20, జూన్ 2012, బుధవారం

ముచ్చట గొలిపే మూసీనదీ ము చ్చట్లు


ముచ్చట గొలిపే మూసీనదీ ముచ్చట్లు 
                                                గీటురాయి   30-5-1986      
       పోయినసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఒక శాసన సభ్యుడు హైదరాబాద్ లో  నీళ్ళ కరువు తీవ్రత దృష్ట్యా ఒక గొప్ప కోరిక కోరాడు. అదేమిటంటే మూసీ నదీ గర్భంలో బావులు తవ్వి ఆ నీళ్ళు జంటనగరాలకు సరఫరా చెయ్యాలట, నాకు మతిపోయినంత పనయ్యింది. మూసీనదిలో ప్రస్తుతం బావి తవ్వితే ఎలాంటి నీళ్ళు వస్తాయో తలుచుకొంటేనే డోకు వస్తున్నది. నైజాం నవాబు ఈ నదిని మంచి నీళ్ళ కోసం ఉపయోగించినా ప్రస్తుతం ఇది పాతిక లక్షల మంది వదిలే మురుగునీళ్ళు నిలువ చేయటం కోసమే ఉపయోగ పడుతున్నది. ఆ విధంగా ఈ నదిని ప్రభుత్వం దోమల పెంపక కేంద్రంగా అభివృద్ధి చేసినమాట నిజమే.

       విజయవాడ దగ్గర కృష్ణానది లోనూ, రాజమండ్రి గ్గర గోదావరిలోనూ దూకి ఆత్మహత్యలు చేసికొనేవారు లెక్కకు మిక్కుటంగానే ఉంటారు. కానీ మూసీనదిలో దూకి ఆత్మహత్య చేసికొనేంత దైర్యవంతులు భాగ్యనగరంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. అసలు భాగ్యనగరం అనే పేరు వచ్చింది భాగ్ మతీగారిని బట్టే కాట. మూసీనది ప్రసాదిస్తున్న ఈ దోమల భాగ్యాలపంను బట్టే ! ఎందుకంటే ఇంత భాగ్యం కలిగిన నగరం ఇండియాలో మరొకటి లేదాయే !

       అబ్బ తవ్విస్తే అబ్బాయి పూడ్పించినట్లు హైదరాబాదు పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. గతకాలం మేలు వచ్చుకాలము కంటే అనిపిస్తున్నది.

       దేశంలో ఎన్నో నదులున్నాయి.  ఏ నదికీ ఇంత దుస్థితి దాపురించలేదు. అనంతగిరి కొండల్లో పుట్టి వజీరాబాద్ దాకా వెళ్ళి కృష్ణా నదిలో లుస్తున్న ఆ మూసీనదేనా ఇది ? అని ఒకతన్ని అడిగాను. అవును సోదరా ఆ నదీమతల్లే ఇది అన్నాడు. అయితే ఇది నల్లగొండ హైదారాబాద్ జిల్లాల్లో పంటచేలకు నీళ్లందిస్తుందని విన్నాను నిజమేనా ? అని మళ్ళీ అడిగాను. నిజమేనన్నాదూ కానీ కు ఎత్వమివ్వాల, నేనింకేమీ మాట్లాడలేదు.

       సరే మూసీమతల్లి దరిద్ర్యాన్ని వదిలించి ఇతర తల్లులతో సమానం చెయ్యాలంటే ఏం చెయ్యాలి అనడిగాను. ఏం నన్ను కూడా పిచ్చి వాళ్ళలో జమకడదామనుకొంటున్నావా ? అన్నాడు సీరియస్ గా. గతంలో మూసీనది అభివృద్ధికోసం సూచనలు చేసినవాళ్లందర్నీ ప్రభుత్వం పిచ్చివాళ్ళ కింద లెక్క కట్టిందట. అదీ అతనిబాధ. ఫరవాలేదు మనలోమాటే గదా చెప్పమన్నాను. మూడోవాడికి తెలియనివ్వకు అని హెచ్చరించి మరీ మూసీపురాణం ప్రారంభించాడు.

       సోదరా, గతంలో అంటే పూర్వకాలంలో ... అంటే ఇన్ని లక్షల మంది జనం ఈ నగరానికి రాకముందు... మూసీనది స్వచ్చమైన నీళ్ళతో పరిశుభ్రమైన పచ్చని కప్పలతో అలరారుతుండేది. తాగు నీటి కరువు లేకుండేది. కాలం మారింది. కప్పలను తినే జనమోచ్చారు. మూసీనదిలో ఒక్క కప్ప కూడా లేకుండా పట్టుకెళ్లి ఎగుమతి చేశారు. ఊళ్ళో మురుగంతా ఈ నీళ్ళ లోకి వదిలారు. కప్పలు పట్టే వాళ్ళ కళ్ళు గప్పి తప్పించుకున్న కప్పలు, చేపలు కూడా బ్రతకని ఈ సాంధ్ర రసాయనంలో బ్రతుకలేక హరీమన్నాయి. ఆ విధంగా కప్ప జాతిని ఈ నదిలో ఉండకుండా అంతం చేశారు.

       సోదరా, అక్కడి నుండే అసలు కష్టాలు ఆరంభమయ్యాయి. కప్పలు పూర్తిగా నీళ్లలోనే ఉండి కళ్ళు మాత్రం నీళ్లపైనపెట్టి దోమలను అమాంతం మింగేవి. కప్పలు పోయినాక దోమలు దినదినాభివృద్ధి చెందాయి. కప్పలు దొరక్క పాములు కూడా చిక్కిపొయ్యాయి. పాములు చిక్కిపోవటంతో ఎలుకలు బలిశాయి. దోమలు, ఎలుకలు కలిసి ఇక్కడ ఇష్టారాజ్యం చేస్తున్నాయి.

       సరే ఇంతకీ ఏం చేయాలని మళ్ళీ నన్నడగబోతున్నావు గనక చెబుతున్నాను విను. మూసీలోకి మురుగు వదటాన్ని ఆపేసెయ్యాలి. గోదావరీ నీళ్ళను మూసీలోకి మల్ళించాలి అన్నాడు. ఇది అయ్యే పని కాదు సుళువైన మార్గాలు చెప్పు అన్నాను.

       మూసీనది పొడుగునా బాతుల పెంపకం కేంద్రాలు పెట్టాలి. ఆ బాతులకు ఆహారంగా మేలు జాతి చేపలను, కప్పలను, డిబోనికస్, ఇండికస్ పురుగుల్ని కలపాలి. ఇవన్నీ కలిస్తేనేగాని దోమలను వదిలించలేవు మరి అన్నాడు. నీ పురాణం నువ్వు పాడుగాను ప్రభుత్వానికి ఖర్చు లేని తేలికైన మార్గం చెప్పవయ్యా అన్నాను.




       అలాగైతే మూసీనదిని పూడ్చుకొని ఇళ్ళు  కట్టుకోమని క్రమణదారుల్ని ఆహ్వానించటమే అతి తేలికైన పని అన్నాడు.

       అవతల మునిసిపాలిటీ ఆయన మాకేసి అనుమానంగా చూస్తున్నాడు. సంభాషణ ఆపేసి ఇంటి ముఖం పట్టాను. మనలో మాట, సోదరుడు చెప్పిన చిట్కాల్లో ఏది తేలికైందంటారు ?



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి