2, జనవరి 2013, బుధవారం

నిరుద్యోగ సైన్యాన్ని నివారించటం ఎలా



నిరుద్యోగ సైన్యాన్ని నివారించటం ఎలా
గీటురాయి 28-12-1990
                 రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల రిటైర్ మెంట్ వయస్సు 58 నుండి 55    సంవత్సరాలకు తగ్గించాలని నాగాలాండ్ విద్యార్ధులు ఆమరణ      నిరాహారదీక్షలు, ఆందోళనలు చేసి ముఖ్యమంత్రి శ్రీ ముజో దిగివచ్చేలా       చేశారు. 36 లక్షల నిరుద్యోగులతో నిండి వున్న ఆంధ్ర ప్రదేశ్ లో కూడా   అలాంటి ఆందోళన జరిగితే ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో 40 ఎంప్లాయ్ మెంట్        ఎక్చేంజీలు కలిసి ఏడాదికి ముప్పై వేలకు మించి ఉద్యోగాలు కల్పించలేక    పోతున్నాయి. ప్రతి యేటా సగటున 3 లక్షలకు పైగా కొత్త నిరుద్యోగులు       నమోదు అవుతున్నారు. 40 శాతం పైగా కాల్ లెటర్స్ రాక ఆటో మాటిక్       లాప్స్ అవుతున్నారు. అందువలన వయస్సు దాటి అర్హతను కోల్పోయి       నిర్బంధ నిరుద్యోగాన్ని అనుభవిస్తున్న జనం సంఖ్య కోటికి పైనే        ఉండవచ్చు. 500 కళాశాలల నుండి ప్రతి ఏటా 40 లక్షల పట్టభద్రులు       విడుదల అవుతున్నారు.

                    




      
1989 ప్రారంభంలో మన రాష్ట్ర నిరుద్యోగ జనాభా

ఉపాధి కల్పనా కేంద్రం
నమోదితుల సంఖ్య (వేలల్లో)
1
నిజామాబాద్ 
63
2
విజయనగరం
73
3
శ్రీ కాకుళం
75
4
నెల్లూరు
75
5
మహబూబ్ నగర్
83
6
ఒంగోలు
90
7
నల్గొండ
94
8
సంగారెడ్డి
100
9
కడప
100
10
ఏలూరు
100
11
అదిలాబాద్
120
12
గుంటూరు
120
13
కరీం నగర్
130
14
ఖమ్మం
130
15
కాకినాడ
130
16
అనంతపురం
132
17
విజయవాడ
135
18
కర్నూలు
140
19
వరంగల్
150
20
చిత్తూరు
152
21
రంగారెడ్డి
180
22
విశాఖపట్నం
180
23
హైదరాబాద్
280
ఆంధ్ర ప్రదేశ్ మొత్తం
2832


              ఒక ఖాళీ భర్తీ అయ్యాక అది దశాబ్దాల పాటు మూసుకుపోయి ఉన్నందువల్ల మరో వ్యక్తికి అవకాశం రాదు. ఉద్యోగ వ్యవస్థ ఒక జీవనదిలాగా ప్రవహిస్తూ వుండాలి గాని మురికి గుంట లాగా ఉండకూడదు.     కొత్త నీరు వస్తుండాలి పాత నీరు పోతుండాలి. నీరు నిల్వ ఉంటే        చెడిపోతుందనే సత్యం దేశ ఉద్యోగ వ్యవస్థకు కూడా వర్తిస్తుంది. త్వరగా    ఉద్యోగం త్వరగా రిటైర్ మెంట్ అనే పద్ధతి మనకు స్వాతంత్ర్యం    వచ్చినప్పటి నుండీ అమల్లో ఉన్నట్లయితే నిరుద్యోగుల సంఖ్య ఇం      భయంకరంగా పెరిగేదీ కాదు. దేశం లోపల కోట్లాది నిరుద్యోగులు, దేశం బయట వేలకోట్ల రూపాయల అప్పులు, అనునిత్యం పెరిగిపోతున్న    ద్రవ్యోల్బణం మనకు తీరని శాపమై కూర్చున్నాయి. భూమి, శ్రామికులు,      మూల ధనం అనే మూడు ముఖ్య సంపదలను మన నేతలు సక్రమంగా        వినియోగించడం లేదు. దేశ జనాభాలో 77% ఉన్న గ్రామీణ జనాభా    నిరుద్యోగాన్ని ఒక్క వ్యవసాయంతోనూ వ్యవసాయాధార రిశ్రమల్ని        స్థాపించటం తోను నివారించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రింది కార్యక్రమం     అమలు జరిపి దేశానికి ఆదర్శప్రదేశ్ గా మార్చాలి.

              ప్రభుత్వోద్యోగుల రిటైర్ మెంట్ వయస్సును 55 ఏళ్ళకు, 30 ఏళ్ల       సర్వీసుకు ఏది ముందైతే దానికి తగ్గించాలి.

              అలాగే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయగోరే వారిని 15 ఏళ్ల సర్వీస్        కే రిటైర్ కానివ్వాలి. వారికిచ్చే పెన్షన్ ను 20 % పెంచాలి. అద్దె కొనుగోలు        పద్ధతిపై వాళ్ళు రిటైర్ అయ్యేనాటికి వారికి సగం ధరకు స్వంత ఇల్లు     సమకూర్చాలి.

              జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్చేంజ్ లన్నింటినీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ బ్రాంచీలుగా చెయ్యాలి. జిల్లా స్థాయి సెలక్షన్లన్నీ వాటి ద్వారా   జరపాలి. నిరుద్యోగ భృతి వాటి ద్వారా ఇప్పించాలి. గరిష్ట వయో పరిమితిని 40 ఏళ్ళకు పెంచాలి.

              అనుత్పాదక విద్యలను ఆపి వేసి, వృత్తి విద్యాలయాలను మాత్రమే   స్థాపించాలి. ప్రతి జిల్లా కొక వ్యవసాయ కళాశాల, పంటల పరిశోధన,       పశువుల అభివృద్ధి కేంద్రమూ మంజూరు చెయ్యాలి. వ్యవసాయాధార     పరిశ్రమలను, పాడి - మాంసం  పరిశ్రమలను ప్రోత్సహించాలి.        నిరుద్యోగులకు వాటిలో శిక్షణ ఇచ్చి, పెట్టుబడి అప్పుగా ఇవ్వాలి.

              ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీసి, ప్రజలను నిరాశ్రయుల్ని చేసే భారీ ప్రాజెక్టులకు బదులు చిన్న తరహా, మధ్య తరహా ప్రాజెక్టుల్ని రాష్ట్రంలోని     న్ని ప్రాంతాలలో చేపట్టి స్థానిక నిరుద్యోగుల్నీ వాడుకోవాలి. చిన్న చిన్న    ఆనకట్టలు, రిజర్వాయర్లు, కాల్వల లైనింగ్ పనులు, రోడ్ల నిర్మాణం,     మురుగు కాల్వల త్రవ్వకం ఎక్కడి కక్కడే దొరికే జనంతో చేయించాలి. గృహ        నిర్మాణ కార్యక్రమం భారీ ఎత్తువ చేపడితే నిరుద్యోగులకు పని,        నిరాశ్రయులకు నీడ ఏర్పడతాయి.

              మొక్కల పెంపకం, అమ్మకం లాంటి పనుల్లోకి గ్రామీణ నిరుద్యోగుల్ని        తీసుకుని అటవీ ప్రాంతాల్లో వారికి భూములివ్వాలి. వ్యవసాయ కూలీలకు        భూములిచ్చి ఆవాసం కల్పించాలి. పట్టణాలకు వారు వలస పోకుండా     గ్రామాల్లోనే కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు పెంచాలి.

              పెట్రోలుకు బదులు ఆల్కహాల్,త్నాల్ ల ఉత్పత్తి మీద దృష్టి సారించాలి. చెరకు పంటను ప్రోత్సహించి ఆల్కాహాల్ డిస్టలరీలను పంట     భూములకు దగ్గర్లో స్థాపించి స్థానిక నిరుద్యోగుల్ని వాడుకోవాలి. గాలి      మరలు, సౌర శక్తి, బయోగ్యాసు, లాంటి జనకాలపై పెట్టుబడి పెంచాలి. మినీ     బస్సులు, ట్రాక్టర్లు కొనుగోలుకు నిరుద్యోగులకు అప్పులివ్వాలి.






             
         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి