అడ్డగోలు నియమాలొద్దు
అసలు రంగు చూపండి
గీటురాయి 31-3-1989
“క్షుద్రగుణునకు సజ్జన గోష్టి యేల?
మోటు కొయ్యకు మృదువైన మాటలేల?”
అంటూ
తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అతి నీచ కృత్యాలకు పాల్పడ్డారు. కరుణానిధి కళ్ల జోడు పగలగొట్టడం, జయలలిత చీర లాగటం వంటి కొత్త రికార్డులు స్థాపించారు. అసలు
వాస్తవానికి రౌడీలే ఎక్కువ మంది రాజకీయ నాయకులు అవుతూ ఉంటారని నేను ఎప్పుడో చెప్పాను కానీ ఎవరూ వినలేదు. సారాయి పోయించో, డబ్బులిచ్చో, తన్నో ఓట్లు వేయించుకొంటున్న నాయకుల్ని ఒక్కసారి
గుర్తు చేసుకుంటే చాలు మనకు ఈ
ఎమ్మెల్యేలలో యమభటులు దర్శనమిస్తారు. కాకపోతే చెంబు అమ్మి తప్పేలా, తప్పేల అమ్మి చెంబుకొనుక్కున్నట్లుగా ఓటర్లు అప్పుడప్పుడూ నాయకుల్ని
మారుస్తుంటారు. మొత్తం మీద ఎన్నికయిన రాజకీయ మూక మాత్రం
రాక్షస వంశానికే చెంది ఉంటుంది. వీళ్ళు చీకట్లో చేసే పనులు మనకు ఎటూ కానరావు. కనీసం పార్లమెంటు అసెంబ్లీ
మొదలైన మహాసభల్లో పాల్గొన్నప్పుడైనా
వీళ్ళ చేష్టలను చూచే భాగ్యం జానానికి కలిగించమని కోరుతుంటే ప్రభుత్వం సమ్మతించటం
లేదు. చట్ట సభలన్నీ పేడలో పొదిగిన ఉల్లిగడ్డల్లాగా
ఉండాలని కేంద్రం కోరుతున్నది.
పరువుకు
రోకలి మింగితే పన్నొచ్చి ఎక్కడ ఇరుక్కుంటుందోనని
కేంద్రం భయపడుతున్నది. ఎందుకంటే ప్రతి పక్షాల వాళ్ళతో పాటు తమ వాళ్ళ ఆగడాలు కూడా జనం చూస్తారని, ఓట్ల కోసం పోతే మొహం మీద ఊస్తారని అది అనుమానిస్తున్నది.
ప్రతిపక్షాల్లోని రాక్షసులు కూడా దీనికి వంత
పాడుతున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలను రేడియో, టీవీలలో
ప్రత్యక్షప్రసారం చేయాలనే కోర్కెను రాజకీయ నాయకులంతా
ముక్తకంఠంతో
వ్యతిరేకించటం విశేషమేమీ కాదు. అది తమ బండారం
బయట పెట్టుకోవటం. తమ నిజ స్వరూపాన్ని
వెల్లడించుకోవటం అవుతుందని వాళ్ళ అభిప్రాయం.
క్రికెట్, గుర్రపు పందాలు,బాక్సింగ్, కుస్తీ పోటీలు, పరుగు పందాలు మొదలైనవి జరుగుతుంటే ఆయా పందాలు తిలకించే అభిమానులు, ప్రేక్షకులు
హర్షద్వానాలు, హాహాకారాలు చేస్తూ ఉండటం
మనకు తెలుసు. అలానే ఈ చట్ట సభలలో జరిగే విషయాలను ఆకాశవాణి, దూరదర్శన్ ల ద్వారా
ప్రత్యక్ష ప్రసారం చేస్తే వాళ్ళకు ఒట్లేసిన జనం తమ
ప్రతినిధులు ఎంత ప్రతిభావంతంగా పని
చేస్తున్నది, ముష్టి యుద్ధాలలో ఎంత బాగా రాణిస్తున్నదీ ప్రత్యక్షంగా చూచి తరిస్తారు.
పండ్ల చెట్టు క్రింద ముళ్ళ కంప ఉన్నట్లుగా
కేంద్రం అడ్డగోలు నియమాలు పెట్టి జనం కళ్ళకు గంతలు కడుతున్నది. పంది పైన ఎక్కి దేనికో రోసినట్లుగా బిడియ పడుతున్నది తప్ప
జరుగుతున్న యదార్ధ సంఘటనలను పంచరంగుల సినిమా తీసి ప్రజలకు చూపలేక పోతున్నది. ప్రజా ప్రతినిధుల పనితనం కూడా ప్రజలు చూడలేక పోతున్నారు. ఇంకా ఇది అతి పెద్ద
ప్రజాస్వామ్య దేశమనే అంటున్నారు.
కారణం ఏమిటా అని విచారిస్తే,
తన్నుకోవటానికీ మందబలం గల
వారే గెలవటానికీ మన సభల్లో ఎంత
స్వాతంత్ర్యముందో చూడండి అని మన నోళ్ళు
మూయిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి