లిములు తమలోనూ రెండు వర్గాలున్నాయని తలపోస్తున్నారా?  ఏమయినా ఈ జాడ్యం ఎంతో ప్రమాదకర        మయిందనిపించింది. విద్య, అజ్ఞానం మూలంగా వెర్రితలలు వేస్తున్న ఈ   మనస్తత్వాన్ని రూపుమాపే సంస్కరణలు ముస్లిం సమాజంలో రావాలని,      సంస్కారంగల ప్రతి ఒక్కరూ దీనికోసం చేతనయింది చేయాలని అంతరాత్మ     బోధించింది.

              ఇరు పక్షాల పెద్దలనూ సమావేశపరిచాను. ఇద్దరి మధ్య నిలబడి     య్యలారా, వారం రోజులనుండి మీ తగాదా వింటున్నాను. విషయం అర్ధంగాక పట్టించుకోలేదు. అయితే నాకు మీ తగాదా కారణం ఇప్పుడే     తెలిసింది. లద్దాఫ్ ముఖం అంటే ఏ గ్రద్ద ముఖంలాగానో ఉండదు. అనేక        మంది సాయిబుల ముఖాలలాగానే ఉంటుంది. రేపు దేవుని తీర్పు    సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు ఆయన మన ముఖాలను    పరీక్షించి తీర్పునివ్వడు, మనమెంతటి వినయ విధేయతలు గలవారమో,   మన హృదయాలు ఎంత అందంగా ఉన్నాయో చూస్తాడు. హృదయాలలో       ఇం మురికి పెట్టుకొని అయిదుపూటలా ముఖాలు ఎంతో తేటగా కడుక్కుంటే మాత్రం      ప్రయోజనం ఏమిటి ? మనిషికి భయభక్తులు, సదాచారం సంపన్నత        ముఖ్యం.  మానవులందరిని సమానంగా చూడటం, సత్క్రియలు చేయటం    ద్వారా హృదయ సౌందర్యం పెరుగుతుంది. తద్వారా మనం      ముస్లిములమవుతాము. ముఖం కంటే మనస్సు ప్రధానం. ఆలోచించండి    అని ఓ లెక్చరిచ్చి వెళ్లిపోయాను. ఏమనుకున్నారో ఏమో తగాదా మట్టుకు   ఆగిపోయింది.