27, అక్టోబర్ 2012, శనివారం

లోభికి నాలుగందాల నష్టం



         లోభికి నాలుగందాల నష్టం
గీటురాయి  14-10-1988
                గాజుం బూ యనర్ఘ రత్నమగునా ?
              కాకంబు రాయంచ యౌనా ?
              జోరీగ మధువ్రతేంద్రమగునా ?
              నట్టెన్ము పంచాశ్వమౌనా ?
              జిల్లేడు సూరావనీజ మగునా ?
              నానాదిగంతంబులన్ రాజౌనా ఘన లోభీ దుర్జనుడు ?
              భర్గా ! పార్వతీ వల్లభా !

              అంటూ ప్రస్తుతం ఎన్జీవోలు మొదలుకొని మజిలిసీయులు, కాంగీ        మునిసిపలీయుల వరకు ప్రతి పక్షీయులంతా శార్ధూలాల్లాగా పెద్దన్న మీద        విరుచుకుపడుతున్నారు. యాంటీ ఎంటీయారీయులంతా ఒక పధకం        ప్రకారం ఐక్యం అవుతున్నారు. లోభి బీదకంటే బీడు, లోభి వాని డుగ       లాభంబు లేదయా అనే స్లోగన్లను సిద్ధం చేసుకుంటున్నారు. లోభికి      నాలుగందాల నష్టం అనే సామెత, నా దగ్గరేముంది బూడిద తప్ప అనే   అన్నగారి విషయంలో నిజమయ్యింది. పోతూ పారవేస్తూ పోయి వస్తూ      రుకు తినే పద్ధతిలో కొనసాగుతున్న అన్నగారి పాలనలో అన్ని వర్గాల     జనం అలసిపోయ్యారని మిత్రపక్షం వారు కూడా చిత్రమైన కూతలు కూస్తున్నారు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా ఈ      వ్యవహారమంతా ఉంది గనుక అభివృద్ధి అంటూ మీ లేదని ఆర్ధిక        వేత్తలంటున్నారు. అసలు తీసుకోవటమే గాని ఆ చెయ్యి ఇవ్వటం ఎరుగదని       ఎన్జీవోలు, మునిసిపాలిటీల వాళ్ళు అంటున్నారు. ఇక అన్నగారి వ్యవహారం     చూస్తే నేను లోభినైతే కేంద్రంలోని రాజీవుడు పరమ లోభి. పై నుండి     పైసలు రాకపోతే నేను ఎక్కడ నుండి తెచ్చివీళ్ళందరికీ ఇచ్చేదీ అని       వాదిస్తున్నాడు.
              ఇవ్వకపోతే ఎదుర్కో మా ఉద్యమాలు అంటూ వీళ్ళు దీక్షలకు, దహనాలకు పాల్పడుతున్నారు. ఎంతో కొంత నష్టం జరిగాక గాని అన్నకు   కనువిప్పు కావటం లేదు. వివిధ వర్గాలలో పేరుకు పోయిన అసంతృప్తిని      గమనించి వారి సమస్యలను పరిష్కరిద్దామన్న ఆలోచన ఆయనకు ఉంటే      పరిష్కారం సుళువుగా గాకపోయనా సాధ్యమే. కానీ తన ఆలోచన తప్ప        మరొకని వాదాన్నే తలకెక్కనివ్వని ఒంటెత్తుపోకడవల్ల క్రమంగా తన కాళ్ళ చుట్టూ కంప తయారవుతున్న నిజాన్ని ఆయన గమనించడం లేదు. ప్రతి   వర్గంలోనూ స్వార్ధపరులున్న మాట నిజమే. అయితే ఆయా స్వార్ధపరుల్ని       బట్టి ఆయా వర్గాల అసలు సమస్యలన్నిటినీ పట్టించుకోకపోవటం వెర్రితనమే        అవుతుంది. పూలతోగూడ దారం తలకెక్కినట్లుగా ప్రజా సమస్యలను       చేతబట్టి దురాశాపరులైన నాయకులే రంగం మీదికి వస్తారు.    నాయకులమీద గుర్రుతో సమస్యలు నాన్చటం పేను కుక్కమంటే చెవి కొరికి     నట్లుంటుంది.

              వంగిన వాని క్రింద మరీ వంగిన వానికి ఎలాంటి పరిస్థితి సిద్ధిస్తుందో అలాంటి పరిస్థితే నేడు పరమ లోభి కేంద్రం నుండి లోభి రాష్ట్రం వరకు , దాని   క్రింద వంగిన స్వల్ప లోభి జిల్లా పరిషత్తులు, అతిస్వల్ప లోభి   మునిసిపాలిటీలకు సిద్ధించింది. బంతికే రావద్దంటే విస్తరాకు తెమ్మన్నట్లుగా    ఉంది వీళ్ళ వ్యవహారం అని కేంద్రం రాష్ట్రాలను, రాష్ట్రాలు జిల్లాలను        ఈసడించుకుంటూ ఉంటాయి. బట్టతలమ్మ పాపట తీయమన్నట్లుగా లోభులంతా కలిసి పరమ లోభిని పట్టుకుని ప్రాకులాడుతారు. ప్రజలు        అల్లాడిపోవటం ఆగదు మింటికీ మంటికీ ముడేసినట్లుగా వీళ్ళ మీద వాళ్ళు    వాళ్ళ మీద వీళ్ళూ విరుచుకుపడి చివరికి ప్రజల ఆస్తుల్నే ద్వంసం     చేస్తున్నారు.

                   ఈ రకంగా పరిస్తితి చక్కబడుతుందనే ఆశే కలగటం లేదు. కరువు    భత్యమే ఇవ్వలేక కటకటలాడిపోతున్న సమయంలో విహార యాత్రలకు       యల్. టి. సీ. డబ్బు లిమ్మనట్లు గొంతెమ్మ కోర్కెలు అడిగేవాళ్ళు కూడా        తాము ఎలాంటి వాళ్ళను ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు   డుగుతున్నామో ఆలోచించి మరీ అడగాలి. అడిగేదాకా ఆగటం,        అవతలివాడి నిగ్రహాన్ని పరీక్షించటం, అలిగి ఆందోళనకు దిగాక ఇవ్వటం    లాంటి పనికి మాలిన పనులు మానుకుని ఎవరికివ్వాల్సింది వారికి    సకాలంలో ఇవ్వటం  పదవిలో ఉన్నవాని ఆరోగ్యానికి మంచిది.

పోరునష్టం పొందులాభం



పోరునష్టం పొందులాభం
గీటురాయి 2-9-1988

       ఇద్దరు మనుషులు తన్నుకుంటున్నారనుకోండి. ఎవడో ఒకడు       ఎంతకీ గెలవకపోతుంటే చూసే వాళ్ళకు విసుగుపుడుతుంది. చూసే వాళ్ళకే        కాదు ఆ తన్నుకునే వాళ్ళకు కూడా ఏమిటీ జిడ్డు పరిస్థితి అనిపిస్తుంది.      విజయమో వీర స్వర్గమో సిద్ధించటం లేదేమిటా అని దిగులు పట్టుకుంటుంది. ఇద్దరూ సమజ్జీలే అయినప్పుడు తన్నుకొని తన్నుకొనీ       నీరసించిపోయి పళ్ల బిగువున పోరాడుతూ ప్రేక్షకుల్లో నుంచి ఎవరైనా        పెద్దమనుషులు వచ్చి విడదీస్తే బాగుండు అనుకుంటారు. ఐక్యరాజ్యసమితి     లాంటి అతి సున్నితమయిన కంల తడిక పెద్దమనిషి ఎవరయినా దొరికితే    అతన్ని అడ్డం పెట్టుకొని : -

       మాయదారి కీచులాట మా మధ్య వచ్చింది
       రాయబారం సేయవే డికో తడిక
       డి వగలమారి మాటలకు ఒళ్ళంతా మండుతుంది
       రాయబారమెందుకే తడికో తడిక

       అని ఊగులాడతారు. తడిక పెద్ద మనిషి రాయబారం సఫలమై పోరు       విరమించవలసివస్తే ఈ పెద్ద మనిషి వల్ల ఆగానుగాని లేకపోతే వాడిని       మక్కెలు ఇరగబొడవక పొయ్యానా అని బింకాలు పలుకుతారు ఫలానా మయంలో వాడు నిన్ను పొర్లించి పొర్లించి తన్నాడుగదా అంటే మీసాలకు     ట్టి కాలేదుగదా అంటారు.

       మూడు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను      పొడిచాడట ఎవడో. ఎనిమిదేళ్ళు యుద్ధం చేసి మధ్యనే మానుకున్న     రాన్ ఇరాక్ లు ఏమి సాధించాయి అన్నది అన్ని దేశాలు ఆలోచించాలి.        లక్షలాది జన నష్టం,స్థి నష్టం జరిగింది. కూలి నాలి చేసి కుదురాల ఉండక మొగుణ్ణి కట్టుకొని సగమైపోతినే అని ఒకామే విచారపడిందట. అలాగే       అనవసరంగా యుద్ధం చేసి అన్యాయమై పోతిమే అని ఈ రెండు దేశాలు     ఇప్పుడు చింతిస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం   మిటి? పోరునష్టం పొందులాభం అని ఎంత మంది చెప్పినా ఆనాడు వినలేదు. ఓదార్చే కొద్దీ ఏడ్చే బిడ్డల్లాగా సవరదీసే కొద్దీ నిక్కుతూ ఎవరు     ఎన్ని విధాల చెప్పినా వినకుండా ఎగబడి తన్నుకున్నారు. ఒంట్లో ఇంట్లో      ఉన్న సత్తువ అయిపోయిందేమో జరిగిన పరాభావాలన్నీ లోలోనే       దిగమింగుకుని పోరు విరమిస్తున్నామన్నారు. ఇంతకాలం      మంకుపట్టుపట్టినా ఇప్పుడు విడదీసే వాళ్ళకోసం ఆబగా చూస్తూ ఐరాస        పిలిచిందే చాలన్నట్లు రెండు దేశాలు పలికాయి. పలకమే కాదు పిలుపులకు కులికాయి. కులకమే కాదు పూర్వపు వలపులు       ఒలకబోశాయి. రేపోమాపో ఎదురెదురుగా కూర్చుని మనసు విప్పి    మాట్లాడుకుంటాయ.

       రేపటి చర్చలు కూడా సరసాలు విరసాలు లేకుండా సజావుగా జరిగి వీళ్ళ పోరు నిజంగానే శాశ్వతంగా ఆగిపోవాలని ఆశిద్దాం. ముందు నడిపించి      కొంకులుగొట్టే దేశాలను, మానిన పుండు మళ్ళీ సెలపోసేలా చేసే సూపర్ పవర్లను కంట్రోల్ చేసి శాంతి స్థాపన జరిగించమని దైవాన్ని వేడుకుందాము.    దైవానికి కూడా లొంగని మొండిబంలయితే మనమేం చేయగలం ? ఇక    వాళ్ళు ముంమొయ్యక తప్పదు మరి. తప్పు నుండి మరింత       తప్పుడుతనంలోకి కాకుండా ఒప్పు వైపుకు సాగిపోవాలనేదే ఎవరికైనా        నేనిచ్చే సలహా.






      



      

పరహింసే పరమ ధర్మం



       పరహింసే పరమ ధర్మం
గీటురాయి      23-9-1988
                బాధే సౌఖ్యమనే భావన రానీ వోయ్
              ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్        || జగ ||
             
              అంటాడు దేవదాసు. అందని ద్రాక్షపళ్ళు పుల్లన అనుకున్న నక్క     లాగ ! మత్తుమందులకు దాసులైపోయిన మనుషులు ఇలాంటి నిర్వీర్య     మైన భావాలకు లోనై మనో నిబ్బరం లేని వారై సంఘంలో కృంగి దర్శనమిస్తున్నారు. శక్తి చాలని వాడు సాధుత్వం వహించినట్లు, డబ్బులేని       వాడు దాతృత్వం గురించి ప్రసంగించినట్లు, కుదరని రోగం వచ్చినవాడు       దైవం వైపు మళ్ళినట్లు మా చెడ్డ అవకాశవాదులౌతున్నారు. ముఖాన తూ        అని మ్మేస్తే తుడుచుకుపోతున్నారు. సారాయి మానరా చవటా అంటే ఇదే       నా ఆనందానికి రాచబాట అన్నట్టు చివరికి జవాసత్వాలుడిగి, నరాలు    సళ్ళిచ్చి నవనాడులూ క్రుంగిపోయిన వేళ, చేతికి ఊతకర్ర తోడైన వే,     గతంలోని తమ మురికి జీవితాన్ని మరచి ధర్మపన్నాలు వల్లిస్తున్నారు.

              ముసలి వేశ్య పాతివ్రత్యాన్ని గురించి పలికినట్లు, నపుంసకుడు        బ్రహ్మచర్యమే మంచిదన్నట్లు, వార్ధక్యంలో వీరంతా సకల సద్గుణ       సంపన్నులుగా మనకు పరిచయం కాబోతారు. కానీ వాళ్ళ గత జీవిత     చిత్రాలు మన మెమరీలో ఉంటే ఒక్కసారి ఆ రీలు తిప్పుకోవచ్చు. అయ్యల ఘనత గుర్తు తెచ్చుకోవచ్చు.

              ఆనాటి దేవదాసు కొంతవరకు నయం. తన బాధేదో పరమానందం    అనుకొని తనలో తానే పరవశించి పోయ్యాడు. అసలు దేవదాసు అనేది ఎంత మంచి పేరో మనకు తెలుసు కానీ ఆ పేరు వినగానే తాగుబోతు    నాగన్నే గురుతు కొస్తున్నాడు. పేరు గుణనిధి పెను వేపవిత్తనం అన్నట్లుగా   ఆ పేరు విలువను పతనం చేసేవాళ్ళు సంఘం నిండా ఉన్నారు. సరే,        ఈనాటి దేవదాసులు, భంగు దాసులు, మందు దాసులు ఊహా లోకాల్లో     తేలిపోవటం లాంటి పిచ్చి పనులు చెయ్యకుండా పది మందిలోకి వచ్చి ప్రతి        బంధకం అవుతున్నారు. పిస్టల్స్ లాంటి ప్రమాదకరమైన వస్తువులు ప్రజల మీద ప్రయోగిస్తున్నారు. పోలీసులకు కూడా పాఠాలు నేర్పుతున్నారు.       పరహింసే పరమధర్మమంటున్నారు.

              మానాభిమానాలు మం గలిపి, పెద్దల సలహాను పెడచెవిని బెట్టి,    సాగినన్నాళ్ళు చెడదిరిగి, సాగని రోజున సాధు వేషాలతో సూక్తులు       చెబుతున్నారు. అర్ధ నిమీలిత నేత్రాలతో వైరాగ్య బోధ చేస్తున్నారు.

              ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఫ్రాన్స్ లో అలెన్ గ్రేసీయా అనే దుర్మార్గపు త్రాగుబోతు, మత్తు మందుల దాసుడు దాదాపు 120 మంది    స్త్రీలను మానభంగం చేశాడ. కొందరిని హత్య కూడా చేశాడ. చివరికి    పోలీసులకు చిక్కి కోర్టులో హాజరై అప్పుడెప్పుడో ఈ పాడు పనులు చేసిన    మాట నిజమే. ఇప్పుడు అలాంటి పనులు చేయలేనంత        ముసలివాడినయ్యాను. పైగా మారు మనస్సు పొందాను. ఇంకా నాకు       శిక్షేమిటి నారాయణా అంటూ నన్ను శేష జీవితం గడుపుకోనివ్వండి అని       కోర్టు పెద్దలకో ఉచిత సలహా విసిరిపారేశాడట. ఇతని మా నిజమేస్మీ అని     న్యాయవాదులు, న్యాయమూర్తులు తలలు పట్టుకొని న్యాయాన్ని బిగబట్టి ఉంచార. ఇక ఇప్పుడు చెప్పండి. ఇలాంటి దేవదాసుల్ని, కాదు కాదు        అలాంటి గ్రేసీయాలను ఏం చెయ్యాలో ?


      





దేశ సంపదను కొల్లగొట్టడమే దేశభక్తి?



దేశ సంపదను కొల్లగొట్టడమే దేశభక్తి?
                                                                గీటురాయి 16-9-1988

                   సమ్మె ఘొరావు దొమ్మి – బస్సుల దహనం లాఠీ
              శాంతి సహనం సమధర్మంపై – విరిగెను గూండా లాఠీ
              అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ
              హెచ్చేను హింసా ద్వేషం మౌతుందీ దేశం ?

       అని ఓ పెద్దమనిషి చెప్పినట్లుగానే జరుగుతున్నది. ధర్నాలు, సత్యాగ్రహాలు,        నిరాహారదీక్షలు, ఊరేగింపులు, ఉద్యమాలు మంచి ఊపు మీద సాగిపోతున్నాయి. డుస్తున్నా వెందుకురా అంటే ఒకనాడు నా మొహం    నవ్వి చచ్చిందా అన్నడట. ఈ దేశంలో అలజడి, ఆందోళన లేని రోజంటూ     లేదేమో ! సరే ఈ ఆందోళనలు జరుపుతున్న వారి తీరు ఎలా ఉందంటే     పెరటికి పొయ్యిన వాడిని తన్నలేక దేనినో తన్నినట్లుగా ఉంది. మొహం        బాగా లేదని అద్దం పగులగొట్టినట్లుగా గూడా ఉంది. ఏ ఉద్యమం లేవదీసినా       అది శాంతియుతంగా సాగిపోతే ఎవరికైనా అభ్యంరం ఉండదు. కానీ       ప్రతివాడూ తన ప్రతాపాన్ని ఆర్టీసీ బస్సుల మీద చూపిస్తుంటే ఇక ఏం చెయ్యాలి ? ఒక ప్రక్క నక్సలైట్లు ఆర్టీసీ బస్సుల్ని తగల బెడుతున్నారని   గగ్గోలు చెందే సత్యాగ్రహులే తమ వంతు వచ్చే సరికి వాటి గాలులు        తియ్యటం, అద్దాలు పగులగొట్టడం, రాళ్ళు రువ్వటం వాటిని తగుల బెట్టటం        లాంటి చేష్టాలకు తలపడుతున్నారు. ఇక వాళ్లకూ వీళ్ళకూ తేడా ఏమిటి ?

              ఎద్దు చేను మేసిపోయిందని గాడిద చెవులు కోసినట్లుగా ఉంది   ఉద్యమాల వ్యవహారమంతా. సమ్మెలు చేసేవాళ్ళు ప్రభుత్వాధినేతల్ని       పట్టుకొని మీకు సిగ్గులేదా, శరం లేదా, చీమూ నెత్తురు, మానాభిమానాలు   లేవా ? మా కోర్కెలు తీర్చే మనసు లేదా ? అని వాళ్ళను మొహాన        పట్టుకొని అడగవచ్చు. అలా అడిగే అవకాశం దొరక్కపోతే నాయకుల        ఇళ్లముంలో కార్యాలయాల ముంలో గుడారాలు వేసికొని రిలే నిరాహార దీక్షలు చేస్తూ సత్యాగ్రహాన్ని ప్రకటించవచ్చు. పది మంది పత్రికా విలేఖరుల్ని పిలిపించి వారి ముందు గూడా తమ ఆవేశాన్ని వెళ్లగక్కి తమ        డిమాండ్లకు బహు ప్రచారం గావించుకోవచ్చు. కానీ నోరు వాయిలేని మూగజీవాల వంటి బస్సుల్ని తగలబెట్టటం ఎంత పాపమో, ఎంత నీచ      కార్యమో ఆలోచించుకోవాలి. దేశ సంపదను నాశనం చేస్తే అది ఎవరికి నష్టం    ? దేశ భక్తులెవరూ దేశసంపదను నాశనం చెయ్యరని తెలుసుకోవాలి.

              పనీ లేదు పాటా లేదు పదండ్రా ప్రదర్శనలన్నా చేద్దామని ప్రతిపక్షాల        వాళ్ళు బయలుదేరుతుంటారు (రాష్ట్రంలో కేంద్రంలో గూడా). పనిలేని మంగలి        పిల్లి తల గొరిగినట్లుగా, పని పాతరబెట్టి గంప జాతరకు పోయినట్లుగా కొన్ని      ఉద్యమాలు ఉన్నాయి. కేవలం తమ ఉనికిని తెలియజేసుకోవటానికి,       మేమింకా బ్రతికే ఉన్నామని చాటుకోవటానికి దో ఒక నెపంతో చౌకబారు        ఉద్యమాలు ఊరేగింపులు చేసి చీటికీ మాటికీ ప్రజా జీవితానికి        ఇబ్బందులు కలిగించేవారూ ఉన్నారు.

              ఇక ప్రభుత్వం నడిపే నాయకులు వీరికి తోడుబోయిన వారే గదా ?   బావా మరుదుల సరసం లాగా, కట్నం కాడ పేచీ పడిన వియ్యంకుళ్ళలాగా ప్రభుత్వము ప్రతిపక్షాలు ప్రజల ముందు ప్రదర్శన లిస్తుంటాయి. సవాళ్ళు   విసురుకుంటాయి. ఈ కసుర్లు బుసుర్లతోటి కాలక్షేపం బాగానే జరుగుతుంది      కానీ ఫలితం శూన్యమే. దేశ పరిస్థితి మాత్రం ఈకలు తీసిన కోడిలాగా    తయారౌతుంది.

              జిల్లాల వాళ్ళు హైదరాబాదుకు, రాష్ట్రాల వాళ్ళు ఢిల్లీకి పోయి ప్రదర్శన       లిచ్చే పరిస్థితి రాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుతాలు ఇక మీదటైనా జాగ్రత్త పడితే       బాగుంటుంది. కేవలం అధికారం కోసం పెనుగులాడటం మాని ప్రజోపయోగ     కార్యక్రమాలు కొనసాగించటం అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ తమ ధ్యేయంగా   పెట్టుకోవాలి. వాటి కోసం పార్టీ తరఫున నిధులు కేటాయించాలి. పోస్టర్లకు ప్రదర్శనలకు పెట్టే ఖర్చు ఇటు మళ్ళించితే చాలు.