వితండవాదానికి విస్తుపోకండి
గీటురాయి 11-9-1987
“సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే?
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే?
కనులనొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే?
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే?
పెను చీకటినేల సృజించే”
అని ఓ శిఖామణి దేవుణ్ణి పట్టుకొని దులిపిపారేస్తుంది. ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎంత లాంటి ప్రశ్నలకు తేలికగానే జవాబివ్వొచ్చు గాని ‘ఎందుకు’ అని ప్రశ్నిస్తే మాత్రం కొంచెం ఆగి ఆలోచించి చెప్పాల్సొస్తుంది. ఈ ప్రశ్నలు విన్న ఓ విదుషీమణి ఇలా జవాబిచ్చింది :-
“వేద శాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టి విలాసం
అల్ప బుద్ధితో ఙ్ఞాన దాతనే సలపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నల మయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమే అడుగుట మాని బ్రతుకుటయే మన న్యాయం”
ఎందుకు పుట్టావు వక్రమా అంటే, సక్రమమైన వాళ్ళను ఎక్కిరించటానికి అందట. ఎక్కడిదక్కడే ఉంచి ఎల్లమ్మ ఇల్లలికినట్లు శిఖామణమ్మ అడిగిన ప్రశ్నలలో దేనికీ సరైన జవాబియ్యకుండానే విదషీమణమ్మ వేదాంతం బోధించింది. అసలు ప్రశ్నించకుండానే బ్రతుకు గడిపెయ్యమని సలహా ఇస్తుంది. సాధ్యమయ్యేపనేనా?
చిన్న పిల్లలు తల్లిదండ్రుల్ని అనేక ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టడం ద్వారా వారు ఙ్ఞానాన్ని సంపాదించుకుంటారు. జవాబులు దొరక్కపోతే ఆ తీరని ప్రశ్నలు వారి మనసుల్లో సమస్యలై, పలు రకాల అభిప్రాయాలకు దారి తీస్తాయి. ప్రశ్నించవద్దని పిల్లల్ని గదిమితే వారు ఇక దేని గురించీ తెలిసికోకుండా మొద్దుల్లాగా తయారవుతారు. పరిసరాల పట్ల, జీవితం పట్ల వారిలో అనాసక్తత చోటు చేసికుంటుంది. ఊరు తిరిగిరమ్మంటే, రోలు తిరిగివచ్చే రకం తయారవుతారు. ఇలా పెరిగి పెద్దయిన వాళ్ళు సరైన జవాబులివ్వలేక మూఢ నమ్మకాలను, నిరాశాతత్వాన్ని వ్యాప్తి చేస్తారు.
గోవును చంపి గోరోజనం దానం చేసినట్లు అనేక మంది ప్రజలు తిక్క పనులు ఎన్నో చేస్తుంటారు. అలాంటి పనులు ఎందుకు చేస్తారురా అని ఓ మదన గోపాలుడు ఇలా మదనపడిపోయాడు : -
ఊళ్ళు దోచుక రాతి గుళ్ళు గట్టనేల ?
ఇళ్ళు బుచ్చుక తోట నేయనేల ?
ప్రజల పీడించి ధర్మము సేయగనేల ?
దార్లుగొట్టి సువర్ణదానమేల ?
మాన్యముల్ కబళించి సుఖము సేయగానేల ?
సాధుల జెరపి పై శాంతులేల ?
బుద్ధుల సొమ్ము హరించి బూరి ఇవ్వగనేల ?
పురముల గూల్చి గోపురములేల ?
ఏల ఏల అని అడిగావు గానీ, ఏలనో నీవే చెప్పవయ్యా మదనయ్యా అంటే సమాధానం కూడా ఏల అనే చెబుతాడు : -
ఎరుగనేరాని మూఢులకేల చెప్ప ?
తెలియబడవచ్చు యమ సభా స్థలమునందు
ఇందుకు ఫలంబు దేహాంతమందె తమకు
ఎరుకబడుగాక కూళలకేల చెప్ప ?
గొడ్డలి ఎక్క పెట్టావురా అంటే కొట్టే చెట్టు దగ్గర అన్నాడట. కొట్టే చెట్టు ఎక్కడుందిరా అంటే గొడ్డలి పెట్టిన దగ్గర అన్నాడట. ప్రశ్నకు సమాధానంగా మరో ప్రశ్న వేసే రకం కొందరున్నారు. సమాధానం చెప్పలేనప్పుడో, అసలు జవాబు తెలియనప్పుడో యాదార్ధాన్ని ఒప్పుకోలేని ప్రదర్శక మేధావులు కొందరున్నారు. నాకు అన్నీ తెలుసు అనే అభిప్రాయం గలవాళ్లు పత్రికల్లో పాఠకుల సందేహాలకు సమాధానకర్తలుగా ఉంటే బలే పసందుగా ఉంటుంది. చతురతకు జాణకుడే గాని చేతిలో చిల్లిగవ్వ లేనట్లు బుర్రలో పరిఙ్ఞానం లేకపోయినా నోటి నిండా ఆపదలో ఆదుకునే అర్ధపర్ధంలేని వాదనలుంటాయి. గొడ్డుటావుగోకితే చేపుతుందా?
బుద్ధికి అందని ప్రశ్నలు వేసినప్పుడు కొందరు “సోదరా, నేను అంత ఙ్ఞానిని కాదు” అని ఒప్పుకుంటారు. మరి కొందరైతే “ ఈ భూ ప్రపంచంలో నాకు తెలియని విషయం మరెవరికీ తెలియదు కాబట్టి ప్రశ్న వేసిన వాడా ! నోరు మూసుకో” అంటారు.
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
--- సముద్రాల (సీనియర్),భానుమతి, జిక్కి,మాస్టర్ వేణు,బాటసారి ( 1961)
<iframe width="729" height="410" src="https://www.youtube.com/embed/FKx4fffOOFA" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి