14, అక్టోబర్ 2012, ఆదివారం

అప్పిచ్చి చూడు అప్పు చేసి చూడు



అప్పిచ్చి చూడు అప్పు చేసి చూడు

గీటురాయి 12-8-1988
       అప్పిచ్చే వాడు, వైద్యుడు, ఎప్పుడూ ఎడతెగకుండా పారే రూ, ద్విజుడూ ఉన్న ఊళ్ళో మాత్రమే ఉండమని ఒక మతిమంతుడు సలహా ఇస్తాడు. ఎందుకంటే తీసుకున్న అప్పు తిరిగి తీర్చలేనప్పుడు, అప్పు ఇచ్చినవాడు పట్టుకొని అప్పచ్చి అయ్యేలా చితకబాదితే, తగిలిన దెబ్బలు నయం చేయటానికి వైద్యుడు కావాల. జరిగిన అవమానం భరించలేక వైద్యుడు దగ్గరకు కూడా వెళ్ళటానికి మనసొప్పకపోతే దూకి చచ్చిపోటానికి, దూరంగా కొట్టుకుపోటానికి అలా ఎప్పుడూ రాత్రిబగళ్ళు ఎడతెగకుండా పారే ఏరు ఉండాల. ఒకవేళ దూకినప్పుడు ఎవరైనా చూచి ఒడ్డుకు చేర్చి వైద్యుడు దగ్గరికి తీసికెళ్ళినా బ్రతక్కపోతే లేక దూకి చచ్చినాక వమై దొరికితే అంత్యక్రియలు జరపటానికి ద్విజుడు కావాల. మరి ఇం ముందు చూపుతో సలహా ఇచ్చిన మహనీయుడెవరో గాని మహా అప్పారావే అయ్యుంటాడు.

          అప్పిచ్చి చూడు, ఆడపిల్లనిచ్చి చూడు అన్నారు. అప్పు చెయ్యాటమే గాని తీర్చటం ఎరుగని వాడికి వైద్యుడు ఏ మందు వేసీ బాగు చేయలేడు. అప్పులిచ్చిన వాళ్ళు రులాగా ఎదురైనా వాడు ఎదురీది గెలుస్తాడు. అప్పు లేకపోతే ఉప్పు గంజైనా మేలు, అప్పు లేకపోవటమే ఐశ్వర్యం అని చెప్పటానికొచ్చిన ద్విజుడికి కూడా అప్పు చేసి పప్పు ప్పళం లాగించమని తప్పుడు పాఠాలు చెబుతాడు. అప్పు ఎలా ఎగ్గొట్టాలో, అప్పులిచ్చిన వాళ్ళ నుండి ఎదురయ్యే ముప్పులు ఎలా తప్పించుకోవాలో సవివరంగా బోధిస్తాడు. అప్పు ఎగ్గొట్టటం తప్పురా అని చెబితే ఫలానా వాడి అప్పు తీర్చటం కోసం అప్పు ఇవ్వమంటాడు. ఆ అప్పుల కాపును ఒప్పించటంకంటే తప్పించుకు తిరగమే గొప్ప పని. అసలు వాడి ముఖం కూడా అప్పు తీసుకునేప్పుడు అమృత పానం చేస్తున్నట్లు, అప్పు తీర్చే సమయంలో రక్తదానం చేస్తున్నట్లుగా మారిపోతుంది.

       తప్పించుకు తిరగటం అంటే గుర్తుకొచ్చింది. అప్పిచ్చే వాడొకడు ఊళ్ళో ఉండి తీరాలని సెలవిచ్చిన అప్పారావే అప్పు తీర్చలేకపోతే తప్పించుకు తిరగమని బోధించాడు. అది కూడా ఎలా ? అప్పిచ్చిన వాణ్ణి నొప్పించకుండా, తాను ఇబ్బంది పడకుండానట. అది ఎలా సాధ్యం అని చప్పరించకండి. అప్పిచ్చిన వాడికి సదా కనబడుతూ నేనిప్పట్లో నీ రుణం తీర్చలేను బాబాయ్ అని చెప్పుతూ పోతుంటే వాడు తప్పని సరిగా బాధపడతాడు. చెప్పు తీసుకొని తన్నలేనంత సాధు స్వభావుడైతే పెద్దమనుషుల్లోకి లాగుతానానో, కోర్టు కీడుస్తానానో చెబుతాడు. అది ఇద్దరికీ బాధేదా ? సరే ఒకవేళ అతని అప్పు తీరుస్తానని మాట ఇద్దామా ఆంటే ఇంకో చోట అప్పు (రుణార్ణము) చెయ్యాలి. ఇప్పటికే అయ్య సంగతి ఊళ్ళో గుప్పుమని ఉప్పుల్లు కూడా పుట్టని రోత పరిస్థితి ఉత్పన్నమైనందున ఈ పని తప్పకుండా తనకు బాధాకరమే అవుతుంది. అందుకే అప్పిచ్చినవాడు ఆ వీధి గుండా వస్తుంటే ఈ వీధి గుండా పరుగెత్తి మాయమైపోవటం మంచి పని అని అప్పారావు గారి అభిప్రాయం. అలా వీధులు మారుస్తుంటే అప్పు అడగటానికి కొత్త కాపులెవరైనా ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుందట.

       అప్పు ఇచ్చి అవతలి వీధి అరుగు మీద కాచుకుని కూచున్న అప్పన్న దీక్షితుల వారు దగ్గరకు పిలిచి మోయ్ అప్పరావ్ దన్నా గొప్ప సంగతి చెప్పవోయ్ ఆంటే న్ని దానాలలోకెల్లా అప్పు దానం(నీళ్ళువ దులుకోవటం) మేలు అంటాడు. వీడికి తోడు బోయిన మరో అప్పారావు ఎదురై ఏమిటీ చెయ్యటం ఆంటే అన్ని దానాలలోకెల్లా నిదానం శ్రేష్టం అంటాడు. 
     ఈ అప్పుల పురాణం ఇప్పుడెందుకు చెప్పానంటే, మా ఆఫీసు సూపరింటెండెంట్ ఒకాయన అప్పారావని తెలిసి కూడా అప్పిచ్చి అది తిరిగి రాబట్టుకోలేక అయిదు నెలల్నుంచీ ముప్పతిప్పలు పడుతున్నాను. ఉబుసుపోక పాఠకులు ఇలాంటి మనుషులకు అప్పులిచ్చి తిప్పలు పకుండా ఉండాలని తెలియేజేస్తున్నాను. 
 అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా

గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా

దొంగతనము తప్పురా దోపీడీలు ముప్పురా

అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా

ఉన్నవారు లేనివారు రెండే రెండు జాతులురా

ఉన్న చోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా

వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా

అంతగాను కోర్టుకెళితే ఐపీ బాంబుందిరా

రూపాయే దైవమురా రూపాయే లోకమురా

రూకలేనివాడు భువిని కాసుకు కొరగాడురా

-----పింగళి ,సాలూరి,ఘంటసాల






1 కామెంట్‌: