చెర్నోబిల్ తో చెలగాటం తగదు గీటురాయి 16-5-1986
విద్యుచ్చక్తి + సోవియట్ అధికారం = కమ్యూనిజం అని లెనిన్ మహాశయుడు గొప్ప నిర్వచనం ఇచ్చాడు. సోవియట్ లకు అధికారానికి కొదువలేదు. కావాల్సిందల్లా ఇక విద్యుచ్చక్తి మాత్రమే. అప్పుడే వారు కమ్యూనిజానికి లెనిన్ ఇచ్చిన నిర్వచనాన్ని సార్ధకం చేయగలరు. అందుకని దేశంలో ఉన్న బొగ్గు, నీళ్ళు, ఖనిజ తైలాలతో వెలికి తెచ్చే విద్యుత్తు చాలక దాదాపు 11 శాతం విద్యుత్తును అణు శక్తి ద్వారా తయారు చేస్తున్నారు.
1986 ఏప్రిల్ నెలలో ఉక్రెయిన్ రాష్ట్రంలోని చెర్నోబిల్ అణు రియాక్టర్ పగిలిపోయి దాని లోంచి వెలువడిన అణు ధార్మిక ధూళి మేఘం యూరప్ ఖండంలోని చాలా దేశాలకు వ్యాపించింది. పోలాండ్ లోని పాల నిల్వలన్నీ విషపూరితం అయ్యాయి. వారం రోజుల దాకా వర్షం నీళ్ళు తాగొద్దని స్కాట్లాండ్ తన ప్రజలకు హెచ్చరించింది. చెర్నోబిల్ కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలన్నిటిలో ఇప్పుడు ఎటు చూసినా బట్టతలలే దర్శనమిస్తున్నాయట. దీని
అసలు ప్రభావం కేన్సరు కణుతుల రూపంలో వల్ల పిల్లల్ని బాధించగలదని కూడా శాస్త్రవేత్తలంటున్నారు.
సరే జరిగిందేదో జరిగింది, అసలు ఎందుకు రియాక్టర్ పగిలింది ? ఎంత మంది చనిపోయారు ? అని ఇతర దేశాల వాళ్ళు అడుగుతుంటే రష్యా అధినేతలు వాస్తవాలు ప్రపంచానికి వివరించకుండా ఇది తమ దేశ స్వంత వ్యవహారమని దాటవేస్తున్నారు. పైగా పాశ్చ్యత్య దేశాల సోవియట్ వ్యతిరేక ప్రచారం వల్ల రాజకీయ వాతావరణం కలుషితమైపోయిందని గోర్బచేవ్ గోల చేస్తున్నాడు.
అసలు వాతావరణమే అణు ధూళికి కలుషితమై చుట్టు ప్రక్కల జనం చస్తుంటే ఆయన రాజకీయ వాతావరణాన్ని పట్టుకొని వ్రేళ్లాడటం ఘోరంగా ఉంది. ఈ అణు ధార్మిక శక్తి వలన పశ్చిమ జర్మనీలోని వ్యవసాయ ఉత్పత్తులు తీవ్రంగా చెడిపోయాయి. అందుకు నష్టపరిహారంగా జర్మనీ 920 లక్షల డాలర్లు రైతులకిచ్చుకోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద ప్రమాదం రష్యా సొంత విషయమా ? పైగా ప్రమాదం నుంచి గుణపాట నేర్చుకోమని గోర్బచేవ్ ఇతర దేశాలకు సలహా ఇస్తున్నాడు.
నంబీ నంబీ నా పెళ్లికేం సాయం చేస్తావు ? అంటే, నీ పెళ్ళికి నేను ఎదురు రాను పో ! అన్నాడట. అదేదో పెద్ద సహాయం చేసినట్లు, అణు ప్రయోగాల జోలికి ఒక సంవత్సరం పాటు రానని గోర్బచేవ్ ప్రతిజ్ఞ చేశాడు.
పూరీళ్లలో నివసించేవాడు ఒక ఇంటికి నిప్పు పెట్టుకొని ఇది నా స్వంత ఇల్లు, కాల్చుకొంటాను. ఏమయినా చేసుకొంటాను, మీ కెందుకు అన్నట్లుంది రష్యా వ్యవహారం. అలీన దేశాల పేరుతో ఊరికే కాకి గోల చేసే దేశాలు ఈ వ్యవహారం మీద అసలు ధ్యాసే మళ్లించకపోవడమ్ విడ్డూరంగా ఉంది. ఇదే అమృకాలో జరిగి ఉంటే ఈ దేశాలన్నీ కావు కావుమని ఒకటే గోల చేసేవి వాటికి రష్యా కూడా వంత పాడి ఉండేది. ‘ అమెరికా అణు దాహానికి తగిన శాస్తి ‘ జరిగిందనేది. వాస్తవానికి వార్సా ప్రపంచానిదే మెజారిటీ గదా అందుకే అందరూ గోర్బచేవ్ చెప్పిన గుణపాటం నేర్చుకుండా కలసి రండి అంటున్నారు.
మార్క్స్ గానీ, లెనిన్ గానీ ఇలాంటి మోస పూరిత కమ్యూనిజాన్ని కోరుకో లేదు. సుత్తి కొదవాలి మీ చేటికిచ్చాం మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి అనలేదు. రియాక్టర్ లో గ్రాఫైట్ కడ్డీలు వాడాలని అందరికీ చెబుతూ అణు బాంబులు చేయటానికి సరిపోయే యూరేనియం కడ్డీలు వాడటం మోసం కాదా ? రేయక్క్తర్ చుట్టూ కాంక్రీటు గోడను నిర్మించక పోవడం నిర్లక్ష్యం కాదా ? ఇది ప్రపంచ అప్రజల ప్రాణాలతో ఆటలాడటం కాదా ? ఎవరు ఎన్ని చెప్పినా కామినీ వేషధారికి సాధ్వి నడతలేం తెలుసు ? తెలియవు. అది అంతే !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి