30, జూన్ 2012, శనివారం

భా.జ.పా. రాజకీయ వింత


భా.జ.పా. రాజకీయ వింత
                   గీటురాయి   16-5-1986

       న్యూఢిల్లీలో మే పదవ తేదీన జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం 25 సూత్రాల ఆర్ధిక కార్యక్రమాన్ని ఆమోదించింది. గాంధేయ సోషలిజం, దీన దయాళ్ ఉపాధ్యాయ సమగ్ర మానవతా వాదం, జయ ప్రకాష్ నారాయణ అంత్యోదయ, గ్రామోదయ వాదాల మేలు కలయికగా ఈ ఆర్ధిక కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రకటించింది.

       అయితే గాంధేయ సోషలిజం అనే సాంకేతిక పదం స్వయంగా భా. జ. పా. లోని కొందరు ప్రతినిధులకే మింగుడు పడలేదు. గాంధీ గారికి - సోషలిజానికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. అలాంటిది ఆ రెండు పదాలను కలపటం వీరికి ఆశ్చర్యం కలిగించింది. పైగా గాంధీ గారు బ్రతికున్న రోజుల్లో గాంధీ సిద్ధాంతాలను దుమ్మెత్తి పోసింది జనసంఘం వాళ్లే.ఆయన చనిపోయేదాకా జనసంఘం వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయన మరణానంతరం ప్రజల్లో ఆయన సిద్ధాంతాల పట్ల పెల్లుబికిన ఆదరణను బట్టి జన సంఘం తన ప్రచార పంథాను మార్చుకొన్నది.

       ఆ జనసంఘం నవీన రూపమైన భా.జ.పా. అచ్చమయిన గాంధీ మార్గాన్ని గాని, అచ్చమయిన సోషలిజాన్ని గాని దారిద్ర్య నిర్మూలన కోసం ఎన్నుకోక, పరస్పరం పొసగని రెండు విభిన్న ధృవాలను కట్టగట్టి ఎన్నుకోవటం విచిత్రంగా ఉంది. అందుకే గాంధేయ సోషలిజం అనే పదాన్ని తొలగించమని కొందరు ప్రతినిధులు అడిగారు.

       గాంధేయం అంటే అహింసా, సామరస్య పూర్వకమైన యజమాని కార్మిక సంబంధాలు, వర్ణాశ్రమ వ్యవస్థ. సోషలిజం అంటే శ్రమ దోపిడీకి అవకాశం లేని సమ సమాజ వ్యవస్థ. ఈ రెండు ఎలా పొసగుతాయి ? అందుకే ఇవి రెండూ పరస్పర విరుధ్ధమైన రెండు విభిన్న ధృవాలు అని నేటి భా.జ.పా అధ్యక్షులు ఎల్.కె. అద్వానీ సయితం గతంలో అనేవారు. అయితే ఆయన కూడా అధ్యక్ష పదవి రాగానే ఈ విచిత్ర వాదానికి తల వంచారు.

       గాంధీ గారి ప్రధాన సిద్ధాంతం అహిం ను ఎన్నుకొన్న భా.జ.పా. కార్యకర్తలు చిన్న సైజు త్రిశూలాలను ధరించటం ఎందుకో అర్ధం కావటం లేదు. శిక్కులు కృపాణాలు  ధరిస్తున్నారు గనుక భా.జ.పా. హిందువులు త్రిశూలాలను ధరించాలని వారు వాదిస్తున్నారు. మరి గాంధీ గారి సంగతేమిటి ? సోషలిజం పరిస్థితి ఏమిటి ?

       గాంధేయ సోషలిజం అంటే అజాగస్థానం అన్నట్లు అర్ధంగాని ఉపయోగించని మాటలాగే ఉంది గాని దరిద్ర నారాయణులను నిజంగా ఉద్ధరించేలా లేదు. రెండు పడవల మీద కాలేస్తే ఏమవుతుంది ? జనాకర్షణ పొందిన గాంధేయ వాదం, సామ్య వాదాలను కలిపి ప్రజలను సులభంగా బుట్టలో వేసుకోవచ్చన్న అత్యాతో భా.జ.పా. అవలంభించిన ఈ నూతన ప్రచార పంధా నిజ స్వరూపాన్ని కాలమే బయట పెడుతుంది.

      

పొంతన కుదరని పోలికలు



పొంతన కుదరని పోలికలు
                                     గీటురాయి   18-4-1986  
                                                                                                             
     “ నేను ముస్లింను, నాకు మరణమంటే భయం లేదు. అని పాకిస్తాన్ అక్వినోగా మన పత్రికల వాళ్ళంతా పొగిడేస్తున్న బేనజీర్ భుట్టో అంది. ఇతర విషయాల పట్ల ఎంతో మోజు చూపుతున్న వాళ్ళంతా వాటిని కొంచెం సేపు పక్కనబెట్టి, ముస్లింలకు మరణ భయం  ఎందుకు ఉండదు ? అని ఆలోచిస్తే బృహద్గ్రంధాలు తయారు చేయవచ్చు.

     ప్రయాణం చేసే వారికంటే పెట్టెలు మోసే వారి హడావిడి అక్కువైనట్లు పాకిస్తాన్ లో జరిగే ప్రతి ఒక్క విషయం మన పాత్రికేయులకు బహు పసందైన వార్తావిశేషం అవుతుంది. తమలపాకుతో తానిట్లంటే, తలుపు చెక్కతో నేనిట్లాంటి అన్నట్లు ఆమె నియంతలెందరో  నేల రాలిన చోటు ఇది అంటే, మానవాళ్లు అంతే కాదు. నియంతల తలలు మొలకలెత్తే చోటు కూడా అదే   అన్నారు.

     అవినీతికి మారుపేరైన  మార్కోస్ తో  జనరల్ జియా ఉల్ హఖ్ ను పోల్చారు. అతని గతే ఇతనికి పడుతుంది అన్నారు. బేనజీర్ కు బ్రహ్మరధం పట్టారు. అయితే ఇంత పచ్చి నియంతగా  మనవాళ్ల కళ్ళకు కనబడుతున్న జియా బేనజీర్ ను పాకిస్తాన్ రావటానికి ఎందుకు రానిచ్చాడో అర్ధం కావడం లేదు. 61 కిలోమీటర్ల పొడవైన రాలీ  బేనజీర్ అధ్యక్షతన జరుగుతుంటే జనరల్ జియా ఈ ర్యాలీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగం అని  నిర్లిప్తంగా సమాధానమివ్వటం కొరుకుడుపడటం లేదు.

     వాస్తవానికి 1977 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన భుట్టోతో మార్కోస్ను పోల్చవలసి ఉంది. నందిని పండిగా పందిని నందిగా పోల్చవచ్చు కానీ తేడా ఎక్కడికి పోతుంది? జియా ప్రభుత్వం అవినీతి అక్రమాలలో మార్కోస్ స్థాయికి చేరే అవకాశం లేదనీ, బేనజీర్ పీపుల్స్ పార్టీ బీటలు వారిందనీ, కొన్ని రాజకీయ పార్టీలు, మిలిటరీ నాయకశ్రేణి జియా పట్ల అచంచల విశ్వాసం విధేయత చూపుతున్నారనీ, అమెరికా అనుగ్రహం  జియా మీద చాలా ఉందని, మణిలాలోని  రక్షణ మంత్రి లాంటి వాడు పాకిస్తాన్ లో లేడని తెలుసుకొన్న పండితులకు తాము చేసిన పోలిక సరిగ్గా నప్పలేదని ఇప్పుడిప్పుడే అనిపిస్తున్నది. అందుకే ఇప్పుడు ప్లేటు మార్చి బేనజీర్ ను చంపటానికి జియా ఎవరినో   పంపాడు, చూసారా? అంటున్నారు!



మింగుడు పడని మాటలు


మింగుడు పడని మాటలు
                                  గీటురాయి 25-4-1986
       లోగుట్టులను బయటపెట్టే కులదీప్ నయ్యర్ ఈ మధ్య ముస్లిం సెక్యులర్ శక్తులు మూగనోము పట్టాయంటూఒకటే గోల చేస్తున్నాడు. ఆ గోలలో ఆయన పిడివాదులకు మింగుడుపడని కొన్ని లోగుట్టులు బయట పెట్టాడు.

 అవి ఏమిటంటే : -

          మరింత అల్లరి చేసినట్లయితే ప్రభుత్వం ముస్లిం స్త్రీల బిల్లును ఉపసంహరించుకుంటుందని  బిల్లును వ్యతిరేకించే వారు భావిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి తమ పలుకుబడిని పెంచుకోవడానికి హిందూ మతోన్మాదులు ఈ బిల్లును ఉపయోగించుకుంటున్నారు. చట్టం ప్రకారం హిందువులు ఒక భార్యను మాత్రమే కలిగి ఉండాలి. అయినా, హిందువులలో చాలా మందికి ఒకరికన్నా ఎక్కువ మండి భార్యలే ఉన్నారు. ముస్లిం జనాభా వార్షిక పెరుగుదల రేటు 2.4 శాతం కన్నా ఎక్కువ లేదు; ఇది దేశ జనాభా పెరుగుదల సగటు రేటు. ఈ సంధ్యను చాలా మండి హిందువులు విశ్వసించడం లేదు. అల్పసంఖ్యాక వర్గాల సంతృప్తి కలిగించటం అధిక సంఖ్యాక వర్గాల వారి భాద్యత. తాజ్ మహల్ మొదట ఒక దేవాలయమని విచిత్రంగా వాదించే ఉన్మాదపు హిందువులున్నారు. ఇలాంటి వాదనల వల్ల భయం హెచ్చుతుంది. బాబ్రీ మసీదు తాళం తీయడం వల్ల సాంప్రదాయక మాట సహనం దెబ్బతిన్నది.  సామరస్య పూర్వక రాజీ మార్గం అనుసరించకపోయినట్లయితేతీవ్ర ప్రమాదం సంభావిస్తుందనడానికి ఇదొక హెచ్చరిక.

ఈ హెచ్చరిక ఎవరికో పిడివాదులు చెప్పగలరా ?

చెర్నోబిల్ తో చెలగాటం తగదు

చెర్నోబిల్ తో చెలగాటం  తగదు              గీటురాయి 16-5-1986

       విద్యుచ్చక్తి + సోవిట్ అధికారం = కమ్యూనిజం అని లెనిన్ మహాశయుడు గొప్ప నిర్వచనం ఇచ్చాడు. సోవిట్ లకు అధికారానికి కొదువలేదు. కావాల్సిందల్లా ఇక విద్యుచ్చక్తి మాత్రమే. అప్పుడే వారు కమ్యూనిజానికి లెనిన్ ఇచ్చిన నిర్వచనాన్ని సార్ధకం చేయగలరు. అందుకని దేశంలో ఉన్న బొగ్గు, నీళ్ళు, ఖనిజ తైలాలతో వెలికి తెచ్చే విద్యుత్తు చాలక దాదాపు 11 శాతం విద్యుత్తును అణు శక్తి ద్వారా తయారు చేస్తున్నారు.

       1986 ఏప్రిల్ నెలలో ఉక్రెయిన్ రాష్ట్రంలోని చెర్నోబిల్ అణు రియాక్టర్ పగిలిపోయి దాని లోంచి వెలువడిన అణు ధార్మిక ధూళి మేఘం యూరప్ ఖండంలోని చాలా దేశాలకు వ్యాపించింది. పోలాండ్ లోని పాల నిల్వలన్నీ విషపూరితం అయ్యాయి. వారం రోజుల దాకా వర్షం నీళ్ళు తాగొద్దని స్కాట్లాండ్ తన ప్రజలకు హెచ్చరించింది. చెర్నోబిల్ కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలన్నిటిలో ఇప్పుడు ఎటు చూసినా బట్టతలలే దర్శనమిస్తున్నాయ. దీని
అసలు ప్రభావం కేన్సరు కణుతుల రూపంలో వల్ల పిల్లల్ని బాధించగలదని కూడా శాస్త్రవేత్తలంటున్నారు.


       సరే జరిగిందేదో జరిగింది, అసలు ఎందుకు రియాక్టర్ పగిలింది ? ఎంత మంది చనిపోయారు ? అని ఇతర దేశాల వాళ్ళు అడుగుతుంటే రష్యా అధినేతలు వాస్తవాలు ప్రపంచానికి వివరించకుండా  ఇది తమ దేశ స్వంత వ్యవహారమని దాటవేస్తున్నారు. పైగా పాశ్చ్యత్య దేశాల సోవిట్  వ్యతిరేక ప్రచారం వల్ల రాజకీయ వాతావరణం కలుషితమైపోయిందని గోర్బచేవ్ గోల చేస్తున్నాడు.

       అసలు వాతావరణమే    ణు ధూళికి కలుషితమై చుట్టు ప్రక్కల జనం చస్తుంటే ఆయన రాజకీయ వాతావరణాన్ని పట్టుకొని వ్రేళ్లాడటం ఘోరంగా ఉంది. ఈ అణు ధార్మిక శక్తి వలన పశ్చిమ జర్మనీలోని వ్యవసాయ ఉత్పత్తులు తీవ్రంగా చెడిపోయాయి. అందుకు నష్టపరిహారంగా జర్మనీ 920  లక్షల డాలర్లు రైతులకిచ్చుకోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద ప్రమాదం రష్యా సొంత  విషయమా ? పైగా ప్రమాదం నుంచి గుణపా నేర్చుకోమని గోర్బచేవ్ ఇతర దేశాలకు సలహా ఇస్తున్నాడు.

       నంబీ నంబీ నా పెళ్లికేం సాయం చేస్తావు ? అంటే, నీ పెళ్ళికి నేను ఎదురు రాను పో ! అన్నాడట. అదేదో పెద్ద సహాయం చేసినట్లు,ణు ప్రయోగాల జోలికి ఒక సంవత్సరం పాటు రానని గోర్బచేవ్ ప్రతిజ్ఞ చేశాడు.

       పూరీళ్లలో నివసించేవాడు ఒక ఇంటికి నిప్పు పెట్టుకొని ఇది నా స్వంత ఇల్లు, కాల్చుకొంటాను. ఏమయినా చేసుకొంటాను, మీ కెందుకు అన్నట్లుంది రష్యా వ్యవహారం. అలీన దేశాల పేరుతో ఊరికే కాకి గోల చేసే దేశాలు ఈ వ్యవహారం మీద అసలు ధ్యాసే మళ్లించకపోవడమ్ విడ్డూరంగా ఉంది. ఇదే అమృకాలో జరిగి ఉంటే ఈ దేశాలన్నీ కావు కావుమని ఒకటే గోల చేసేవి వాటికి రష్యా కూడా వంత పాడి ఉండేది. అమెరికా అణు దాహానికి  తగిన శాస్తి జరిగిందనేది. వాస్తవానికి వార్సా ప్రపంచానిదే మెజారిటీ గదా అందుకే అందరూ  గోర్బచేవ్ చెప్పిన గుణపాటం నేర్చుకుండా కలసి రండి అంటున్నారు.

       మార్క్స్ గానీ,  లెనిన్ గానీ  ఇలాంటి మోస పూరిత కమ్యూనిజాన్ని కోరుకో లేదు. సుత్తి కొదవాలి మీ చేటికిచ్చాం మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి అనలేదు. రియాక్టర్ లో గ్రాఫైట్ కడ్డీలు వాడాలని అందరికీ చెబుతూ అణు బాంబులు చేయటానికి సరిపోయే యూరేనియం కడ్డీలు వాడటం మోసం కాదా ? రేయక్క్తర్ చుట్టూ కాంక్రీటు గోడను నిర్మించక పోవడం నిర్లక్ష్యం కాదా ? ఇది ప్రపం అప్రజల ప్రాణాలతో ఆటలాడటం కాదా ?  ఎవరు ఎన్ని చెప్పినా కామినీ వేషధారికి సాధ్వి నడతలేం తెలుసు ? తెలియవు. అది అంతే !


      

తీపి బాధల వలపుకాడు మన్మధుడు


తీపి బాధల వలపుకాడు మన్మధుడు
                                    ఆంధ్ర పత్రిక           1-11-1986
                  చంద్రుని వెన్నెలకు, మన్మధుని మదన తాపానికి దగ్గర సంబంధం ఉంది. మన్మధుని నెలయల్లుడు అని కూడ అంటారు. ఎందుకంటే మన్మధుడు చంద్రుని సోదరియగు లక్ష్మీదేవి  కుమారుడు. చంద్రుని మేనల్లుడు. నెయ్యపురేడు మన్మధుడు తామరలను వికసింపచేయువాడు సూర్ర్యుడైతే, వికసించిన తామరలను ముకుళింపచేయువాడు చంద్రుడు. ఈ నెలజోడు అయిన సూర్యచంద్రులు శ్రీ కృష్ణుని నేత్రములు అని ప్రసిద్ధి. చంద్రుని శిరమున దాల్చిన నెలదారి శివుడు. చంద్రునికి గురువగు బృహస్పతి బార్యయైన తారయందు
బుట్టిన నెలపట్టి బుధుడు. రతీదేవి భర్తయైన మన్మధునికి రణరణకుడని పేరు, మన్మధుని తండ్రి విష్ణువు. మన్మధునికి శత్రువు శివుడు.

              మన్మధుని వాహనము చిలుక, మన్మధుని రధము వాయువు. మన్మధుని వింటినారి తుమ్మెద. మన్మధుని డాలు చేప, ధ్వజము మొసలి. విల్లు చెరకు. బాణాలు అయిదు గనుక పంచబాణుడు లేక పంచరుడు. ఈ అయిదు బాణాలు అయిదు మన్మధావస్థలను కలిగిస్తాయి.

అరవిందము       - ఉన్మాదన
అశోకము          - తాపన
చూతము          - శోషణ
నవమల్లిక          - స్తంభన
నీలోత్పలము     - సమ్మోహనము
శుక్లపక్షమందు జన్మించి అభివృద్ధి చెందుతూ కృష్ణపక్షమందు
క్షీణిస్తూ సంచరించే చంద్రుని వెన్నెల ప్రభావం మన్మధుని మీద చాలా వుంది. వెన్నెల యొక్క స్థాయి మన్మధావస్థ తీవ్రతను నిర్ణయిస్తుంది. చంద్రోదయమున చంద్రకాంతమనే రాయి స్రవిస్తుందట. అందుకనే దాని పేరు నెలరాయి. చంద్ర కిరణాలకు కరిగే శిల నెలట్టు, చంద్రకాంతమణి, చకోరపక్షి వెన్నెలను త్రాగుతుందట.

        రాత్రికి ప్రభువు గనుక చంద్రుని నిశాపతి, నిశాకరుడు, నిశాధీరుడు, నిశాకేతుడు అన్నారు. రాత్రులందు సంచరించే నిశాచరులు, రాక్షసులు, జారులు, దొంగలు, పాములు, గుడ్లగూబలు, చక్రవాకము, నక్క మొదలైనవి.
శ్రీరాముడు నిశాచర వినాశకరుడు అంటారు. జారులు రాత్రికోసం ఎదురు చూస్తారు. యదార్ధవంతులైన ప్రేయసీ ప్రియులు వెన్నెల కోసం ఆశిస్తే, దొంగచాటు వ్యవహారాలవాళ్లు చీకటినే ప్రేమిస్తారు.

        బ్రహ్మ విష్ణువు యొక్క నాభి నుండి పుట్టినందున మన్మధునికీ అన్న అయినాడు. వలపునకు రాజు గనుక మన్మధునికి వలరాజు, వలరేడు, వలపురాయుడు అని పేర్లు. కాముడు, చక్కనయ్య అనగా మన్మధుడే. విష్ణువునకు, లక్ష్మీ దేవి యందు పుట్టినట్లు చెప్పుచున్నప్పటికీ, మన్మధుడు
త్రిమూర్తులతోపాటు స్వయంభువునిగాను, స్వయంజాతునిగాను లెక్కించబడుచున్నాడు.