రిజర్వేషన్ల
పరుగులో 'వెనుకబడిన' కులాలు
ఈ
మధ్య వివిధ పత్రికలలో షెడ్యూల్డ్ కులాల, తెగల అభ్యర్ధుల కోసం
ప్రత్యేక ఉద్యోగ ప్రకటనలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఆయా కులాలలోని విద్యావంతులు దరఖాస్తులు పెట్టుకోలేక
ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆనందాతిరేకంతో హర్షం వెలిబుచ్చుతున్నారు. ఇంతకాలం పాటు
భర్తీ చేయకుండా మొండిగా వ్యవహరించిన అధికార యంత్రాంగాన్ని
శ్రీ రాజీవ్ గాంధీ అదిలించి కదిలించగలిగారని వారు కృతజ్ఞులై ఉన్నారు. ఈ
స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంతో పాటు, రిజర్వేషన్లు మరో
పది కాలాల పాటు కొనసాగుతాయనే హామీ
కూడా ఎన్నికల సంవత్సరంలో కాంగ్రెస్ కు వోట్లు రాబట్టే సాధనంగా పరిణమించింది. ఇష్టం ఉన్నా
లేకపోయినా దేశంలోని అన్నీ పార్టీలు రిజర్వేషన్లను సమర్ధించి తీరుతున్నాయి. 42 ఏళ్ళు గడిచినా రిజర్వేషన్ల
అవసరం తీరలేదు. ఇంకా ఎంత కాలం అవసరమో చెప్పలేము.
ఇన్ని ఏళ్ల కాలంలో కనీసం ఫలానా కులాలను
పైకి తీసుకురాగలిగాము అని చెప్పుకోటానికి
తగిన గణాంక సేకరణ ప్రభుత్వం చేయటం
లేదు. ఏదైనా ఒక కులం జనాభాలో 45 శాతం కుటుంబాలు తగిన ఉద్యోగాలు సాధించి,
ఆర్ధికంగా బలపడితే ఆ కులాన్ని రిజర్వేషన్ల
పరిధి నుండి తప్పించాలని గతంలో కొందరు మేధావులు కోరారు. ఆ ప్రకారంగా రిజర్వేషన్లు పొందే కులాల జాబితా క్రమేణా తగ్గిపోయి,
కొంత కాలానికి రిజర్వేషన్లే ఉండవని వారి వాదం. అయితే
ఆయా కులాల జనాభా మీద ప్రభుత్వం సమగ్రమైన సర్వేలు జరుపుతూ
ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
రిజర్వేషన్ల
వల్ల అగ్ర
కులాల వారిలో అసంతృప్తి, నిరాశ హెచ్చుతున్నది. క్రమేణా వారు తమ దుస్థితికి,
ఉద్యోగాలు రాబట్టలేని తనానికి ఈ వెనుక
బడిన కులాల వారే కారణమని వారి మీద కోపాన్ని పెంచుకుంటున్నారు.
ఈ పరిస్థితిని గురించి కొందరు దళిత నాయకులను ప్రశ్నిస్తే
కొన్ని శతాబ్దాల పాటు మమ్మల్ని పీడించినందుకు గాను ఇది ఈనాడు వారు అనుభవించాల్సిందేనని సమాధానమిచ్చారు. ఇంకా కొందరైతే అగ్ర కులాల వారికి కూడా రిజర్వేషన్
ఇచ్చుకోమనండి అన్నారు. అంటే
దేశంలోని అన్ని కులాల వారికి వారి వారి జనాభాను
బట్టి నూరు శాతం రిజర్వేషన్ ఉండాలనేది
వీరి వాదం. మరికొందరు 50 శాతం రిజర్వేషను
ఇచ్చి మిగతా 50 శాతం అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు.
ఏది ఏమైనా ఈ రిజర్వేషన్ పెద్ద ప్రజా సమస్యగా పరిణమించింది.
వర్గం
|
మొత్తం కులాల సంఖ్య
|
పునర్వర్గీకరించదగిన శక్తిమంతమైన కులాలు
|
ఇదే వర్గంలో ఉంచి కాపాడవలసిన
శక్తిహీన కులాలు
|
|
1
|
షెడ్యూల్డ్ కులాలు
|
59
|
ఆది ఆంధ్ర, అరుంధతీయ, మాల, మాదిగ
|
అనాముక, ఆది ద్రావిడ, బారికి, బుడగ జంగాలు, దొంబర, గోసంగి, కొలుపులవాళ్లు, మాల దాసరి, మాల జంగం, మాల సన్యాసి, మాతంగి, మెహతార్, ముండల, పాకి, పంచమ, చిందోళ్ళు మొదలైన 55 కులాలు
|
2
|
షెడ్యూల్డ్
తెగలు
|
33
|
గౌడు, కొండ రెడ్లు, కమ్మర, నాయకులు, లంబాడీలు, యానాది, ఎరుకల , వాల్మీకులు
|
బగట, భిల్లులు, చెంచులు, గడబలు, మన్నేరు వాళ్ళు, గోండులు, కోయలు, సవరలు, మొదలైన 25 కులాలు
|
3
|
వెనుకబడిన
తరగతులు
'ఎ' గ్రూపు [అడవి జాతులు, సంచార జాతులు]
|
38
|
అగ్ని కుల క్షత్రియ [బెస్త], మేదరి, నాయీ బ్రాహ్మణ [మంగలి], వడ్డెర, రజక [చాకలి],
|
బాలసంతు, బుడబుక్కల, దాసరి, దొమ్మరి, గంగిరెద్దుల, జోగి, జంగం, కాటిపాపల, మందుల, మొండిబండ, పంబల, పాముల, పెరికి ముగ్గుల, పిచ్చిగుంట్ల, వీరముష్టి మొదలైన 33 కులాలు
|
4
|
వెనుకబడిన తరగతులు 'బి' గ్రూపు వృత్తిపరమయిన
|
21
|
ఆర్య క్షత్రియ, గౌడ, కుమ్మర, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ [కంసాలి], కురుమ
|
అచ్చుకట్ల వాళ్ళు, దేవాంగులు, దూదేకుల,జాండ్ర, కరికాల భక్తులు, పెరికబలిజ, సెగిడి, తొగట, మొదలైన 15 కులాలు
|
5
|
వెనుకబడిన తరగతులు 'సి' గ్రూపు
|
క్రైస్తవులుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారు
| ||
6
|
వెనుకబడిన తరగతులు 'డి' గ్రూపు [ఇతరులు]
|
33
|
భట్రాజులు,కళావంతులు, కొప్పుల వెలమ, కృష్ణబలిజ, మున్నూరు కాపులు, ఉప్పర, యాదవ
|
అగరు, అరెకటిక, చిప్పోళ్లు, గవర, గొడమి, జక్కల, జిమ్గారు, కచ్చి, కండ్ర, కొష్టి, మాలి, నెల్లి, పస్సి, పూసల, సాతాని, ముదిరాజులు,మొదలైన 26 కులాలు
|
కేంద్ర
ప్రభుత్వ,
ఉద్యోగాలలో వెనుకబడిన తరగతుల వారికి కూడా రిజర్వేషన్
కల్పిస్తామని, స్త్రీలకు 30 శాతం రిజర్వేషన్ ఇస్తామని రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తున్నారు. వెనుకబడిన
తరగతుల ఉద్ధరణ కోసం ఈ రిజర్వేషన్లు
అవసరమే గాని కొంతకాలం తరువాత అలాంటి ఉద్ధరణ జరిగిందా
లేదా,
ఏవైనా కులాలు సాంఘికంగా అభ్యున్నతి సాధించాయా లేదా,
ఆ కులాలను రిజర్వేషన్ల పట్టికలో ఇంకా కొనసాగించాలా లేదా అనే పరిశీలనలు ప్రభుత్వం చేయడం లేదు. ఉదాహరణకు
షెడ్యూల్డ్ కులాలలో మొత్తం 59
కులాలున్నాయి. ఇన్ని ఏళ్ల పాలనలో కనీసం ఒకటి రెండు కులాలైనా ఆర్ధికంగా పైకి వచ్చి ఉండవా ?
ఆచరణలో జరుగుతున్నదేమిటంటే,జనాభా
ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే
కులాలు ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా,
జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి. అందువలన శక్తిమంతమైన కులాలను,
శక్తి హీనమైన కులాల సరసన ఉండకుండా
వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు,
శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి. శక్తిమంతమైన రాజకీయ
పలుకుబడి గల కులాలను ఆ క్రింది వర్గంలోకి చేర్చాలి. అలాంటి నిరంతర పునర్వర్గీకరణ పద్ధతి ద్వారా కొంత
కాలానికి రిజర్వేషన్లు ఎత్తివేయాలి.
షెడ్యూల్డ్
కులాలు తెగలలోని శక్తిమంతమైన కులాలను వెనుకబడిన తరగతులు
'ఎ' గ్రూపులోను, వెనుకబడిన
తరగతులలోని శక్తిమంతమైన కులాలను దాని
క్రింది గ్రూపులోను చేర్చాలి. ఆ విధంగా ప్రతి అయిదేళ్ల కొకసారి
మార్పు తలపెట్టాలి. ప్రతి పంచవర్ష ప్రణాళికలోను ఆయా హీన కులాల అభివృద్ధి కోసం పేరు పేరు వరుసన నిధులు కేటాయించి అవి వారికే అందేలా
చూడాలి. అయిదేళ్లు తిరిగి వచ్చేటప్పటికి ఆ కులం స్థాయి సాంఘికంగాను, ఆర్ధికంగాను బాగుపడాలి. ఆ విధంగా కాలక్రమేణా రిజర్వేషన్ల చట్రంలో నుండి అన్ని కులాలు
తొలగిపోవాలి. కులం పేరు మీద ఇక ఎవ్వరూ
రిజర్వేషన్ కోరలేని పరిస్థితి రావాలి. అన్ని కులాలలోని పేదలకు
మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే రోజు అప్పుడే వస్తుంది. ఒక శాస్త్రీయ దృక్పథం గాని, సమస్యను పూర్తిగా తుడిచిపెట్టే మనసు గాని లేని ప్రభుత్వం కుల సమస్యను ప్రస్తుత పరిస్థితిలో
శాశ్వతం చేస్తున్నది. దేశంలోని మేధావులు, కుల వ్యతిరేకులు ఈ పద్ధతిని మార్చేలా ప్రభుత్వం పై వత్తిడి తేవాలి. కులం ప్రాతిపదికగా ఉండటం పోయి, ఆర్ధిక
ప్రాతిపదిక మీద జన విశ్లేషణ జరగాలంటే ముందు కులాలు అభివృద్ధి చెందాలి.
అన్ని కులాలు అభివృద్ధి చెందినవే అయితే
రిజర్వేషన్ అవసరమే ఉండదు. ప్రభుత్వం ఇక
మీదట రూపొందించే పథకాలు ఆయా కులాలలోని ధనవంతులను
తప్పించి, నిరుపేదలను ఉద్ధరించేలా ఉండాలి. కులానికి పేదలైన వారిలోనే కూటికి పేదలైన వారికి నిధులు
చేరాలి. కేంద్రమూ, రాష్ట్రాలు సమన్వయంతో ఈ పనిని సాధించాలి.
--నూర్
బాషా రహంతుల్లా
(ఆంధ్ర ప్రభ 8.8.1989)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి