గాడ్సేలమూ మేమే,గట్టి గాంధీలమూ మేమే గీటురాయి 27-6-1986
ఎవర్రా నా దేశాన
నీటి కరువు
తాండవిస్తుందన్నది ?
నా ప్రజల కన్నీరు
ఏరులై ప్రవహిస్తుంటే ?
అని ఓ కవి మన దేశంలో నీటికి కొరత ఉన్నా కన్నీటికి కొరతే లేదని చెప్పాడు. “ నీరు లేని ఎడారిలో కన్నీరయినా తాగి బ్రతకాలి “ అని మరో కవి మన దేశ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చాడు. ఇదెక్కడి చోద్యమమ్మా అని అమ్మలక్కలంతా తమ ముక్కులమీద వేళ్ళు వేసుకొని అడిగినా ఆ కవి తన మాటే చెల్లుతుందన్నాడు.
నీళ్ళకు కన్నీళ్ళకు అవినాభావ సంబంధం ఉన్నట్లు శాస్త్రజులు తేల్చి చెప్పారు. నీరు పుష్కలంగా తాగని ఎడారి జనంలో కన్నీళ్లు విస్తృతంగా కారవట. వారిలో చాలా మందికి “ నీళ్ళు రాని కళ్ళు “ ఉంటాయట. మరి అలాంటి చోట్ల గటగటా త్రాగడానికి సరిపడినన్ని కన్నీళ్లు ఎలా కారతాయో ఆ కవి గారు వివరించలేదు. చిన్న వాళ్ళు తింటే చిరుతిండి, పెద్ద వాళ్ళు తింటే ఫలహారం అన్నట్లు పెద్ద పెద్ద కవులుగా, మేధావులుగా ప్రజల చేత కొనియాడబడుతున్న వారు సైతం అనేక సార్లు అర్ధం పర్థంలేని ఊహలను, ప్రయోజనం లేని పదాలను జనం మీదికి విసురుతున్నారు.
అనేక జాతీయ సమస్యలను వీరు నిష్పక్షపాతంగా చర్చించి యదార్థాన్ని ప్రజల ముందు ఉంచవచ్చు. కానీ కామెర్ల రోగి చందంలో వారి ఛాందస భావాలనే ప్రజల చేత ఒప్పించటానికి వారు సమిష్టిగా ప్రయత్నిస్తున్నారు.
నలుగురు దొంగలు మేకను పట్టుకొని “ అది కుక్కే “ అని ఒక బ్రాహ్మణుడికి టోపీ వేసిన రీతిలో ప్రజల మనస్సులను తిప్పివేస్తున్నారు. కోడి గుడ్డుకు ఈకలున్నాయి పీకమని ప్రజలకు ప్రభోదిస్తున్నారు.
“ ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్ “ అని గాంధీ గారి పాట బాబరీ మసీదులో ముస్లిములు అల్లాను ఆరాధిస్తారు. కాబట్టి అది కూడా రామునికే చెందుతుంది. అందువలన మసీదును బద్దలు గొట్టి రామాలయంగా మార్చాల్సిన అవసరమే లేదు అని కొందరు పండితులు కొత్త తర్కం లేవదీశారు. అయితే రామునిలో అల్లాని చూడాలా, అల్లాలో రాముని చూడాలా అని మరికొందరు పండితులు సాగదీశారు. ఇదంతా చివరికి ఎంతయ్యిందంటే పాట్నాలో పండితులు ఒకర్నొకరు తన్నుకోబొయ్యారు.
“ గాంధేయ సోషలిజం “ అని గొంతు చించుకునే పండితులు కొన్ని లక్షల ఇత్తడి త్రిశూలాలను ఆత్మరక్షణ కోసం పంచి పెట్టారు. మెజారిటీ జనానికే ఆత్మరక్షణ కరువయ్యిందట. తమ కామెర్ల కవిత్వంతో జనాన్ని నమ్మించారు. ఇలా ఆయుధాలు ధరించిన గాడ్సేలు ఎక్కువయితే గాంధీలు బతకారు బాబో అని సబ్ కో సన్మతి వాదుల గోల వినే వాళ్లేరి ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి