23, ఆగస్టు 2012, గురువారం

ప్రజాస్వామ్యంలో కుక్కల పాత్ర


ప్రజాస్వామ్యంలో కుక్కల పాత్ర
                   గీటురాయి  10-7-1987        
              ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ఏ ముహూర్తంలో కుక్క ప్రస్తావన తెచ్చారో గాని నా సామిరంగా ఇపుడు కుక్కల మీదనే మహాసభలు జరుగుతున్నాయి. ఎక్కడ పదిమంది గుమికూడినా కుక్కల మీదనే వ్యవహారం నడుస్తున్నది. అసలు కుక్కంత విశ్వాసపాత్రమైన జంతువు    మరొకటి లేదని తన చంకలోని కుక్క మూతిని ముద్దు పెట్టుకుని మరీ      చెప్పాడు ఒక ఆసామి. ముద్దు చేసిన కుక్క మూతి కరిచేను అని ఒక ఉచిత సలహా ఇచ్చాడు మరోకాయన.

              ఇటీవల ఒక పరీక్షలో కుక్కను గురించిన వ్యాసం ఇచ్చి ప్రెసిస్ రైటింగ్        రాయమన్నారు. కొన్ని ఇంటర్వూలలో కూడా కుక్కల మీదనే ప్రశ్నలు      వేశారట. ఉదాహరణకు ఈ క్రింది ప్రశ్నలు చూడండి: -

1.    చెప్పు తినే కుక్క చేరుకుతీపెరుగునా?
2.    కుక్క పైన గొంగళి వేయగానే గంగిరెద్దు అవుతుందా?
3.    కుక్క తోక చక్కనవుతుందా?
4.    కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదవచ్చా?
5.    కుక్కను అమ్మితే, డబ్బు మొరుగుతుందా?
6.    కుక్కలు బలిస్తే గోనెలు మోస్తవా?
                ప్రశ్నలకు అవునన్నా కాదన్నా ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు        చప్పడిస్తున్నట్లు, అభ్యర్ధులకు కుక్కలపై ఉన్న పరిజ్ఞానం మరింత లోతుగా        తెలిసికుంటున్నట్లు కొందరు చెప్పారు.

              ఇక సారస్వత పరిషత్తు హాళ్ళలో కవులు కూడా సమావేశమై కుక్కల       మీద సుదీర్ఘ సమాలోచనలు, గోష్టులు జరిపారు. కొందరు కుక్కల    ప్రాశస్త్యాన్ని పొగిడితే, కొందరు వాటి నీచ గుణాన్ని తెగిడారు. చివరికి చాలా       సమావేశాలు కుక్కలన్నీ పోట్లాడుకొని కూట్లో దుమ్ము పోసుకున్నట్లు       కుక్కలు చింపిన విస్తరిలాగా విచారకరంగా ముగిశాయి.

              కుశ్వంత్ సింగైతే కుక్క మీద పెద్ద పెద్ద జోకులు పేలుస్తూ వ్యాసం     రాశాడు. మన ముఖ్యమంత్రి రామారావు కూడా ఈనాటి కాంగ్రెస్ నాయకులంతా కుక్క మూతి పిందెలు అని అడపా దడపా వర్ణిస్తూ   ఉంటం మనకు తెలుసు. కనకపు సింహాసనం మీద ఒక శునకాన్ని        కూర్చోబెట్టి రన్నింగ్ కామెంట్రీ రాసిన పత్రిక అసెంబ్లీ చేత ఎలా చీవాట్లు తిందో      మనకు తెలుసు.

              మోరిగే కుక్క కరవని కాంగ్రెస్ వాళ్ళు రాజీవ్ కు దైర్యం        చెబుతున్నారు. కరవలేని కుక్క మొరిగితే ప్రయోజనమేమిటని కొందరు నిరాశావాదులు గోల చేస్తున్నారు. ఒక వేళ కరిచినా కుక్క కాటుకు    చెప్పు దెబ్బ లాంటి మందు మా దగ్గర ఉందిలే అని గోర్బచెవ్ గొంతు బొంగురు   పోయేలా అరిచి చెబుతున్నాడు.     
              జెఠ్మలానీ వేస్తున్న ప్రశ్నలు చూసి కుక్క తెచ్చేవన్నీ ఎముకలే     అని కొట్టిపారేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు.

              కులికే కుక్కను తెచ్చి ఒలికిలో పెడితే, ఒలికంతా చెకులికిందట.     ఛాన్సు దొరికిందే చాలనుకొని జెఠ్మలానీ అరుపులు అధికం చేశాడు. కానీ     దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఆస్తంతా స్వాహా చేసిన   తరువాత అరుపులకు సార్ధకత ఏమిటి అని, కొందరు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే కుచ్చులన్నీ       తెగకొరికింది అంటూ సింహాసనం మీది నుంచి దిగిపో అనే శీర్షికలతో కొన్ని        పత్రికలు సంపాదకీయాలు కూడా రాశాయి. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు అనే సామెతను అప్పుడే కొందరు కుక్క మీద వర్షం    కురిసినట్లు అని మార్చుకున్నారు. (చటచటా విదిలించుకుందట కుక్క).              కుక్క – అతిమూత్ర వ్యాధి, బంధు వైరం లేకపోతే గంటకు ఆమడదూరం      పోతానన్నదట, దేశాన్ని 21 వ శతాబ్దంలోకి ఈడ్చుకుపోతాననే మాట రాజీవ్        గాంధీ ఇక అనకూడదని ఫెర్నాండెజ్ లాంటి వారు పట్టుబడుతున్నారు.     కుక్క ఎక్కలేక కాదు చచ్చేది, పెరుక్కోలేక అన్నట్లు ఇప్పుడు ఇరుపక్షాల       వాళ్ళు మంచి రణరంగంలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇదంతా చూచి    నిజం        కుక్కలు గూడ తమ భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకోవటానికి న్యూఢిల్లీలో    సమావేశమైనా కావచ్చు.

4 కామెంట్‌లు:

  1. chicken,beef,pork లాగా కుక్కమాంసం తినే వాళ్ళుకూడా కొన్ని దేశాలలో ఉన్నారు.మనిషిని ప్రేమించగల ఏకైక జీవి కుక్క. అలాంటి ప్రేమస్వరూపాన్ని చంపి తిన బుద్ధేస్తోందంటే ఛ ! వీళ్ళు మనుషులు కారు అని కొందరు విమర్శించవచ్చుగాక.లోకో భిన్నరుచి.ఎవరి ఆహారం వారిది.వాళ్ళూ మనుషులే.పైగా ఒలంపిక్స్ పతకాలు తెగ గెలుచుకున్న విశ్వామిత్ర సంతానం.మనిషిని నమ్మి మచ్చిక అయితే కోడి,గొర్రె,బర్రె,పిల్లి,ఆవు,ఎద్దు...అన్నీ యజమానిని ప్రేమిస్తాయి.ఈమధ్య చెట్లు కూడా మాట్లాడుకుంటున్నాయని తెలిశాక ఇక శాఖాహారం తినటానికి కూడా జంకాల్సి వస్తోంది.28 రకాల నరకాలలో 19 వ నరకం సారమేయాదానం: ఆహారంలో విషం కలిపే వాడు,ప్రజల ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసే వాడు సామాజిక జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి లాగా చేసే వాడు ఈ నరకానికి వస్తాడు.ఈ నరకంలో తినడానికి కుక్కమాంసం తప్ప మరేదీ దొరకదు. దాన్ని తిన్న వెంటనే ఆ లోకంలో ఉండే కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి పడి పాపి మాంసాన్ని పీక్కుతింటాయట.మరి ఈ లోకంలోనే వీళ్ళు కుక్కమాంసం ఇష్టంగా లాగించేస్తున్నారు కాబట్టి సారమేయాదానం వీళ్ళకు ఇవ్వడేమో యముడు.

    రిప్లయితొలగించండి
  2. కోడి,గొర్రె,బర్రె,పిల్లి,ఆవు,ఎద్దు వీటన్నిటి తోనూ నాకు అనుబందం ఉంది.నా దగ్గరే ఒక బర్రె ,పిల్లి అయితే దిగులు పెట్టుకొని చనిపోయాయి.ఇప్పుడు మొక్కలకు కూడా తనకు పాదు తీసి నీళ్ళు పెట్టి ఎరువువేసి ప్రేమతో పెంచే రైతుతో అనుబందం ఉంటుందేమో అనిపిస్తున్నది.హిందూధర్మంలో కుక్క భైరవస్వామి సంతానం కనుక చంపదగినది కాదు.
    కుక్కల గురించి కొన్ని హదీసులు:
    బొమ్మలు,కుక్కలు ఉన్న గదుల్లోకి ,రతిజరుగుతున్నప్పుడు ఆ గదుల్లోకి దేవదూతలు రారు. (అబు దావూద్ 110)
    మొదట్లో ప్రవక్త కుక్కలను చంపండి అన్నారు.తరువాత నల్ల కుక్కలను మాత్రమే చంపండి అన్నారు. (అబు దావూద్ 1235 )
    అల్లా పేరు ఉచ్చరించి వదిలితే కుక్క కొంత తిని పట్టుకొచ్చిన వేట మాంసాన్నీ మీరు తినొచ్చు. (అబు దావూద్ 1237 )
    జ్యోతిష్యం,కుక్కలవ్యాపారం ,వ్యభిచారం ద్వారా సంపాదన అపవిత్రమైనవి. (అబు దావూద్ 1516 )
    కుక్క కు ,పిల్లికీ ధర అడిగే వాడి చేతిలో మట్టి పోయ్యండి. (అబు దావూద్ 1541 ,1542 )
    దానమిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకునేవాడు తన వాంతినే మళ్ళీ తినే కుక్కతో సమానం (అబు దావూద్1571)
    హసన్,హుసేన్ ఇళ్ళలో ఉన్న కుక్కను ప్రవక్త వెళ్ళగొట్టించారు. (అబు దావూద్ 1930 )
    వ్యబిచారం చేసి పశ్చాత్తాపపడిన ఒక వ్యక్తిని కుక్కను కొట్టినట్లు రాళ్ళతో కొట్టి చంపుతారు.”మీరు అవమానించి చంపిన మీ సోదరుని ఆత్మ పరలోకంలో నదుల దగ్గర విహరిస్తోంది.మీరు చేసిన నేరం చనిపోయిన గాడిద మాంసం పీక్కుతినటం కంటే హీనమైనది” అంటారు ప్రవక్త. (అబు దావూద్2084 )
    బహిస్టైన స్త్రీ,కుక్క ప్రార్ధనను భంగపరుస్తారు . (అబు దావూద్276 )
    హజ్ యాత్రికుడు తేలు,ఎలుక,కరిచే కుక్క ,దాడి చేసే ఏ అడవి జంతువునైనా చంపవచ్చు.కాకిని తోలండి చంపవద్దు. (అబు దావూద్ 742 )

    రిప్లయితొలగించండి
  3. కుక్కల గురించి బైబిల్ లో నుంచి కొన్ని వాక్యాలు :
    ఇదంతా సరదాగా సమాచారంకోసమే.వీలైన చోట లేఖనాలు రిఫరెన్సులతో సహా వాడండి.
    "కుక్క" అనే పదం బైబిలులో 44 సార్లు వచ్చింది.పాత నిబంధన లో 35 సార్లు. క్రొత్త నిబంధన లో 9 సార్లు.
    మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయ వలెను. (నిర్గమ 22:31 )
    పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవు డైన యెహోవాకు హేయములు.(ద్వితీయోపదేశ కాండము 23:18)
    ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలమునుండి నా ప్రాణమును తప్పింపుము. కీర్తన 22:20
    తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.సామెత 26:11
    తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు. సామెత 26:17
    డంబముగా నడుచునవి మూడు కలవు ఠీవితో నడుచునవి నాలుగు కలవు అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము,శోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు (సామెతలు 30:31)
    బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. ( ప్రసంగి 9:4 )
    అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును . (యెషయా 43:20)
    కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు. వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు. (యెషయా 56:11 )
    ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే. గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే. నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే.. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి (యెషయా 66:3)
    యెహోవా వాక్కు ఇదే-చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.(యిర్మియా 15:3)
    అందుకాయన పిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పెను మత్తయి 15:26
    ఆమెనిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. మత్తయి 15:27
    పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును. మత్తయి 7:6
    కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. లూకా 16:21
    కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.పిలిప్పీ 3:2
    కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను .2 పేతురు 2:22
    కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు ప్రకటన 22:15

    రిప్లయితొలగించండి
  4. "భూతదయ", "మాంసాహారము" రెండు కాన్సెప్టులూ అన్నిమతాలలో ,ఇండియన్ నాన్-ఇండియన్ లలో కూడా ఏకకాలంలో కొనసాగుతూ వచ్చాయి.యజ్నయాగాలలోనైతేనేమి,బలులపేరుతోనైతేనేమి,ఆహారంకోసమైతేనేమి అన్ని మతాలలో(బౌద్ధ జైన మతాలు మినహా ) మాంసాహారం యదేచ్చగా కొనసాగింది.ఏ మాంసం తినొచ్చో ఏ మాసం తినకూడదో జాబితాలే ఉన్నాయి.యజ్నపశువుల్నీ,బలుల్నీ,మాంసాహారాన్నీ అనుమతించే మతాలలో కూడా పశువుల్ని దయతో ప్రేమగా చూసుకోవాలని,భూతదయ కలిగిఉండాలనీ లేఖనాలు ఉన్నాయి.

    రిప్లయితొలగించండి