24, అక్టోబర్ 2012, బుధవారం

అరిషడ్వర్గాలు



అరిషడ్వర్గాలు

అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు మనిషికి శతృవులు కాబట్టి వాటిని గెలవాలి అంటారు పెద్దలు . కానీ ఆరింటిని మనుషులు ఎన్నటికీ జయించలేరు అని నా అనుమానం.అయ్యప్ప యాత్రలో గానీ  హజ్ యాత్రలో గానీ పాల్గొన్నవాళ్ళు దీక్ష నాలుగు రోజులూ సంసార బంధాలకు దూరమై సన్యాసుల్లాగా,దైవ  నామస్మరణలో తన్మయులై,భక్తిలో తాదాత్మ్యం చెంది, గోళ్ళూ వెట్రుకలూ కత్తిరించుకోకుండా భక్త ఫకీరులై పోతారు.హజ్ కు వెళ్ళకుండా కేవలం ఖుర్బాని ఇచ్చేవాళ్ళు కూడా అల్లా ధ్యాసలోనే మాలధారుల్లా ఉంటారు.ఏ మతస్థులైనా సరే దీక్ష లో ఉన్నంతవరకే శాంతమూర్తులు. దీక్ష విడిచారుద్రమూర్తులౌతున్నారు . కోపం రానిది ఎవరికి? అరిషడ్వర్గాలను జయించటం అసలు మెదడున్న మనిషికి సాధ్యమనిపిస్తోంది.
అనుమానం తీర్చుకోటానికి రెండు మతాల వాళ్ళను చెరో ప్రశ్న వేశా.అమ్మవారు తన ఆభరణాలు పోయి తిరిగి దక్కలేదన్న  కోపంలో ఉందనీ,మక్కా యాత్రికుల ప్రాణాలు అల్లా కాపాడలేదనీ.ఈసారి ఇద్దరూ ఒకేరకంగా స్పందించారు. ఇద్దరికీ కోపంబెక్కువ తాల్మి ఇల్ల.హేతువాది ఆకురాతి గోపాలకృష్ణ గారి పద్యాలకు కోపం రాని భక్తుడు నాకు కనపడలేదు . ఇలా కాదులే అని ఇంకో రూట్లో వచ్చా. నాలుగేళ్ళనుండి నవరాత్రుల్లో అమ్మను చూస్తూ ఆమె పాద సన్నిధిలోనే నలభై రాత్రులు సేవ చేసి నాలుగు సార్లు హంసవాహనమెక్కి ఊరేగిన అనుభవంతో చెబుతున్నా వినవయ్యా అన్నా ఓస్ ..అదేం పెద్ద గొప్ప కాదులేవో    అని చప్పడించిన వాళ్ళూ ఉన్నారు.పైగా
మా దేవత గురించి నువ్వేవడివి చెప్పటానికీ అని ఒకరంటే ,మా దేవుడిని అంత శక్తిలేని వాడిగా పరిగణిస్తావా అని ఇంకొకరు తిరగబడ్డారు.
ఆగ్రహించిన భక్తులకు కోపం పాపకారణం నాయనా .పదవులు శాశ్వతం కాదు. అమ్మ దృష్టిలో అల్లా దృష్టిలో అధికారీ అనధికారీ అందరూ సమానులే.అందరం పోయేది కాటికే.అమ్మనీ అల్లానీ ఒకేరకంగా చూద్దాము అని హితోపదేశం చేయబోతే ఇలాంటి సారంగనీతులు,హరికధలూ  చాలా విన్నాము లే  పో అన్నారు కొందరు. ఇంతకీ నామాట ఎవరూ వినలా.జీవితమే ఓ కొట్లాట అని ఎదురు బోధించారు.
అరిషడ్వర్గాలను మనిషి జయించాలి లాంటి నినాదాలు చూచినప్పుడు అది నరమానవుడికి సాధ్యంకాదని చెప్పి ఇదిగో ఇలాంటివి అని ఎవరో ఒకరి చేత ఏదో ఒకటి అనిపించుకున్నప్పుడు  అమ్మమీదా అల్లా మీదా అలిగి ,భక్తులు దేవుడిని  ఏదో ఒకటి అన్నప్పుడే రుణించారని గత చరిత్ర గుర్తుతెచ్చుకొని మంచి చెప్పినా వినకుండావాళ్ళు ఏదో ఒకటి నన్ను అంటుంటే  ఉరుకుంటావా ?ఉన్నావా అసలున్నావా?రాతిబొమ్మవై నిలిచావు,చేతకాని వాడనిపించావు' అని తుకారాంతో గొంతుకలుపుతాను.
కొసమెరుపు:  కర్నూలు జిల్లా దేవరగట్టు మాలమల్లేశ్వరుడి బన్నీ ఉత్సవంలో జరిగే కర్రల యుద్ధం ఆపటం ఎవరివల్లా కాలేదట.తలలు పగిలినా కొట్టుకోటం మానం అని తెగేసి చెప్పారట అక్కడి జనం.దీన్ని ఆపటం బ్రిటీషోడి వల్లే కాలేదు,మీ వల్ల ఏమవుతుంది ? అని పోలీసులకు ఎదురు ప్రశ్నకూడా వేశారట.ఇదంతా కోపంతో కొట్టుకోము సంబరంగా తలలు పగలగొట్టుకుంటాము అని జనవిజ్నానవేదిక వాళ్ళకు ఎదురు తిరిగి హితోపదేశం కూడా చేస్తున్నారట.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి