ఆధ్యాత్మిక
సమయం ఆసన్నమయ్యింది
గీటురాయి 15-1-1993
“ఓ ప్రజలారా, మీరు మీ స్థానంలో
పనిచేస్తూ ఉండండి. నేను కూడా నా స్థానంలో పనిచేస్తూ ఉన్నాను. ఫలితం ఎవరి విషయంలో
సంతృప్తికరంగా ఉంటుందో త్వరలో మీకు తెలిసిపోతుంది. ఏమైనా వాస్తవానికి దుర్మార్గులు
సాఫల్యం పొందలేరు.” (అల్అన్అమ్ : 135)
ఇదీ దైవం
విశ్వాసులకిచ్చివ భరోసా, ఈ ప్రపంచమంతా ఆయన సృష్టించిన సంపద. దానిపై హక్కుల కోసం
జనం జాతులుగా మతాలుగా విడిపోయి తన్నుకు చస్తున్నారు. స్వార్ధం మనిషిని
గుడ్డివాడిగా చేసింది. దురాక్రమణకు దౌర్జన్యానికి పాల్పడిన దుర్మార్గులందరినీ
విశ్వాసులు ఈనాడు ఎదుర్కోలేక పోతున్నారు. అయితే న్యాయాన్ని ప్రసాదించే
కార్యభారాన్ని అల్లాహ్ తన భుజస్కందాలపై వేసుకుని న్యాయవర్తనులకు ఊరట కలిగించాడు.
తన తప్పు తప్పు కాదు, తన బిడ్డ దుడుకు కాదు అన్నట్లు ఈ ప్రభుత్వం, మెజారిటీ
మతస్థులు వ్యవహరిస్తుంటే, మైనారిటీలు ఏం చెయ్యాలి ? తన్ని తల్లే
గుంజుకుపోతే, చెప్పున కొట్టి చిప్ప తెచ్చుకోవాలి అన్నారు. చెప్పున కొట్టే దమ్ము ఈ
దేశంలోని ముస్లింలకు లేదు. చిప్ప మాత్రం సహజంగానే చేతికొచ్చింది. ఎందుకంటే
ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానం, అన్నీ ముస్లిముల ధన, మాన, ప్రాణాలకు రక్షణ
కల్పించటంలో విఫలం అయ్యాయి. మస్జిద్ కూలింది, విగ్పహాలు వెలిశాయి. రామభక్తుల
దర్శనానికి త్రోవ తెరచుకుంది, విగ్రహాల మీద మంటపం నిర్మితమౌతున్నది, అయితే నమాజు
చేయటానికి మాత్రం వీల్లేదని కట్టడి చేశారు. మసీదు కూలిన చోటనే తిరిగి
నిర్మించటానికి వీలు లేదనీ ఒకప్పుడు
అక్కడ మందిరం ఉండేదా
అనే విషయం సుప్రీం కోర్టు చెప్పాలనీ అంటున్నారు. ఓ ఆవు అయినా తన దూడ పొదుగు కుమ్మి
పాలు తాగితే ఊరుకుంటుంది గాని, పరాయి దూడ పాలు తాగితే ఊరుకుంటుందా? వాస్తవానికి దేశంలోని సమస్త యంత్రాంగం
ముస్లిముల్ని నానారకాల నామర్దాలకు గురి చేస్తోంది. తన సొమ్ము తను తిని, తన బట్ట
తను కట్టి, చావట్లో వాడిచేత చావు దెబ్బలు తిందట. భారతీయ ముస్లిముల జీవన స్థితి
ఇలాగే ఉంది.
శాంతి అని అర్ధాన్నిచ్చే ' ఇస్లామ్ ' ను అనుసరించే ముస్లింలు కలహ ప్రియులని
వాడుక పుట్టింది. పరాయి దేశస్తులని ఈసడింపు మొదలయ్యింది. ఇస్లామిక్ సంప్రదాయం
రాజ్యమేలుతున్నది. ఇక వాళ్ళ ఆచార వ్యవహారాలను గేలి చేస్తూ, అసహ్యించుకుంచూ, వారిని
అడుగడుగునా నిరాశా నిస్పృహలకు గురిచేస్తున్న సంఘటనలు అన్నీ ఇన్నీ కావు. త్రిశూలాలు
ధరించిన మందబలం వీరంగం వేస్తుంటే, తీతువు పిట్టల రాయభారం ఫలిస్తుందా ? తీరు తీరు గుడ్డలు
కట్టుకొని తిరనాళ్ళకు పోతే ఊరికొకగుడ్డ ఊసిపోయిందట. ఈ ప్రభుత్వం, పార్టీలు,
పోలీసులు మెజారిటీ మత చాందసులకు దాసోహం అనక తప్పదు. దాసోహం అనకపోతే అనేలా
చేస్తారు. అందువలన కూలిపోయిన, కూలిపోతున్న మసీదుల్ని పరిరక్షిద్దామనే భౌతిక
ప్రయత్నం ముస్లింలకు ప్రమాదకరం. దైవం యొక్క శక్తిని మనఃపూర్తిగా గుర్తించి
న్యాయంకోసం ఆయనపై ఆధారపడవలసిన ఆధ్యాత్మిక సమయం ఆసన్నమయ్యింది. అల్ ఆరాఫ్ సూరా
చదవండి. దైవం న్యాయం చేసే వరకు ఆ సూరానే చదువూతూ ప్రార్ధిస్తూనే ఉండండి.
“ఆయన సజ్జనులకు మద్దతు ఇస్తాడు. మీరు మాత్రం మృదుత్వం,
మన్నింపుల వైఖరిని అవలంబించండి. మంచిని ప్రబోధించండి. మూర్ఖులను పట్టించుకోకండి.
షైతాన్ ప్రేరేపిస్తే అల్లాహ్ శరణు కోరండి. ”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి