30, ఆగస్టు 2012, గురువారం

మీసాల పరపతి



                      మీసాల పరపతి
                                   గీటురాయి  11-11-1987                మొత్తం రాష్ట్రంలో ఎక్కడయినా సరే చంద్రబాబు నాయుడు శాసన       సభ్యుడిగా పోటీ చేసి గెలిస్తే మీసాలు తీసేస్తాను అని రాష్ట్ర కాంగై మాజీ అధ్యక్షుడు శ్రీ రాజశేఖర రెడ్డి సగర్వంగా ప్రకటించాడు. అంటే ఆయన      మీసాలు     గొరిగించుకోవటం మనం ప్రళయం లాగా భావించుకోవాలి.        ఆయన ప్రస్తుతం మీసాలు పెంచుతున్నది కేవలం లోకోపకారం కోసమే      అయ్యుంటుంది. నిక్కీ నీలిగీ చచ్చీ చెడీ ఒకవేళ చంద్రబాబు గెలిచాడూ అంటే    ఇక మనం చచ్చామే ! రాజశేఖరుడి పేడి మూతి మన రాష్ట్రానికి మహా    ప్రమాదాన్ని కొనితేవచ్చు! అందుకని ప్రజలు కాస్త ఒళ్ళు దగ్గరుంచుకుని,    తెలివి తేటలతో ఓటు వెయ్యాలి.
      
              అసలు ఈ మీసాలు చూసుకుని మురిసిపొయ్యే జనం మొదటినుంచీ        ఉన్నారు. సిటీ బస్సులో కండక్టరు, పాస్ చూపించరా ప్రయాణీకుడా అంటే,
          ఇం పొడుగు మీసాలున్నాయి నన్ను కూడా నమ్మ లేవాన్నాడొకడు.        నీకంటే పొడుగాటి మీసాలున్నోళ్ళు చాలా మంది పాసులు చూపించే ప్రయాణం      చేశారు నువ్వోలెక్కా అన్నాడు కండక్టరు.

              మింగమెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె రాశాడ      వెనకటి రోజుల్లో ఎవడో. అలాంటి ఖరీదైన నూనెతో మీసాలు గుబురు లాగా      పెంచి వాటి మీద నిమ్మకాయలు నిలబెట్టి శభాష్ మీసగాడా   అనిపించుకున్న వాళ్ళున్నారు. నూనూగు మీసాలతో మొదలయి,        కోరమీసం, బుర్రమీసం, గుబురు మీసం లాంటి అనేక వేషాలతో ప్రజల       మూతులు మనకు నిత్యమూ దర్శనమిస్తుంటాయి.

              అయితే ఈ మీసాల పెంపకం అనేది అనేక కళల్లో ఒక కళో కాదో నాకు        తెలియదుగాని చాలా మంది తమ మూతిమీద మీసాలు సురక్షితంగా        ఉండేలా శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కారణం ఏమంటే : -

              మీసము పస మూగ మూతికి
              వాసము పస ఇండ్లకెల్ల;
              వనిలకెల్లన్
              వేసము పస; బంట్రోతుకు
              గ్రాసము పస; కుండవరపు కవి చౌప్పా !

              కేవలం మీసాలను చూచి మనిషిని అంచనా వేయటం పొరపాటే.      ఎందుకంటే  చౌడు మీసాలాయనే ఇలా అన్నాడు : -

              ఇయ్యగా నిప్పింపగల
              అయ్యలకేగాని మీసమందరికేలా ?
              రొయ్యకు లేదా బారెడు
              కయ్యమునకు గుంవరపు కవి చౌప్పా ?

              మన రాజాశేఖరుడు మీసమైతే మహా పెంచాడేగాని ఇలాంటి పద్యాలు       చదివి మరీ మాట్లాడుతున్నాడా లేదా అని అనుమానంగా ఉంది.

              జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు మీసాలు లేని        వాళ్ళే మన దేశాన్ని పాలించారు. అందువలన చౌడప్పలాంటి కవులు        వాళ్ళని మీ అనలేకపోయారు. రాజశేఖర రెడ్డి మీసం మహా విలువయినదే కావచ్చు. కానీ ఎంత విలువైన మీసామైనా వెలిగే దీపాన్ని      ముద్దుపెట్టుకుంటే కాలిపోకుండా ఉంటుందా ? మీసం తీయించుకోవాలనే       కోరిక అంతగా ఉంటే మంగలి దగ్గరకు వెళ్లాలే గాని, మరీ ఇలా బహిరంగంగా       మొక్కుకోనక్కర లేదు అని ఒక మిలిటరీ మహానుభావుడు నాకు        సెలవిచ్చాడు. పైగా మీసం తీసేయించుకోవటం ఆరోగ్యానికి కూడా ఎంతో      మంచిదని మరీ మరీ చెప్పాడు. మిలిటరీలో మీసాలు మొదలంటా గొరిగి పారవేయవలసిందేగాని పెంచరాదని స్ట్రిక్టుగా ఆజ్ఞలున్నాయట. దేశాన్ని    పరిరక్షిస్తున్న వీరాధి వీరులమైన మేము విధిలేక మీసాలు తీసేస్తున్నాము.    మిలిటరీ క్యాంపుల్లో రోజుకో బండెడు వీర మీసాలు రాలిపోతున్నాయి. రాజశేఖర రెడ్డి మీసం కూడా అందులో ఒకటి అవుతుందేగాని, ఆయన    మీసం రాలినంత మాత్రాన కొంప మునిగిపోయేది మీ లేదు, భయపడుకు   బాషా అన్నాడా మహానుభావుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి