30, జూన్ 2012, శనివారం

పొంతన కుదరని పోలికలు



పొంతన కుదరని పోలికలు
                                     గీటురాయి   18-4-1986  
                                                                                                             
     “ నేను ముస్లింను, నాకు మరణమంటే భయం లేదు. అని పాకిస్తాన్ అక్వినోగా మన పత్రికల వాళ్ళంతా పొగిడేస్తున్న బేనజీర్ భుట్టో అంది. ఇతర విషయాల పట్ల ఎంతో మోజు చూపుతున్న వాళ్ళంతా వాటిని కొంచెం సేపు పక్కనబెట్టి, ముస్లింలకు మరణ భయం  ఎందుకు ఉండదు ? అని ఆలోచిస్తే బృహద్గ్రంధాలు తయారు చేయవచ్చు.

     ప్రయాణం చేసే వారికంటే పెట్టెలు మోసే వారి హడావిడి అక్కువైనట్లు పాకిస్తాన్ లో జరిగే ప్రతి ఒక్క విషయం మన పాత్రికేయులకు బహు పసందైన వార్తావిశేషం అవుతుంది. తమలపాకుతో తానిట్లంటే, తలుపు చెక్కతో నేనిట్లాంటి అన్నట్లు ఆమె నియంతలెందరో  నేల రాలిన చోటు ఇది అంటే, మానవాళ్లు అంతే కాదు. నియంతల తలలు మొలకలెత్తే చోటు కూడా అదే   అన్నారు.

     అవినీతికి మారుపేరైన  మార్కోస్ తో  జనరల్ జియా ఉల్ హఖ్ ను పోల్చారు. అతని గతే ఇతనికి పడుతుంది అన్నారు. బేనజీర్ కు బ్రహ్మరధం పట్టారు. అయితే ఇంత పచ్చి నియంతగా  మనవాళ్ల కళ్ళకు కనబడుతున్న జియా బేనజీర్ ను పాకిస్తాన్ రావటానికి ఎందుకు రానిచ్చాడో అర్ధం కావడం లేదు. 61 కిలోమీటర్ల పొడవైన రాలీ  బేనజీర్ అధ్యక్షతన జరుగుతుంటే జనరల్ జియా ఈ ర్యాలీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగం అని  నిర్లిప్తంగా సమాధానమివ్వటం కొరుకుడుపడటం లేదు.

     వాస్తవానికి 1977 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిన భుట్టోతో మార్కోస్ను పోల్చవలసి ఉంది. నందిని పండిగా పందిని నందిగా పోల్చవచ్చు కానీ తేడా ఎక్కడికి పోతుంది? జియా ప్రభుత్వం అవినీతి అక్రమాలలో మార్కోస్ స్థాయికి చేరే అవకాశం లేదనీ, బేనజీర్ పీపుల్స్ పార్టీ బీటలు వారిందనీ, కొన్ని రాజకీయ పార్టీలు, మిలిటరీ నాయకశ్రేణి జియా పట్ల అచంచల విశ్వాసం విధేయత చూపుతున్నారనీ, అమెరికా అనుగ్రహం  జియా మీద చాలా ఉందని, మణిలాలోని  రక్షణ మంత్రి లాంటి వాడు పాకిస్తాన్ లో లేడని తెలుసుకొన్న పండితులకు తాము చేసిన పోలిక సరిగ్గా నప్పలేదని ఇప్పుడిప్పుడే అనిపిస్తున్నది. అందుకే ఇప్పుడు ప్లేటు మార్చి బేనజీర్ ను చంపటానికి జియా ఎవరినో   పంపాడు, చూసారా? అంటున్నారు!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి