4, జులై 2012, బుధవారం

ఎద్దేవుడోయటంచు ఎమ్మూలకేగినా ...


   ఎద్దేవుడోటంచు  మ్మూలకేగినా ...
                                                గీటురాయి 4-7-1986
               వే పోదాము గౌరి
                పరమాత్ముని జూడ
                వే పోదాము గౌరి
.
                    అని తెలుగు ప్రజలు ఇక గుడికీ పోనక్కరలేదు. తలుచుకుంటే     చాలు వచ్చి ఒళ్ళోవాలే ప్రత్యక్ష పరమాత్ముడు మన మధ్యలోనే,పైగా తెలుగు దేశంలోనే ఉన్నాడు.

              రాయిని ఆడది చేసిన రాముడా ? గంగను తలపై మోసిన శివుడా ?
       ఎవరాయన ? అని నీవు ఎదురు ప్రశ్న వేయొద్దు. ఆయనలో నీవు అందర్నీ        సందర్శించవచ్చు. చివరికి నిన్న మొన్నటి వివేకానందుల వారినీ,    గాంధీగారిని కూడా !

              అసలు రాళ్ళల్లో దేముడుండాడని మనం భ్రమపడుతుంటాం. కానీ ఈ        నవయుగ పరమాత్ముని ఇదే విషయం అడిగి చూస్తే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడునురా ఒరే ఒరే ! ఒక్కడైనా ఈ       పరమేశ్వరునికి ( అంటే నాకే ) మొక్కి చూడరే అరే అరే ! అన్నారు.

                           వెంకటరెడ్డే కంకికొరికితే, వెంట వచ్చిన వాళ్ళు      ఊరుకుంటారా ?        పొలమంతా తిని పారెయ్యరూ ? మన పసుప్పచ్చ జనం        కొబ్బరి కాయల    బస్తాలతో బయలుదేరింది. మొలపొడుగు దండలు,    మంగళారతులు, రక్తతిలకాలు, సాష్టాంగ ప్రమాణాలు, పాధూళిని       ళ్ళకద్దుకోవటాలు ఈ నవీన   నారాయణునికి నిత్యమూ ఎదురయ్యేవే.

             అందుకే ఈ వంది మాగధ పరివారం ఒక కొత్త పద్ధతిలో ఆయన్ని     పూజించి తరించింది. ఆయనకు 64 ఏళ్లట. అందుకని 64 కొబ్బరి కాయలు     ఆయన పాదాల దగ్గరే పగులగొట్టి ( పాదాల మీద కాదు ) ఆ నీళ్ళతో ఆయన   పాదాలు కడిగారు. ఎందుకంటే ఆయనే వారికి సర్వమ, ఒక చోట    మహాత్మునిగాను, వేరొక చోట యుగపురుషునిగాను  మరో చోట       కవిచక్రవర్తిగాను ఇంకో చోట నిజం నవాబుగాను ఆయన దర్శనమిస్తాడట.

             విభూతి పట్టీలు పెట్టుకొంటే విష్ణుమూర్తివనుకొన్నాను.   ఆంనేయుడిటోయ్, వెంకటేశ్వర్లూ ? అని ఈ అవతారాల మూర్తిని చూసి     సామాన్య జనం కన్ ఫ్యూజ్  అవుతున్నారు.

             విశేషమేమిటంటే ఇంతమంది మైనపు ముక్కుల వాళ్ళు,       వీపుతోముడుగాళ్ళు వ్యక్తి పూజమాటున శక్తిపూజ చేసేవాళ్ళు. 1983 కు      ముందు ఆ స్వామి చుట్టూలేరు. వాళ్ళు కొట్టే ఊదరకు స్వామి వారు    బెలూన్ లా ఉబ్బిపోతున్నారు. ఇంకా ఇంకా ఊదేయ్యమంటున్నారు.        ఊదేకొద్దీ ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నారు. కాలం కలసిరాకపోతే మారేమన్నా      అవుద్ది స్వామీ అని ఎవరన్నా చెప్పినా వినే స్థితిలో లేరు ! ఏం చేస్తాం, తెలుగుదేశం ఖర్మ !




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి