లేచింది మహిళా
లోకం
గీటురాయి 1-12-1989
కులుకు మిటారి, పూ విలుతు చేతికటారి, బంగరు బొమ్మ, కప్రంపుదిమ్మ, అన్నులమిన్న, చిన్న సంపెంగగున్న, వన్నెల దొంతి, మువ్వల బంతి, రతనాల తేట, వరాల మూట, పండు వెన్నెల సౌరు, బలు మాణిక్యపు తీరు, వలపుల మొక్క, మేలు తలపుల చుక్క అనటానికి అన్ని విధాలా తగినటువంటి చెలితో కాపురం చేసే పురుషుడిది ఎంత అదృష్టమో గదా ! అది దేవుని అనుగ్రహం తప్ప మరేమీకాదు అని ఓ భక్త రసికుడు ప్రసంగించాడు.
ఈ ప్రసంగం
విన్న ఓ గృహస్థునికి చాలా కోపం వచ్చింది. “ఓ రసికశేఖరా
ఇలాంటి శారీరక లక్షణాలతో అలరారే పెండ్లాము నాకు కూడా ఉంది. కానీ ఆమె మానసిక లక్షణాలు చెబుతాను ఓపికతో విను”
అని చెప్పటం మొదలేశాడు : -
గయ్యాళి, మూలుగుబోతు, మాయలాడి, పిసినిగొట్టు, పిశాళి, పెంకె, బొంకుల పుట్ట, చెడుగు, నిక్కులయిక్కు, చెనటిమంకు, పలుగు, టక్కులాడి, కల్లరి, టాటోటు, మోట, బందెల పుట్టిల్లు, రంకులరాట్నం, రవ్వలమారి, తంటాకోరు, రంతులరావు, ముచ్చు, ఇలాంటి బేరజపు పెళ్ళాని ఏలేవాడి దౌర్భాగ్య
స్థితిని వివరించటం ఏ నరుడికీ వశం కాదు. అందగత్తె అవ్వగానే
సరిపోదు ఆమె గుణగణాలు కూడా అందగా ఉండాలి. అప్పుడే మొగుడికి సౌఖ్యం అని ఎదురు ప్రసంగం చేశాడు.
ఇందమ్మా
తియ్యకూర అంటే ఇందమ్మా పుల్లకూర అని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న ప్రసంగాలు రెండూ విన్నాను. మా ఊళ్ళో ఆరవ పెరుమాళ్ళు పాడే పద్యాలు గుర్తుకొచ్చాయి :
“మనైమాట్చి ఇల్లాళ్ కణ్ ఇల్లాయిన్ వాళక్కై
ఎనై మాట్చిత్తాయినుం ఇల్
ఇల్లదెన్
ఇల్లవళ్ మాణ్చానాల్ ఉళ్ళదెన్
ఇల్లవళ్ మాణాక్కడై”
అంటే
ఇల్లాలి గుణాలు లేని భార్యలో ఇతర గొప్పదనాలు ఉండి మాత్రం లాభమేమిటి ? భార్య సుగుణవతి అయితే భర్తకు అన్నీ ఉన్నట్లే. ఆమె శీలవతి కాకపోతే అతనికి ఉన్నదేమిటి ? అని దాని అర్ధమట.
అందమూ, చందమూ అన్నారు పెద్దలు. అందం బాగా ఉండి
చందం బాగా లేకపోతే పెద్ద దెబ్బేనని మీకు
అర్ధమయ్యే ఉండాలి. ఇరిగిపోయిన చెంపలకు
ఇప్పనూనె పెడితే సానిదాని ముఖం కూడా
నవనవలాడుతుంది, అందానిదేముందోయ్
అంతా మేకప్ మహత్యం అంటుండే వాడు సుబ్బారావు.
కానీ ఇగురం తప్పిన దాని ఇంటి వెనక చూడు ఓగెం తప్పిన దాని వంట ఇల్లు చూడు అన్నారు. ఇగురం అంటే పొదుపు ఓగెం అంటే నేర్పు
అన్నమాట. ఈ రెండూ కొరవడిన ఇల్లాలి పనితనం ఇక చెప్పనలవి గాకుండా ఉంటుంది.
గుండమ్మకధలోఘంటసాలపాడిన పింగళి గారి పాట ఇప్పటికీ మగాళ్ళగుండెల్లో మారుమోగిపోతోందిః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి