సాథే గారి సిద్ధాంతం
గీటురాయి 24-2-1989
'మరలిరాని పయనంలో
మజిలీ లేదు. ఆడదాని కన్నీటికి అంతే లేదు'
అని ఓ కవి విలపిస్తే, 'త్యాగశీలివమ్మా మహిళా అనురాగశీలివమ్మా. తోటివారికై సకలము నొసగే కరుణామయివమ్మా' అని మరో మహాకవి స్త్రీ సహనాన్ని కొనియాడుతాడు. ఆడదానికి పురిటి పురిటికీ గండమయితే మగవాడికి దిన దినమూ గండమేనన్నారు. నిజమేనా ? ఒక్క నాటి సుఖంతో బాధ్యతను దులుపుకొని పోయే మగవాడికి ఏ గండమూ లేదు. ఆ భారాన్ని నవమాసాలు మోసి, దానికి రూపమిచ్చి, జన్మ నిచ్చి పెంచవలసిన బాధ్యత స్త్రీ పైనే పడుతున్నది. అబార్షన్ ఫెసిలిటీలు లేని పూర్వం రోజుల్లో ఇలాంటి సద్యోగర్భ సంజాతులను సంరక్షించే ధైర్యంలేక సమాజానికి దడిచి, పసి పాపాలను ఏ ఏట్లోనో నూతిలోనో పారవేసేవారు. సర్వసంగ పరిత్యాగం పేరుతో బలాత్కారంగా సన్యాసం ఇవ్వబడ్డ రోమన్ కేథలిక్ సరసులు తమకు పుట్టిన పసిపిల్లలను ఆడ మగ విచక్షణ లేకుండా చర్చీ గోడల ప్రక్కనే పాతి పెట్టారు. 1400 ఏళ్ల క్రితం అరబ్బులు ఆడపిల్లని మాత్రమే సజీవ సమాధి చేసేవారు. ఇప్పుడైతే గర్భంలోని పిండానికి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి “ఆడ” అని తేలితే అంతం చేసేస్తున్నారు. కేంద్ర ఇంధనం మంత్రి వసంత సాధే, బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి ధర్మాధికారి లాంటి పెద్దలు ఈ ఆడ పుట్టుకల నిరోధం అవసరమేనని, అక్కరలేని బిడ్డలను వదిలించుకోటానికి గర్భస్రావం చేయించుకొన్నట్లుగానే, అవసరంలేని ఆడబిడ్డలను వదిలించుకోవాలని అంటున్నారు. ఆలాచేస్తే ఆడపిల్లల సప్లయి తగ్గి డిమాండు పెరిగి కన్యాశుల్కం కూడా లభిస్తుందట !

ఆడపిల్ల
పుట్టినప్పుడే ఆదరువు పుడుతుంది అన్నారు. కుటుంబ నియంత్రణ
పేరుతో పుట్టుకలను కుదించారు. లింగ నిర్ధారణ పరీక్షలతో ఆడ పుట్టుకలను అంతం చేస్తున్నారు. జనాభా పెరుగుదలను గురించి జనాన్ని భయపెట్టి అసలు పిల్లల్ని పుట్టించటమే ఒక పాప
కార్యం అనే భావనను ప్రజల్లో
కలిగించారు. పుట్టుకను నిరోధించడం, కడుపు తీయించటం (గర్భస్రావం) లాంటి పనులకు చట్టబద్ధమైన
అనుమతి లభించినందున అవి పుణ్య
కార్యాల జాబితాలో చేరి పోయాయి. ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఈ ఇంధన మంత్రులు, ధర్మాధికారులు మనతో ఈ వసంతాలాడుతున్నారు. పుట్టి చచ్చినా పుత్రుడే మేలు అనుకునే సమాజంగదా
మనది !
“ఆడకాన్పు కనటం కంటే సతి
గొడ్రాలౌటయే మేలు” అన్నాడో కాకి. కన్యను కనుటయెల్ల దుఃఖంబుకొరకే అన్నాడో తిమ్మడు. “పతి కొట్టిన, పతి తిట్టిన, పతి నిర్ధాయుడగచు ఎట్టి పాటు పరిచినా, మదిలో అన్యధాత్వ మొందరు పతివ్రతల్”
అన్నాడో రామలింగడు. మగ బిడ్డలేని నిర్భాగ్యుని ఇంట
భోజనమే సేయనన్నాడు శ్రీనాధుడు. పుత్రిక చేసే పనులు తత్పురుషుడికే చెందుతాయిగాని తల్లిదండ్రులు
పొందరు కాబట్టి ఆడజన్మ చాలా అధమమైన
జన్మ అన్నాడు ఆది కవి నన్నయ్య.
అలాంటి
నన్నయ్యలు కన్నయ్యలు అవతరించిన నేల మనది. ఆడవే జలకమ్ములాడవే
అంటే ఇంకా ఏం ఆనందముందని ఆడటం ? ఆమె ఆడాలి,పాడాలి
మగవాడి మనసు రంజిల్లాలి. మరోవైపు ఆమె అణగారిపోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి