2000
సంవత్సరం నాటికి క్రైస్తవ మతం
గీటురాయి 17-11-1989
(అనువాదం)
క్రీ.శ.
1900 సంవత్సరంలో ప్రపంచ క్రైస్తవ జనాభా 55.8 కోట్లు. ఇందులో 2/3 వ భాగం
ఐరోపా, ఉత్తర అమెరికాలలో ఉండేవారు. 2000 సంవత్సరానికి క్రైస్తవ జనాభా 200 కోట్లు
అవుతుంది. అందులో 2/3 వ
భాగం వర్ధమాన దేశాలలో ఉంటుంది. పశ్చిమ ఐరోపాలో క్రైస్తవ జనాభా ఈ శతాబ్దాంతం వరకు
ఇక ఏమీ పెరుగదు అని ఎకానమిస్ట్ పత్రిక తెలిపింది. ఐరోపా క్రైస్తవుల సంఖ్య 43
కోట్లు. ప్రపంచ క్రైస్తవ జనాభాలో వారిది 22% కంటే తక్కువ. ఆఫ్రికాలో క్రైస్తవుల
సంఖ్య 40 కోట్లు. లాటిన్ అమెరికాలో 57 కోట్లు. దక్షిణ, తూర్పు ఆసియాలో 23 కోట్లు
క్రైస్తవులున్నారు. అంటే క్రైస్తవ జనబలం ఐరోపా బయటే అదికంగా ఉంది. పాశ్చాత్య
దేశాలలోని సంపన్నులు విద్యావంతులు క్రమంగా
క్రైస్తవ్యానికి దూరమౌతున్నారు. క్రైస్తవ సంస్థల్లో నమ్మకం కూడా
సడలిపోతున్నది. వర్థమాన దేశాలలోని ఆర్ధిక, సాంఘీక సమస్యల సాధన కోసం చర్చీలు
పనిచేయాల్సిన అగత్యత ఏర్పడింది. కాని అవి ఆ పని చేయటం లేదు. ఐరోపాలో దీర్ఘకాలం
తిష్టవేసిన క్రైస్తవ శాఖలు, అంతర్గత ఐక్యతను కోల్పోయాయి. కేధలిక్ చర్చి ఎక్కువ
ఆదిపత్యం చెలాయిస్తున్నది. పశ్చిమ ఐరోపా నడిగడ్డ మీద ఒక ఆధ్యాత్మిక ఉజ్జీవం
రావాలని పోప్ జాన్ పాల్ 11 పిలుపు నిచ్చాడు. తూర్పు ఐరోపా కేథలిక్కులను నాస్తిక
బందనాల నుంచి విడిపించాలని పోప్ ఆశిస్తున్నాడు. కాని ఐరోపా క్రైస్తవ సమాజంలోకి
కొత్తగా విశ్వాసులను చేర్చాలంటే తూర్పు యూరప్ లో ఎన్నో రాజకీయ మార్పులు రావాలి. పశ్చిమ
యూరప్ లో సంప్రదాయ క్రైస్తవంలో ప్రజల్ని నిలపటం చాలా కష్టంగా ఉంది
మారుతున్న
క్రైస్తవ బలం
|
క్రీ.శ. 1900
|
క్రీ.శ. 2000
|
ఆసియా
|
4.3%
|
12.4%
|
ఆఫ్రికా
|
1.8%
|
19.5%
|
దక్షిణ అమెరికా
|
11.1%
|
28.3%
|
ఐరోప్
|
49.9%
|
21.4%
|
సోవియట్ యూనియన్
|
18.8%
|
5.8%
|
ఉత్తర అమెరికా
|
14.1%
|
12.6%
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి