13, నవంబర్ 2012, మంగళవారం

శరీర మాధ్యం ఖలు కామసాధనం



శరీర మాధ్యం ఖలు కామసాధనం
గీటురాయి  3-11-1989
              రసాత్మలను మిన్నులకెత్తే
              విశృంఖల ప్రణయగతిని
              అరికట్టలేవు శాసనాలు
              అడ్డగించలేవు పరిసరాలు

              ఖలీల్ జిబ్రాన్ గారి కవితకు నారాయణరెడ్డి గారి స్వచ్చందానుసరణం        ఇది. చెప్పినవి నాలుగు ముక్కలే అయినా ప్రపంచం ఏమనుకుంటుందో అని     లెక్కా జమా చేయకుండా చెప్పినందుకు కవిని, వాటిని మెచ్చి అనువదించిన అయ్యను అభినందించాలి. కాశీకి పోయినా కనలేరు      మోక్షంబు – కామిగాక మోక్షగామిగాడు అని కాముకులంతా మొదటి     నుంచీ మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ కామినీ వేషధారికి సాధ్వి     నడతలేమి తెలుస్తాయి అంటూ విశృంఖల కామకలాపాలకు, సద్వర్తన      చట్టాలను ఉచ్చులుగా బిగించారు కొందరు. కాశీకి వెళ్ళి కామాన్ని       వదిలిరమ్మన్నారు. అయితే కాశీకి పోయిన కాముకుడు        బెండను వదిలాడు       గాని ముంను వల్లేదట. గుణం మానవే గూటాల పోలీ అంటే నా        మనువైనా మానుతాను గాని నా గుణం మానను అన్నట్లుగా, మతబోధకులు ఎన్ని విధాలా నచ్చజెప్పినా జనంలోని కామ వికారం అణగి    పోలేదు. ప్రభుత్వం చేసిన చట్టాలు, శాసనాలన్నీ నిష్ఫలమయాయి.      కామమనేది మూడో పురుషార్ధం గా చెలామణి అవుతూనే ఉంది.

              గోవా శాసనసభ స్పీకర్ ను, అబలల మీద అత్యాచారాలకు     పాల్పడుతున్న పోలీసులను గుర్తుకు తెచ్చుకుంటే ఒళ్ళు    గగుర్పొడుస్తున్నది. నేను మందు తింటాను. నీవు పత్యముండు అన్నట్లుగా       అవకాశము, అధికారమూ ఉన్న వాళ్ళంతా అడ్డగోలు సుఖాలు        అనుభవిస్తూ సామాన్యజనానికి నీతులు చెబుతున్నారు. వారి పనుల్ని     సమర్ధించు కోవటం కోసం అహల్య, మేనక, తార మొదలైన వాళ్ళ కథల్ని ఏకరువు పెడుతున్నారు. రేడియోల్లో, టీవీల్లో, సినిమాలలో ఈ విశృంఖల    కామ ప్రేరక ప్రసారాలు, ప్రచారాలు కొనసాగిస్తున్నారు. కాముకుల సంతృప్తి     కోసం, దూరదర్శన్ లో యథాశక్తిగా అర్ధరాత్రి సినిమాలు వేస్తున్నారు. అయితే నెయ్యి అని అరచి నూనె అమ్మినట్లుగా ఈ అర్ధరాత్రి సినిమాలలో        కనీసం అర్ధనగ్నత కూడా లేదని అపరకాముక ప్రేక్షకులంతా పెదవి   విరుస్తున్నారు. నిరసన కూడా వ్యక్తం చేశారు. అది విని రాష్ట్రపతి వెంకటరామన్ గారు రాత్రి నిద్రపోకుండా ఈ సినిమాలు చూసి అమ్మో,     ఇం సెక్సా కాస్త మోతాదు తగ్గించండి అని దూరదర్శనం వాళ్ళని      అభ్యర్ధించాడు. సెక్స్ కంటే వయోలెన్సే నయం అని సెన్సార్ బోర్డు వాళ్ళు    నొక్కి వక్కాణిస్తున్నారు. ఆ రెండూ కలిస్తేనే మాకు లాభాలు వస్తాయి అని నిర్మాతలు నిరూపిస్తున్నారు.

              విదేశీ యాత్రకు వెళ్ళి వచ్చి ఓ వి.ఐ.పి. ఆ దేశాలలోని హాయైన        అనుభవాల గురించి అదేపనిగా సమావేశాల్లో చెబుతుంటాడు. విమానంలో ఆగడం చేసిన ఆడిక్ రామారావు మొదలు మొన్న కొరియా యువ     సమ్మేళనంలో కాంతల  వెంటబడిన కాంగీయుల వరకు అందరి ప్రధాన     సిద్ధాంతం ఆత్మానందమే.

              ఈ విషయంలో పూనా పట్టణానికి కొక ప్రత్యేకత ఉంది. శరీర   మాధ్యంఖలు కామ సాధనం అంటూ అక్కడే ఆచార్య రజనీష్ గారు    ఆశ్రమం పెట్టారు. వీడియో పార్లర్ల విషయానికొస్తే అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ నిరుద్యోగులందరికీ వీడియో పార్లర్ల కోసం రాష్ట్ర        ప్రభుత్వం ధన సహాయం చేసింది. ప్రస్తుతం అక్కడ అశ్లీల చిత్రాలు    చూడటానికీ ఆడామగా కలిసి వెళుతున్నారట. పూనా పట్టణంలో అశ్లీల     వీడియో చూస్తున్న ప్రేక్షకుల్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రేక్షకులు ఇలాంటివి చూడటం మా జన్మ హక్కు అన్నారు. పోలీసులు మా     ఆనందానికి అడ్డుపడ్డారని వాపోయారు. సిటీ సివిల్ కోర్టు వాళ్ళకు ఈ వాదం        నచ్చింది. బ్లూ ఫిలిమ్ చూడటం ప్రేక్షకుల హక్కు దానిని ఆపే హక్కు మీకు లేదని కోర్టు పోలీసులకు బుద్ధి చెప్పింది. మన హైరాబాదు కోర్టు కూడా    కేబరే డాన్సులు ఆపటానికి వీలు లేదని తీర్పు నిచ్చింది.

              ఇంతకీ చెప్పవచ్చిందేమిటంటే విశృంఖలతను ఆపటానికి ఖలీల్       జిబ్రాన్ గారి కాలంలో శాసనాలున్నాయి. కాని ఈనాడు విశృంఖలతను             ఆపవద్దని శాసనాలొస్తున్నాయి. అదే తేడా.

లేచింది మహిళా లోకం


లేచింది మహిళా లోకం
గీటురాయి  1-12-1989
               
కులుకు మిటారి, పూ విలుతు చేతికటారి, బంగరు బొమ్మ,     కప్రంపుదిమ్మ, అన్నులమిన్న, చిన్న సంపెంగగున్న, వన్నెల దొంతి,    మువ్వల బంతి, రతనాల తేట, వరాల మూట, పండు వెన్నెల సౌరు, బలు మాణిక్యపు తీరు, వలపుల మొక్క, మేలు తలపుల చుక్క అనటానికి అన్ని విధాలా తగినటువంటి చెలితో కాపురం చేసే పురుషుడిది ఎంత అదృష్టమో        గదా ! అది దేవుని అనుగ్రహం తప్ప మరేమీకాదు అని ఓ భక్త రసికుడు ప్రసంగించాడు.

ఈ ప్రసంగం విన్న ఓ గృహస్థునికి చాలా కోపం వచ్చింది. ఓ   రసికశేఖరా ఇలాంటి శారీరక లక్షణాలతో అలరారే పెండ్లాము నాకు కూడా ఉంది. కానీ ఆమె మానసిక లక్షణాలు చెబుతాను ఓపికతో విను అని  చెప్పటం మొదలేశాడు : -

              గయ్యాళి, మూలుగుబోతు, మాయలాడి, పిసినిగొట్టు, పిశాళి, పెంకె,   బొంకుల పుట్ట, చెడుగు, నిక్కులయిక్కు, చెనటిమంకు, పలుగు, టక్కులాడి,    కల్లరి, టాటోటు, మో, బందెల పుట్టిల్లు, రంకులరాట్నం, రవ్వలమారి, తంటాకోరు, రంతులరావు, ముచ్చు, ఇలాంటి బేరజపు పెళ్ళాని ఏలేవాడి  దౌర్భాగ్య స్థితిని వివరించటం నరుడికీ వశం కాదు. అందగత్తె అవ్వగానే సరిపోదు ఆమె గుణగణాలు కూడా అందగా ఉండాలి. అప్పుడే మొగుడికి సౌఖ్యం అని ఎదురు ప్రసంగం చేశాడు.

         ఇందమ్మా తియ్యకూర అంటే ఇందమ్మా పుల్లకూర ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న ప్రసంగాలు రెండూ విన్నాను. మా ఊళ్ళో ఆరవ   పెరుమాళ్ళు పాడే పద్యాలు గుర్తుకొచ్చాయి :

              మనైమాట్చిల్లాళ్ కణ్ ఇల్లాయిన్ వాళక్కై
              ఎనై మాట్చిత్తాయినుం ఇల్
              ఇల్లదెన్ ఇల్లవళ్ మాణ్చానాల్ ఉళ్ళదెన్
              ఇల్లవళ్ మాణాక్కడై

              అంటే ఇల్లాలి గుణాలు లేని భార్యలో ఇతర గొప్పదనాలు ఉండి మాత్రం లాభమేమిటి ? భార్య సుగుణవతి అయితే భర్తకు అన్నీ ఉన్నట్లే. ఆమె శీలవతి కాకపోతే అతనికి ఉన్నదేమిటి ? అని దాని అర్ధమట.

              అందమూ, చందమూ అన్నారు పెద్దలు. అందం బాగా ఉండి చందం  బాగా లేకపోతే పెద్ద దెబ్బేనని మీకు అర్ధమయ్యే ఉండాలి. ఇరిగిపోయిన చెంపలకు ఇప్పనూనె పెడితే సానిదాని ముఖం కూడా నవనవలాడుతుంది, అందానిదేముందోయ్ అంతా మేకప్ మహత్యం అంటుండే వాడు        సుబ్బారావు. కానీ ఇగురం తప్పిన దాని ఇంటి వెనక చూడు ఓగెం తప్పిన దాని వం ఇల్లు చూడు అన్నారు. ఇగురం అంటే పొదుపు ఓగెం అంటే     నేర్పు అన్నమాట. ఈ రెండూ కొరవడిన ఇల్లాలి పనితనం ఇక చెప్పనలవి  గాకుండా ఉంటుంది.

గుండమ్మకధలోఘంటసాలపాడిన పింగళి గారి పాట ఇప్పటికీ మగాళ్ళగుండెల్లో మారుమోగిపోతోందిః         
"లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
పల్లెటూళ్లలో పంచాయితీలు…
పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల 
మగధీరులనెదిరించారు
నిరుద్యోగులను పెంచారు…

చట్ట సభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి
డిల్లీ సభ లో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు…
విడాకు చట్టం తెచ్చారు" 

ఇదంతా ఇప్పుడెందుకు చెప్పానంటే ఉద్యోగాలు చేసే స్త్రీల ప్రవర్తనా     సరళి మీద ఈ మధ్య అంతర్జాతీయ సంస్థ ఒకటి అధ్యయనం చేసి ఒక   నివేదిక వెలువరించింది. ఆర్ధిక స్వేచ్ఛ, భర్తకు మించిన స్థాయిలో ఉద్యోగం    దొరకటం, పరపురుషుల మధ్యలో పనిచేయవలసి రావటం... ఇలా రక  రకాల కారణాల వల్ల మరింత అందంగా కానరావటానికి, పరపురుషుల  సాంగత్యంలో తడిసిపోవటానికి ఆడవాళ్ళు ఉబలాటపడుతున్నారనీ, ఈ   పరిస్థితిని మరింత సొమ్ము చేసుకోవటానికి పురుషాధిక్యతా సమాజం     పాల్పడుతున్నదని ఆ సంస్థ వెల్లడించింది. ప్రతీ చర్యకూ ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ చెప్పిన సూత్రం ఇందుకేనేమో!  
అయితే కొందరు మగపిడివాదులు మాత్రం ఎప్పటిలాగానే ఆడవాళ్ళుబాక్సింగ్ లాంటిఆటలకు పనికిరారు.వాళ్ళుఇళ్ళల్లోపడిఉండాల్సిందేకానీబయటకు రాకూడదు,   వస్తే  సమాజం నాశనమై పోతుంది" అనివాదిస్తున్నారు.ఎందుకంటే లింగ వివక్ష దేవుడే కల్పించాడట.స్త్రీలను దేవుడేఅలా సున్నితంగా చేశాడు.మనిషి ఆ నియమాన్ని మీరకూడదు అంటున్నారు.మహిళా సంఘాలవాళ్ళు మాత్రం ఇదంతా పాతచింతకాయపచ్చడి అని కొట్టిపారేస్తున్నారు.ఆడది అంతరిక్షంలోకి కూడా వెళుతుంది అంటున్నారు.అంతర్జాతీయ సంస్థ ఏంచేస్తుందో మరి?
 

దారి తప్పినవాళ్లు


               దారి తప్పినవాళ్లు
గీటురాయి  14-7-1989
              వెన్నెలతో విందు చేయు పున్నమి చంద్రుడవు నీవు
              కళలు మాసి కాంతి బాసి గ్రహణం పాలైనావా?
              విరబూసిన చెట్టులాగా మురిసిపోవు నీ బ్రతుకే
              వాడి మాడి మోడుబారి వన్నె మాసిపోయిందా ?
              టికోయి నీ పయనం ? ఏమిటోయి ఈ వైనం ?
              నోయి ఈ ఘోరం ? ఎవరిపైనా నీ వైరం ?

              అంటూ పెడదారి పట్టిన వాడిని ప్రజలు పలు రకాలుగా   ప్రాధేయపడతారు. సరైన దారిలోకి రమ్మని సకలవిధాల చెప్పి చూస్తారు    కానీ వాడు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటూ మొండికేస్తాడు. దారి    తప్పటంలో ఉన్న మజా దారిలో ఉన్న వాళ్లకేం తెలుస్తుంది అంటూ  దబాయిస్తాడు. జపం వదలి లొట్టల్లో పడ్డావేమిరా నాయనా అంటే     డ్డిగంలోనే మిడత పోటులాగా మీ గోల ఏంది పెద్దాయనా అంటాడు. ఒకవేళ      కాళ్ళు చేతులు కట్టేసి కొట్లో పడేస్తే ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారనీ, నా కిష్టంలేని ఈ కొట్టు తునాతునకలై పోనీ, కూలిపోయి ధూళిలో     కలిసిపోనీ, కాలిపోయి  బూడిదే మిగలనీ అంటూ పెద్దగా రోదిస్తూ   శాపనార్ధాలు పెడతాడుగానీ దారిలోకి రాడు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచింది   అన్నట్లుగా తన చుట్టూ పక్కలందరి మనో నిబ్బరాన్ని దెబ్బతీసి క్రమంగా   తన పెడత్రోవలోకే గుంజటానికి ట్రై చేస్తాడు ఈ గుంజాటనలో లొంగిపోయిన   జనం చివరికి వాడికి వందిమాగదుల బృందంగా మారిపోయి సంచలనం సృష్టిస్తారు. మార్గం తెలియని మందలు ఇలానే తయారవుతుంటాయి. దారి   తప్పిన వాళ్ళ వల్లనే వర్గాలు ఏర్పడుతుంటాయి.

              గుణం మానవే గూటాల పోలీ అంటే, నా మనువైనా మానుతాను గాని  నా గుణం మాత్రం మానను అందట. అలాగే చెడ్డ దారిలోనే మజా   మరిగిననాడు ఇక ససేమిరా సరికానంటాడు. మొదట్లో కొంచెం      మొహమాటం, లజ్జ ప్రదర్శించేవాడు గాని రాను రాను సిగ్గు బిడియం    చీమూ నెత్తురు లాంటివన్నీ వదిలేసి బాహాటంగా నిర్భయంగా చెడుదారిలో    సర్కస్ ఫీట్లు చేస్తాడు. ఇలాంటి వారిని మతస్తులంతా దారి తప్పినవారనీ,  జారిపోయిన వారనీ, ముఠా మేస్త్రీలనీ అంటారు. వీళ్ళు కాస్త బలపడి, పార్టీ   సమావేశంలో తమ బలం ప్రయోగించి, అధికారంలో ఉన్న తమ సోదరులను   క్రిందికి పడదోస్తే,  వీళ్ళనే వెన్నుపోటు దారులనీ, బాక్ బైటర్స్ అనీ అంటారు. అలా పడద్రోయకుండా వేరే కుంపటి పెట్టుకుంటే ఆత్మాభిమానులు అంటారు.    ఇలా తమ దారిలోకి రాకుండా పక్క దారులు పట్టిన వాళ్ళకు ఆయా వర్గాలవారు తమ పరిభాషలో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంటారు.

              అయితే ఆ చెడిపోయినవాడు కూడా గురువుకు తిరుమంత్రం   నేర్పినట్లుగా తన మార్గంలోని మజా గురించి పైవాళ్ళకు నచ్చజెప్పజూస్తాడు.      గురువులు వస్తున్నారంటే ఇంకేం గోచీలు విప్పి తోరణాలు కట్టండి అని తన    మందను పురమాయిస్తాడు. గుడ్లగూబను చంకలో పెట్టుకుని   సమావేశాలకు పోయినట్లుగా ఉంటుంది అధ్యక్షులవారి పని. ఈ మధ్య వివిధ పార్టీల సమావేశాలలో దారిలో ఉన్నవాళ్ళు, దారి తప్పినవాళ్లు  తెగతన్నుకుంటున్నారు.కొన్ని పార్టీలలోనైతే ఇదొక సంప్రదాయం అయిపోయింది. అసలు తన్నుకోవటమే మా సంస్కృతి అంటున్నారు.పైగా మా పార్టీలో ఎంతో స్వేచ్చ ఉంటుంది.అదే మా ప్రత్యేకత అంటున్నారు.పార్టీ లోపల ఎంతగా తన్నుకున్నా బయటకొచ్చేసరికి మేమంతా ఒకటేనంటారు.తడిక నెట్టింది ఎవరంటే ఆలులేని వాడన్నట్లుగా ఆయాపార్టీలు తమలోని అసమ్మతి వాదుల పట్ల ఉదారంగా  వ్యవహరించి అనేక రాయితీలు కల్పిస్తున్నా వీళ్ళు మాత్రం తప్ప తాగి కులం మరచినట్లుగానే   ప్రవర్తిస్తున్నారు. సృష్ట్యాది నుండి దారి తప్పటం అనే లక్షణం నవయవ్వనంతో నిత్యనూతనంగా ఉంటూ వస్తోందని అభిజ్ఞుల ఉవాచ. దారి ప్పినవాళ్ళ  వల్లనే దారిలో ఉన్నవాళ్ల బొక్కలు బయటపడతాయని మరికొందరి అభిప్రాయం. ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలారా, ఇదేమిటో మీరే ఆలోచించండి !



               

మతాల పేరిట మంటలు



మతాల పేరిట మంటలు
గీటురాయి  13-10-1989
              కందిరీగల పట్టు కగిరేపగవచ్చు
              మానిపింపగ లేము దానిపోటు
              చెట్లలో బెబ్బులింజెనకి రావచ్చును
              తప్పించుకొన లేము దాని కాటు
              పరచునశ్వము తోకబట్టి ఈడ్వగవచ్చు
              ప్పించుకోలేము దాని తాపు
              కాకచే పొరుగిల్లు కాల్చి రావచ్చును
              తన ఇల్లు కాపా తరముగాదు
              దుర్ణయులు మీదెరుంగక దుండగమున
              కార్యతతులెల్లజేసి తత్కార్యఫలము
              లను భలింపుదురాయాయి అవసరముల
      
              అని ఓ కవి చెప్పిన నీతుల్ని నేటి నేతలు లెక్క చేయటం లేదు. ఏదో        ఒక సంచలనం సృష్టించేపనికి, ప్రశాంతంగా ఉన్న దేశంలో అల్లకల్లోలం రేపే      పనులకు పాల్పడుతున్నారు. అలజడులకు ఆజ్యం పోస్తున్నారు. ఐక్యతకు,     సఖ్యతకు విఘాతాలు కలిగించి తమాషా చూస్తున్నారు. అందుకే ఒక కవి       వీళ్ళను గురించి ఇలా అన్నాడు.

              తెగే వరకు దారంలాగి
              ఆఖరిక్షణంలో చుట్టూ మూగి
              అనునయ వాక్యాలు చెప్పటం
              అదీ మనకు ఆచారం !
              అప్పుడే మన మధ్య ఏర్పడింది
              శత యోజనాల దూరం

              ఈ మధ్య అఖిల భారత హిందూ న్యాయవాదుల సదస్సు అనే ఒక   విచిత్రమైన  సభ హైదరాబాదులో జరిగింది. అందులో మన స్పీకర్    నారాయణరావుగారు అత్యుత్సాహంతో పాల్గొని, అక్కడి వాళ్ళను చూచాక    పొంగుకొచ్చిన ఆవేశంలో కాబోలు, తన మనసులో దాగి ఉన్న ఒరిజినల్   భావాలను వెళ్ళగక్కారు.

              ఈ దేశంలోని ముస్లిముల్ని మైనారిటీలని రాజ్యాంగం ఎక్కడా   పేర్కొనలేదని, కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలని అన్నారు. ఇక      దీని మీద మమ్మల్ని మైనారిటీలు కాదంటావా అని ముస్లిం నాయకులు        ఎగబడితే,వి ఆయన వ్యక్తిగతమైన అసలు మాటలనీ, స్పీకర్ హోదాలో   చెప్పినవి కాదనీ చెప్పి తెలుగు దేశం నాయకులు చేతులు        దులుపుకున్నారు. నారాయణరావు కూడా అదే పా పాడారు. గోల గోవిందుడిది అనుభవం వెంకటేశ్వర్లుది అన్నట్లుగా పదిమందీ కలిసి పిచ్చి   నారాయణరావుని ఆడిపోసుకొని గోల చేస్తున్నారు తప్ప మతోన్మాదం ఆవహించి దురహంకారంతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకై అన్యాయమైన     ఒక సదస్సు నిర్వహించిన న్యాయవాదుల్ని గాని, వాళ్ళకు అంగా నిలబడి        చోద్యం చూసిన రాజకీయ నాయకుల్ని గాని ఎవరూ పల్లెత్తు మాట అనటం        లేదు.

              ఈ రకంగా న్యాయవాదులు కూడా మతం పేరుతో ఏకమై పోతుంటే    ఇక న్యాయం ఎక్కడ బతుకుతుంది ఈ దేశంలో ? గోకుడుకు గీకుడే మందు అనట్లుగా ఈసారి ఇంకో మతానికి చెందిన న్యాయవాదులు గేదర్ అవుతారు.   అలా ఫలానా మతం డాక్టర్లు, ఫలానా మతం ఇంజనీర్లు, ఫలానా మతం      పాకీవాళ్లు సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. చతురతకు జాకాడేగాని      చేతిలో చిల్లిగవ్వ లేదు అన్నట్లుగా ఈ మ సంఘాల మేధావుల సరసాలు,        విరసాలు దుమ్మెత్తి పోసుకోవటాలు భారీగానే జరుగుతాయి గాని      భారతీయుల ఐక్యతే గంగలో కలుస్తుంది.

              వేరే పనీపాటా ఏమీ లేని సోమరిపోతులంతా ఒక చోట చేరి తగాదాలు        పెట్టేందుకు ఎదోదో చెబుతుంటారు. కానీ ఈ దే సౌభాగ్యం కోసం పొలాలలో,        ఫ్యాక్టరీలలో దివా రాత్రాలూ కష్టపడి పని చేస్తున్న వ్యవసాయ కూలీలు,     కార్మికులు – వారుపడుతున్న శ్రమ – వారి దుర్భర జీవితాలు – ఈ కడుపు నిండిన మతమేధావుల కంట బడటం లేదా ? మతాల పేరిట మంటలు రేపే      ఈ రాజకీయ నాయకులకు దేశాభివృద్ధి మీద మాత్రం శ్రద్ధ ఉన్నదో అర్ధం      కావటం లేదా ? మతాలన్నింటికీ అతీతంగా ఉండే భారతీయుల        ఐక్యతను చీలదీస్తున్న నేతల బుద్ధులను ప్రజలు ఓ కంట కనిపెట్టాలి. వారి       మాయలో పడి మాడి మసై పోకుండా శాంతియుతంగా బ్రతకాలి.

ప్రతిపక్షాల ఐక్యత



ప్రతిపక్షాల ఐక్యత
గీటురాయి  24-11-1989
              దేవతలతో జోడు కూడితి
              రక్కసులతో కూడి ఆడితి
              కొత్త మిస్కుల తెలివి పముని
              మంచి చెడ్డల మార్చితిన్
              చూతునా ? అని చూసితిని, మరి
              చేతునా ! అని చేసితిని, ఇక
              చూడ చేయగరాని వింతలు
              చూసి కన్నులు కట్టితీన్

              అని గురజాడ అప్పారావు గారు బుద్ధి చపలతతో కొత్త కోర్కెల్లో        తగులుకొని లంగరెత్తు అంటాడు. రకరకాల ఆశయాలతో అలరారుతున్న    ప్రతిపక్షాల వాళ్ళంతా ఇలాగే పదవీ వ్యామోహంతో, తమ తమ ఆశయాలను     కలబోసుకొని ఒక ఫ్రంట్ గా కలిశారు. దరిద్రుడికి సద్దికట్టి ఇస్తే, ఊరి వెలుపల    కుంటకానే భోంచేసి పోయాడ. దారిలేని బావి, దాపు లేని కొంప        అన్నట్లుగా, కాంగ్రెసును కూల్చి వీళ్ళు నిర్మించి ఇస్తామంటున్న       నవభారతదేశం ఎప్పటికొస్తుందో అర్ధంగాకుండా ఉంది. ఫ్రంట్ కట్టింది      మొదలు అది కూలిందాకా ఒకటే పోరు అన్నట్లుగా ఒకరినొకరు నిందించుకుంటున్నారు. బి.జె. పి. జెండాలు రెపరెపలాడుతున్న వేదిక మీద నేను చచ్చినా ప్రసంగించనని వి. పి. సింగ్ మొరాయిస్తే అక్కడ బి.జె.పి      వాళ్ళు జనతాదళ్ వాళ్ళు తన్నుకోబోయారు. రామజన్మ భూమికి      శంకుస్థాపన చేసే సందర్భంలో  బాబరీ మసీదు మీద ఎక్క చెయ్యి వేస్తారోనని త్రిపాఠీతో పాటు సింగ్ కూడా అయోధ్యకు వెళ్లినందుకు బి.జె.పి.     వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు.

              కాంగ్రెస్, బి.జె.పి ముఖాముఖిగా నిలబడ్డ చోట ఎవరికి ఓటెయ్యాలో   తేల్చుకోవటం ప్రజలకే వదిలేస్తామని కమ్యూనిస్టులు అన్నారు. ఇక బి.జె.పి   నాయకుడు దత్తాత్రేయ తనలోని విసుగు దాచుకోలేక కాంగ్రెస్,   కమ్యూనిస్టులు ముఖాముఖిగా ఉన్న చోట బి.జె.పి వాళ్ళు ఇండిపెండెంట్లకు   ట్లేస్తారని తేల్చి చెప్పాడు. ఒక వే నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే        బి.జె.పి లేని ఫ్రంట్ నే మేము సమర్ధిస్తామని నంబూద్రిపాద్ అన్నారు.        ఎన్నికలకు ముందే ఫ్రంట్ పరిస్థితి తూట్లు మూసి, తూములు        తెరిచినట్లయ్యింది. కొన్ని చోట్ల ఒప్పందాలు కుదరక పోటీ అభ్యర్ధులు  రంగంలో   నిలిచారు. తెంపుల తాళ్ళు, చిల్లుల కడ అన్నట్లుగా ఫ్రంట్ పాపం అల్లాడి       పోతున్నది. ఈ పరిస్థితి ముడుపుల కాంగ్రెస్ కు వరంగా పరిణమించింది.    రెండువైపులా విషాదం ఆవరించిన ఓటరు ఎటు మొగ్గాలో తేల్చుకోలేక        సతమతమౌతున్నాడు.

              తిన్నవాడికే తిండి పెట్టటం, బోడిగుండు వాడికి తలక పోయటం చాలా       తేలిక అనుకుని ఆయా పార్టీల వాళ్ళు పొత్తుల స్థానాల్లో కాంగ్రెస్ కే ఓట్లు    వేసి తమ కచ్ఛ తీర్చుకుంటారేమోనని నాకు అనుమానంగా ఉంది.        సిద్ధాంతాలను గాలి కొదిలి, కాంగ్రెస్ ను ఓడించాలనే ఒంటి ధ్యేయంతో   బి.జె.పి, తెలుగుదేశం లాంటి పార్టీలతోనైనా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు      జతకట్టాయి గాని ఆ రెండూ కలిసిపోలేదు. ఆ రెండూ ఇంకా శత్రువులుగానే        వేరువేరుగా ఉంటున్నాయి.

              ఏమైనా కమ్యూనిస్టుల పని ఈసారి తెడ్డునాకి వ్రతం      చెడగొట్టుకున్నట్లుగా ఉంది. అసలు వాళ్ళిద్దరూ అనైక్యంగా ఉంటూ అందరి     ఐక్యతను కోరుతున్నారు. తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల దాకా బ్రతికాడు      అన్నట్లుగా ఈ వివిధ పార్టీల మిశ్రమం ఎన్నాళ్ళుంటుందో చూడాల్సిందే.      అవినీతికి పుట్ట అయిన కాంగ్రెస్ ను ఓడించే శక్తిగల పార్టీ ఏదైనా మరొకటి        (ఇన్ని కాదు – ఏదైనా ఒకే పార్టీ) తయారు కానంతవరకు పరిస్థితి ఇలానే   ఉంటుంది.