30, ఆగస్టు 2012, గురువారం

సహనభావం ఎందుకు లోపిస్తుంది ?



             సహనభావం ఎందుకు లోపిస్తుంది ?
                          గీటురాయి 23-10-1987      
చం||  మతమని వంక బెట్టి కసుమాలపు గట్టుపకాసులెందరో
కుతుకల బట్టి కోసికొన గూడదటంచును బుద్ధి చెప్పి ఖం
డితముగా వారి వారి యవినీతుల మానిపి లా సాధులన్
బ్రతుకగా నీవు దేవ? యొక వారము పాటయినన్ బ్రశాంతిగా!

              అని కవిరాజు శ్రే త్రిపురనేని రామస్వామి గారు తన       మొత్తుకోళ్ళు దేవునికి నివేదిస్తాడు. మతవర్గాల మధ్య సత్సంబంధాలు    లేకపోవటాన్ని బట్టి మదన పడిపోతాడు. అయితే వివిధ మతాలలో చేరిన       దుష్టులు, షైతాను అనుచరులే ఈ పరమత సహనం కొరవడి మౌఢ్యంతో       హింసకు, హత్యలకు పాల్పడుతున్నారు. దైవం ఒక్కడే అయినప్పుడు        అందరు ఆరాధిస్తున్నదీ ఆయన్నే కదా? మధ్యలో ఈ పోట్లాలు ఎందుకు?        అసలు ఎదుటి మతం వాడు చెప్పేదాంట్లో సత్యమేమైనా ఉందా లేదా అని     పరిశీలన చేసేవాళ్ళు చుక్కల్లో చంద్రుడిలాగా ఉంటుంటారు. ఎదుటివాడు       చెప్పేదాన్ని అసలు వినకూడదనుకునే వాళ్ళు, చెవులు మూసుకునేవాళ్ళు సంఘంలో ఎక్కువ మంది ఉంటే మతాలన్నీ చెవిటి మతాలే అవుతాయి.        అందుకే కవిరాజు గారు తన ప్రశ్నకు సమాధానం తానే ఇచ్చుకుంటాడు : -

              చం||  ఎవని ముఖాబ్జ నిర్గళితమేని సుభాషితమైన యట్టిచో


                     ప్రవిమల భక్తి గైకొనుట పాడి ఎరుంగుము, ఘోరపంక సం
                     భవ మగు పద్మ మౌదలను బండితకోటి ధరింపు చుండదే?
       తవులదు ధర్మపీడ యవధానముతో నిటులాచరించినన్

              చం||  తెలియదె నీకు మీ తెలుగుదేశమునన్ బ్రభవించి భక్తి సం
                     కలిత మహానుభావుడయి క్రాలిన గోపన విప్రజాతుడై
                     వెలసిన మాట? యాతడు పవిత్రుడు మ్లేచ్ఛుడునౌ కబీరుచే                         తెలియడే భక్తి యోగము సుధీజన సన్నుత మోక్ష పద్ధతిన్?

       ధర్మం చెప్పేవాడు చండాలుడైతేనేమి, తురకవాడు అయితేనేమి? అతను చెప్పింది ధర్మమే అయితే అంగీకరించటానికి ఆటంకం మిటి ? మానవులందరూ సమానులేననీ, అందరి ఆరాధనా కేంద్రం దేవుడేననీ అంగీకరించినంత కాలం మనుషుల్లో తేడాలు రానే రావు. ఎప్పుడైతే మనుషుల్లో ఒకరు ఘనులనీ, మరొకరు చండాలురనీ తేడాలు వచ్చాయో అప్పుడే వారి మధ్య అపనమ్మకాలు వస్తాయి. మల్లీల్లీ, మంచానికి కాళ్ళు ఎన్నే అంటే మూడున్నొక్కటి అందట. ఎల్లీ ఎల్లీ, నీ మంచానికి ఎన్ని కాళ్ళే అంటే నాలుగు అందట. సుబ్బీ, మరి నీ మంచానికో అంటే రెండేరెళ్లు అందట. ఈ రకంగా మంచం కాళ్ళ లెక్కలో మల్ల గుల్లాలు పడుతూ అమ్మలక్కలంతా గుద్దుకు చచ్చినట్లుగా ఉంది నేటి మతవర్గాల పరిస్థితి.

       సహనం చూపించేకొద్దీ సత్సంబంధాలు పెరుగుతాయి. ఎదుటి మతం వాళ్ళని ఎత్తిపొడుస్తూ, ఎకసక్కేలు ఆడటం, ఎక్కిరించటం లాంటి పనులే ఎదురుదెబ్బ తీస్తాయి. దగ్గరకు పిలిచి దాసరీ నీ కన్నులొట్ట అంటే, తాంబూర్ర తీసుకొని తలపగిలిందాకా కొట్టాడ. నీ మతంలో సుగుణం ఏదైనా ఉంటే చెబుతూ పో, వినేవాడు వింటాడు వినని వాడు వినడు. వినని వాళ్ళంతా నీ శత్రువులని అనుకోవద్దు. నీకు లాగానే ఆత్మసాక్షి గల మనుషులేనని భావించు. అందరం ఆ మట్టిలోనే కలుస్తాం. అందరం సృష్టికర్త వద్దకే మళ్ళీ చేరుతాం. లెక్క అడిగేది, డొక్క చీల్చేదీ ఆయన. మధ్యలో మనకేల అనుకుంటే మహా సత్సంబంధాలు కొనసాగుతాయి. అల్ప విద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద అయినట్లు, అలగా జనాన్ని తయారుచేసి అల్లరులను పురికొల్పే భక్తిహీనుల వల్లనే వైషమ్యాలు చెలరేగుతున్నాయి. అలాంటి వాళ్ళతో విసిగిపోయి కూచిమంచి తిమ్మకవి గారు ఇలా కోపపడ్డారు : -

||   కోపం బెక్కువ, తాల్మియిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్     
       కాట్యంబు ఘనంబు, లోభమునహంకారంబు దట్టంబు, హృ
       చ్చాలంబధికంబు, ద్రోహమది విస్తారంబు, ఛీ ! యిట్టి దు
       ర్వ్యాపార ప్రభు లేరీ బ్రోతురి భర్గా ! పార్వతీ వల్లభా !

       ఈ దేశంలోని ప్రభువులు, పండితులు, పామరులు కూడా కూచిమంచి గారు పేర్కొన్న కులక్షణాలను కూల్చివేసుకుంటే మ సామరస్యం, శాంతి వెల్లివిరుస్తాయి !

మీసాల పరపతి



                      మీసాల పరపతి
                                   గీటురాయి  11-11-1987                మొత్తం రాష్ట్రంలో ఎక్కడయినా సరే చంద్రబాబు నాయుడు శాసన       సభ్యుడిగా పోటీ చేసి గెలిస్తే మీసాలు తీసేస్తాను అని రాష్ట్ర కాంగై మాజీ అధ్యక్షుడు శ్రీ రాజశేఖర రెడ్డి సగర్వంగా ప్రకటించాడు. అంటే ఆయన      మీసాలు     గొరిగించుకోవటం మనం ప్రళయం లాగా భావించుకోవాలి.        ఆయన ప్రస్తుతం మీసాలు పెంచుతున్నది కేవలం లోకోపకారం కోసమే      అయ్యుంటుంది. నిక్కీ నీలిగీ చచ్చీ చెడీ ఒకవేళ చంద్రబాబు గెలిచాడూ అంటే    ఇక మనం చచ్చామే ! రాజశేఖరుడి పేడి మూతి మన రాష్ట్రానికి మహా    ప్రమాదాన్ని కొనితేవచ్చు! అందుకని ప్రజలు కాస్త ఒళ్ళు దగ్గరుంచుకుని,    తెలివి తేటలతో ఓటు వెయ్యాలి.
      
              అసలు ఈ మీసాలు చూసుకుని మురిసిపొయ్యే జనం మొదటినుంచీ        ఉన్నారు. సిటీ బస్సులో కండక్టరు, పాస్ చూపించరా ప్రయాణీకుడా అంటే,
          ఇం పొడుగు మీసాలున్నాయి నన్ను కూడా నమ్మ లేవాన్నాడొకడు.        నీకంటే పొడుగాటి మీసాలున్నోళ్ళు చాలా మంది పాసులు చూపించే ప్రయాణం      చేశారు నువ్వోలెక్కా అన్నాడు కండక్టరు.

              మింగమెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె రాశాడ      వెనకటి రోజుల్లో ఎవడో. అలాంటి ఖరీదైన నూనెతో మీసాలు గుబురు లాగా      పెంచి వాటి మీద నిమ్మకాయలు నిలబెట్టి శభాష్ మీసగాడా   అనిపించుకున్న వాళ్ళున్నారు. నూనూగు మీసాలతో మొదలయి,        కోరమీసం, బుర్రమీసం, గుబురు మీసం లాంటి అనేక వేషాలతో ప్రజల       మూతులు మనకు నిత్యమూ దర్శనమిస్తుంటాయి.

              అయితే ఈ మీసాల పెంపకం అనేది అనేక కళల్లో ఒక కళో కాదో నాకు        తెలియదుగాని చాలా మంది తమ మూతిమీద మీసాలు సురక్షితంగా        ఉండేలా శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కారణం ఏమంటే : -

              మీసము పస మూగ మూతికి
              వాసము పస ఇండ్లకెల్ల;
              వనిలకెల్లన్
              వేసము పస; బంట్రోతుకు
              గ్రాసము పస; కుండవరపు కవి చౌప్పా !

              కేవలం మీసాలను చూచి మనిషిని అంచనా వేయటం పొరపాటే.      ఎందుకంటే  చౌడు మీసాలాయనే ఇలా అన్నాడు : -

              ఇయ్యగా నిప్పింపగల
              అయ్యలకేగాని మీసమందరికేలా ?
              రొయ్యకు లేదా బారెడు
              కయ్యమునకు గుంవరపు కవి చౌప్పా ?

              మన రాజాశేఖరుడు మీసమైతే మహా పెంచాడేగాని ఇలాంటి పద్యాలు       చదివి మరీ మాట్లాడుతున్నాడా లేదా అని అనుమానంగా ఉంది.

              జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు మీసాలు లేని        వాళ్ళే మన దేశాన్ని పాలించారు. అందువలన చౌడప్పలాంటి కవులు        వాళ్ళని మీ అనలేకపోయారు. రాజశేఖర రెడ్డి మీసం మహా విలువయినదే కావచ్చు. కానీ ఎంత విలువైన మీసామైనా వెలిగే దీపాన్ని      ముద్దుపెట్టుకుంటే కాలిపోకుండా ఉంటుందా ? మీసం తీయించుకోవాలనే       కోరిక అంతగా ఉంటే మంగలి దగ్గరకు వెళ్లాలే గాని, మరీ ఇలా బహిరంగంగా       మొక్కుకోనక్కర లేదు అని ఒక మిలిటరీ మహానుభావుడు నాకు        సెలవిచ్చాడు. పైగా మీసం తీసేయించుకోవటం ఆరోగ్యానికి కూడా ఎంతో      మంచిదని మరీ మరీ చెప్పాడు. మిలిటరీలో మీసాలు మొదలంటా గొరిగి పారవేయవలసిందేగాని పెంచరాదని స్ట్రిక్టుగా ఆజ్ఞలున్నాయట. దేశాన్ని    పరిరక్షిస్తున్న వీరాధి వీరులమైన మేము విధిలేక మీసాలు తీసేస్తున్నాము.    మిలిటరీ క్యాంపుల్లో రోజుకో బండెడు వీర మీసాలు రాలిపోతున్నాయి. రాజశేఖర రెడ్డి మీసం కూడా అందులో ఒకటి అవుతుందేగాని, ఆయన    మీసం రాలినంత మాత్రాన కొంప మునిగిపోయేది మీ లేదు, భయపడుకు   బాషా అన్నాడా మహానుభావుడు.

నిలపరా నీ పార్టీ నిండు గౌరవము



             నిలపరా నీ పార్టీ నిండు గౌరవము
                       గీటురాయి   25-12-1987    
              పరువు పాడై జనుల  పౌరుషమణగారు
              కులము గోదావరి కూల జరుగు
              మహిమ మర్యాదలు మంటిలో గలియును
              చదువు సంధ్యలు చట్టువారు
              ప్రజ్ఞలు బుద్ధులు పరలోక మేగును
              గొప్పలు కీర్తులు తుప్పలెక్కు
              ధర్మ మార్గము నీతి నిర్మూలమై యుండు
              సకల ప్రతిష్టలు సన్నగిల్లు
              వంశమందున  నొక  పాపవర్తనుండు
              బుట్టుటను జేసి   బుధులకీ భూమియందు

              అంటూ ప్రదేశ్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి శ్రీ హనుమంతరావు తెగ        మదనపడిపోతున్నారు. హనుమయ్యా అసలు సంగతి ఎంయ్యా అని      నిలదీసి అడిగితే పాపం, దాచుకోకుండా పత్రికల వాళ్ళకు చెప్పారు. తెలుగు      జాతి పరువు ప్రతిష్టలు రామారావు అనే ఒక పాపవర్తనుడి వల్ల మం    కలిసిపోయాయ. ఆరుకోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని అన్న అంగడి    వీధిలో అమ్మివేశాడట.
      
              ఇలాంటి ముంత దాపుడు మాటలు మాని అసలు ఏం చేశాడో విపులంగా చెప్పు అని పత్రికల వాళ్ళు పట్టి పట్టి అడిగితే, ఫాల్కీవాలాను తెచ్చి తన కేసులో వాదింపజేసుకున్నాడే ఇంతకంటే తెలుగు వాళ్ళకు    పరాభవం ఏం కావాలి ? తెలుగు పత్రికా విలేకరులై యుండి ఆ మాత్రం అర్ధం       చేసుకోలేరా? అని ఎదురు ప్రశ్నలు వేశాడాయన.

              నిజమే, అన్న ఫాల్కీవాలాను ఎందుకు పట్టి తెచ్చాడు ? ఆంధ్రుల్లో    ఆయన పాటి సమర్ధులైన న్యాయవాదులు లేరా? తెలుగు జాతి, తెలుగు     తేజం అంటూ ఊగిపోయే అన్న తెలుగు న్యాయవాదులనే       నియమించుకోవాలి గదా ? ఇది జాతి ద్రోహం కాదా? అంటూ        హనుమంతరావు గారి అనుయాయులు కూడా ఆవేశపడ్డారు.

              ముసలి ముప్పందాన కుసుమ రోగం వచ్చినట్లు, ముత్తెమంటి ముతరాచకులం చేపలు తిని చెడిపోయిందన్నట్లు, జాత్యాభిమానం,       ప్రాంతీయ దురహంకారం కాంగై వాళ్ళకు ఎప్పుడు అంటుకుందా అని ప్రజలు    ఆశ్చర్యపోయారు. నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ అన్న      ఆవేశపడుతూ ఉండే మాట నిజమే. అయితే అన్న నోటి నుండి అలాంటి        మాటలు వెలువడిందే తడవుగా కాంగ్రెస్ వాళ్ళంతా కట్టగట్టుకొని అన్నను
       తెలుగు జాత్యహంకారి, ప్రాంతీయ దురభిమాని, వేర్పాటువాది అని        నిందించే వారు. మరి ఇవ్వాళ వాళ్ళేనా, ఆ నోళ్ళతోటేనా, జాతి అభిమానం    అంటూ అరచి గీపెడుతున్నది?

              ముందు నేను భారతీయుడిని, ఆ తరువాతే ఆంధ్రుణ్ణి అని అన్న   అనేకసార్లు అన్నాడు. అప్పుడు ఈ జాతీయ వాదులు ఏమీ మాట్లాడలేదు. పైగా అదంతా ఒట్టి నటన పొమ్మన్నారు. కొత్త ఎద్దు పే ఇంటిల్లి పాదీ ఎత్తినట్లు ఏదో ఒక నెపం చూపించటం మంబలంతో ఆ నెపాన్నే గీపట్టడం     కాంగ్రెస్ వాళ్ళకు ఆనవాయితీ అయిపోయింది.

              మొండి గురువు బండ శిష్యుడు అన్నట్లు ఢిల్లీలోని అధిష్టాన వర్గంది ఒక దారైతే రాష్ట్రాల్లోని అనుచరగణానిది మరో దారి అవుతున్నది. కూసే    అమ్మ నోరు కుట్టి పెడితే, అయ్యాలారా ! ఏటెంకాయకు పసుపు       పూయలేదు అందట. ప్రాంతీయ దురభిమానపు కూతలను ఇప్పుడు       కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎలా సమర్ధించుకుంటుందో అర్ధం గావటం లేదు.        చూడగా చూడగా ఈ క్రింది పద్యం ఎంతో నిజం అనిపిస్తున్నది.

              జారిణి తన వగు పనులే
              వ్వారలు జూడరను బుద్ధి వర్తించునిలన్
              క్షీరము దాగు బిడాలము
              కోరికలో దలచునట్లు గువ్వల చెన్నా !