దేవుడమ్మ దేవుడు
గీటురాయి 27-10-1989
దేవుడమ్మ దేవుడు
మాయదారి దేవుడు
ఊరెల్ల ఇళ్ళు జేసె
నోరెల్ల పళ్లు జేసె
మంచమెల్ల కళ్ళు జేసె
కంచెల్లా ముళ్ళు జేసె || దేవుడమ్మ ||
అంటూ ప్రతి విషయానికి, దేవుడిని ఆడిపోసుకునే జనం ఈ మధ్య ఎక్కువయ్యారు. దేవుడిస్తాడుగానీ, వండివార్చి వాతకొడతాడా ?
అని వీళ్ళకు సమాధానం చెప్పటం
కష్టమౌతున్నది. ఈ జనానికి అన్నీ ప్రసాదిస్తూ
కూడా దేవుడు చాటునే కూర్చోటంవల్ల జనం అనుమానాల్లో కూరుకుపోయారు. దేవుని తేరు ఈడ్వలేక ధర్మకర్త “నంబినాయాలు బరువైనాడు గాని దేవుడే అయితే నా వెంట్రుకకు
కట్టిలాగనా ?” అని సవాలు
విసరటం మనకు తెలుసు. దేవుడంటే ఎంత తేలిక భావం మనలో పెరిగిందో తెలుస్తుందికదా?
ఓ ముసలమ్మ
విపరీతంగా చింతిస్తూ దేవుడిని తిట్టిపోస్తూ ఉంది. “ఈ ముసలితనం, రోగాలు, చావు, నరకం ఎందుకు పెట్టావు దేవా ? మేము సుఖంగా
బ్రతకటం నీకు ఇష్టం లేదా ? నన్ను ఆరోగ్యవంతురాలైన యువతిగా జేసి లేడిపిల్లలా గంతులేయించరాదా?” అని తరచుగా ప్రార్ధన చేసేది. మనుషుల ముందు చెప్పుకోలేని అనేక
రహస్య విషయాలు ఆ దేవుని ముందు బయట పెడతాము.
ఎందుకంటే ఎంత తిట్టినా, ఏది మొరపెట్టినా
ఆయన చాటుగా వింటాడేగాని ఎదుటికొచ్చి వరాలివ్వడు లేక దండించడు అనే
ధీమా మనకుంది. “జగమేమాయ – బ్రతుకే మాయ” అని పాట అందుకున్న దేవదాసు నయం. అతను దేవుణ్ణి తిట్టలేదు. “
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్”
అన్నాడు.
ఎవడబ్బ
సొమ్మని కులుకుతు తిరిగేవు, నీ యబ్బ చేయించాడా ? అని
ముఖాన పట్టుకొని ఒక భక్తుడు తిట్టి కూడా అబ్బ, తిట్టానని ఆయాసపడమాకు, కష్టమొచ్చి తిట్టానులే ఏమీ అనుకోమాకు అని దేవుణ్ణి సవరదీసి లొంగదీసుకుంటాడు. దేవుడు కోపించటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మహాభక్తవరదుడు, అతిగా ప్రేమించేవాడని ముందుగానే ఆయన
మెడకు బిరుదులు తగిలించాము కదా? ముందు తిట్టి తరువాత సారీ
అని చెప్తే చాలు
ఆయనలో కలిగిన రోషపు పొంగు అమాంతం
తగ్గిపోతుంది. ఎందుకంటే ఆయన
‘అతిగా క్షమించేవాడు’
అనిపించుకోవాలి
గదా మరి !
“తక్
దీర్ – నసీబ్”(తలరాత,విధివ్రాత,ఖర్మ)అనే
పదాలు అడ్డంపెట్టుకొని
మనుషులు బాధ్యత నుండి తప్పించుకోజూస్తున్నారు. ఫలానా
ఎల్లయ్య
ఖర్మ ఇలా దేవుని చేత ముందుగానే అతని నొసటి మీద
వ్రాయబడింది.
దానికి విరుద్ధంగా అతని విధివ్రాతను మించి అతనెలా బ్రతుకగలడు ?
ఫలానా మనిషి సారాయి షాపో, వ్యభిచారగృహమో
నడుపుతాడని దేవుడు
అతనికి “తఖ్
ధీర్” విధిస్తే అతను మరో మార్గంలోకి ఎలా రాగలడు ? ఒకడికి
కలిమి, మరొకడికి లేమి, ఇంకొకడికి రోగం, మరొకడికి భక్తివైరాగ్యం అన్నీ ఆ
పైవాడి నిర్ణయాలే. పైవాడి రాత ప్రకారం మనం నడుస్తాము.
“లేనిపోని
భ్రమలెన్నో కలిగిస్తావు
మమ్ముతోలు బొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా
చేసేస్తావు”
అని
సుబ్బరంగా తప్పుకు తిరిగే జనం అడిగే ప్రశ్నలకు నేను తల్లక్రిందులవుతున్నాను. ఈ విషయమై తలపండిన పండితులెవరైనా ఉంటే తమ తలలోని తలపులను మా ముందు ఉంచగలరని
మనవి.
http://nrahamthulla-rahamthulla.blogspot.in/2012/08/blog-post_4083.html
http://nrahamthulla-rahamthulla.blogspot.in/2012/08/blog-post_4083.html
https://www.facebook.com/photo.php?fbid=738211632877496&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater¬if_t=like
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి