ప్రభుత్వ యంత్రాంగం ప్రజాలకు చేరువ కావాలి
గీటురాయి 5-1-1990
అధికార వికేంద్రీకరణ, పరిపాలనా వికేంద్రీకరణ అనేవి అందమైన నినాదాలు. అవి అందరికీ నచ్చుతాయి. కేంద్రీకరణతో విసిగిపోయిన జనం, దూరము భారము
అనుభవించే జనం, ఈ నినాదాలు వినగానే ఏదో పీడ పలచబడిపోతున్నట్లు, మేలు తమకు చేరువవుతున్నట్లు భావిస్తారు. రాజకీయ నాయకులు మాత్రం ఈ నినాదాల పేరుతో
ఏవో సమూల సంస్కరణలు తలపెట్టబోతున్నట్లు
ప్రకటించి ప్రజలను సదా ఆనందింప జేస్తుంటారు.
అప్పుడప్పుడూ ప్రజల ఆగ్రహానికి గురౌతామనే భయంతో కొన్ని పనులు చేస్తుంటారు.
1952 లో పొట్టి శ్రీరాములు గారి
ప్రాణత్యాగంతో చెన్నపట్నంలో తిష్ట వేసిన
అధికారంలో సగం ఆంధ్రప్రదేశ్ కు తరలి వచ్చింది. కర్నూలులో నెలకొల్పిన పీఠం హైదరాబాదుకు గెంతింది. అప్పటి ఆ నగరం జనాభా ఎంత ఉండేదో
కాని రాజధాని కావటం వల్ల ఈనాడు అది 35 లక్షలకు చేరుకున్నది. కేవలం 217 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 35 లక్షల
మంది అంటే కిలోమీటరుకు 16, 219 మంది ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే మీటరుకు పదహారు మంది జనం కిక్కిరిసి
నివసిస్తున్నారు. అంటే నగర జనాభాలో మూడవ వంతు మంది మురికి వాడల్లోనే ఉంటున్నారన్నమాట. 1971 లో కేవలం 18 లక్షల
జనాభాతో ఉన్న హైదరాబాదు 1981 నాటికి 25 లక్షలకు నేటి కి 35 లక్షలకు చేరుకుంది.
1971 నాటికి అయిదు లక్షల జనాభా దాటిన
నగరం ఆంధ్రప్రదేశ్ లో ఇదొక్కటే. 1981 నాటికి
విశాఖపట్టణం, విజయవాడ నగరాలు అయిదు లక్షల జనాభాను దాటాయి.
1991 నాటికి వరంగల్లు, గుంటూరు నగరాలు ఈ పరిమితిని దాటి కార్పొరేషన్లు అవుతాయి.
అలాగే లక్ష జనాభాను దాటిన పట్టణాలు 1971 లో 13 ఉంటే 1981 లో 20 కి పెరిగాయి. 1991 లో ఈ పట్టణాల సంఖ్య 33 కాబోతున్నది. ఇంకా యాభై వేల జనాభా దాటిన పట్టణాలు 1981 లో 50 ఉంటే
ఇప్పుడు వాటి సంఖ్య వంద కావటానికి
చేరువలో ఉంది. అంటే క్రమేణా పట్టణాల సంఖ్య హెచ్చుతోంది.
జనం పెరిగే కొద్దీ
పల్లె పట్టణంగా మారుతుంది. ప్రాథమిక సదుపాయాల
లభ్యతను బట్టి జనం ఆయా ఊళ్లలో గుమిగూడుతుంటారు. తమకు జీవనోపాధి దొరికి, సుఖంగా బ్రతుక గలిగే ఊళ్ళకు జనం వలస పోతుంటారు.
ఉన్న జనానికి తోడు వలస వచ్చిన జనం పోగై
ఊరు సంతలాగా తయారై, పెద్ద పట్టణం లాగా ఉబ్బిపోతుంటుంది. శివారు ప్రాంతాల్లో స్థిరనివాసాలు వెలిసి క్రమేణా పట్టణం
నగరమైపోతుంది. ఆకాశహర్మ్యాలు,
ఒకరి నెత్తిన మరొకరు నివసించటం, కిక్కిరిసిన బస్సులు, మురికి వాడలు, ఫుట్
పాత్ ల మీదనే నిద్రించే వాళ్ళు..... ఇలా ఎన్నెన్నో తంటాలు వచ్చి పడతాయి. ఇదంతా సౌకర్యాల కేంద్రీకరణ ఫలితమే. ఇంకో రకంగా చెప్పాలంటే
ఇదంతా సౌకర్యాలను సరైన సమయంలో అవసరమైన చోట్లకు సమంగా
పంపిణీ చేయకపోవటం వల్లనే జరుగుతోంది. అంటే వికేంద్రీకరణ జరుగకపోవటం అన్నమాట.
మొదట్లో మనకు చాలా పెద్ద పెద్ద తాలూకాలు ఉండేవి. చెన్నారెడ్డి గారి హయాంలో 1980 లో కొత్త తాలూకాల ఏర్పాటు
జరిగింది. అప్పటికి అవి పెద్దగానే
ఉన్నాయి. 1985 లో ఎన్టీ ఆర్ గారి హయాంలో అప్పటికి ఉన్న 305 తాలూకాలను 1104 మండలాలుగా మార్చారు. అడపాదడపా
ప్రజల వత్తిడి మీదట కొత్త మండలాలు
ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మండలాల స్థాపన ద్వారా
తాలూకా స్థాయి అధికార యంత్రాంగం పల్లెటూళ్ళ
చేరువకు పోయినందువల్ల ప్రజలకు ఎన్నో
ఇబ్బందులు తొలిగి పోయాయి. అయితే చాలా
కొత్తమండల కేంద్రాలలో, అధికార యంత్రాంగానికి అవసరమైన కనీస హంగులు సమకూర్చక పోవటం వల్ల , ప్రజలు యాతన పడ్డారు. ప్రస్తుత స్థితిని బట్టి ఈ మండలాల సంఖ్యను 1200 కు
పెంచవలసిన అవసరం ఉంది.
రాయలసీమలో నంద్యాల, గుంతకల్లు, తిరుపతి కేంద్రాలుగా మరో మూడు
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని, సీమాభివృద్ధి కోసం ఒక
బోర్డును
ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతం నాయకులు కొందరు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం పాలనలో కొత్తగా మండలాలైతే
ఏర్పడ్డాయి గాని, కొత్తగా జిల్లాలు ఏవీ
ఏర్పాటుకాలేదు. నంద్యాల, తిరుపతి జిల్లాలు ఏర్పాటు అవుతాయనే ఊహాగానాలు కొనసాగటం తప్ప. రామారావు గారు ఎందువల్లనో
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయలేక పోయారు.
ఉత్తరప్రదేశ్ లో గతంలో 37 జిల్లాలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 57. ఇంకో మూడు జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రాష్ట్రంలోని జిల్లాల సగటు వైశాల్యం 11,959 చ. కి. మీ. ఉంది. గ్రామాలకు జిల్లా కేంద్రాలకు రాకపోకలు ఎంతో భారంగానే
ఉన్నాయి. అందువలన ప్రతి పార్లమెంటు నియోజక
వర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తే 42 జిల్లాలు వస్తాయి. లేదంటే భౌగోళికంగా రాష్ట్రాన్ని 40
సమాన వైశాల్యం గలా జిల్లాలుగా విభజించి, ప్రతి జిల్లాకు 30 మండలాలను కేటాయించాలి.
పట్టణాలు మరింత దుర్భరంగా మారిపోకుండా
ఉండాలంటే వలస నిరోధక చర్యలు చేపట్టాలి.
సౌకర్యాల వికేంద్రేకరణ సమంగా జరగాలి. మండల
కేంద్రాలలో ఉపాధి సౌకర్యాలను పెంచాలి. లక్ష జనాభా దాటిన పట్టణాలలో ఇక కొత్తగా ఎలాంటి పరిశ్రమ
పెట్టనివ్వకూడదు. వాతావరణ కాలుష్యానికి
కారణమయ్యే పరిశ్రమలను మూసి వేయించాలి. పల్లెటూళ్ళకు రోడ్డు, రవాణా సదుపాయాలు విస్తరించాలి. పల్లెలకు చేరువలో పరిశ్రమలు స్థాపించేవారికి రాయితీలు కల్పించాలి.
వ్యవసాయాధార పరిశ్రమలను భారీగా ప్రోత్సహించాలి.
నగరాలలోను, పెద్ద పెద్ద పట్టణాలలోనూ ఉండే డైరీఫారాలను, కోళ్ళఫారాలను వాటి బయటికి తరలించాలి.
రోడ్ల వెడల్పు కార్యక్రమాలు అన్ని
పట్టణాలలోను చేపట్టాలి. మురికి వాడల్లోని జనాన్ని పల్లెటూళ్ళకు తరలించి వారికి తగిన పనిని అక్కడే కల్పించాలి. యాచకుల్నీ, ఫుట్
పాత్ ల మీద నివసించే దిక్కులేని అనాధాలను
పట్టుకొని అనాధాశ్రమాలకు,వృత్తి శిక్షణా కేంద్రాలకూ పంపాలి. రాష్ట్రవ్యాప్తంగా భిక్షుక నివృత్తి చట్టాన్ని కఠినంగా అమలు జరపాలి. అయిదు
లక్షల జనాభా దాటిన పట్టణాలకు చుట్టూ
అయిదు మైళ్ళ పర్యంతం జనావాసాలను నిషేధించి ఆ ప్రాంతంలో
చెట్ల పెంపకం, పండ్ల తోటలు నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల కోసం నగరాలలో స్వంత ఇల్లు కట్టించి
ఇచ్చేకంటే భారీ ఎత్తున ప్రభుత్వ క్వార్టర్ల
నిర్మాణం చేపట్టాలి. రిటైర్ అయిన ఉద్యోగులకు వారి వారి మండల కేంద్రాలలో స్వంత
ఇల్లు ఇచ్చి, వారిని నగరం నుండి పంపివేయాలి. రాష్ట్రానికి రెండవ రాజధానిగా మరో పట్టణాన్ని ఎన్నుకుని అసెంబ్లీ సమావేశాలు ఒక సారి హైదరాబాదులోను మరో
సారి అక్కడా జరుపుతూ ఉండాలి. హైకోర్టు
బెంచీని మరో చోట ఏర్పాటు చెయ్యాలి. రాజధాని నగరంలోని ప్రతి శాఖాధిపతి
కార్యాలయాన్ని విభజించి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలలో నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చెయ్యాలి. పల్లెల్లో పక్కా, ఇళ్ల నిర్మాణం వల్ల ఎంతో మేలు జరిగింది. మండల కేంద్రాలలో గృహనిర్మాణానికి అవసరమైన ఉపకరణాల
తయారీ కేంద్రాలను నెలకొల్పి, పల్లెల్లో శాశ్వతగ్రహాల నిర్మాణం
భారీగా జరపాలి. కొత్తగా పోస్ట్ గ్రాడ్జుయేట్ కాలేజీల స్థాపన ఆపివేసి, ప్రతి మండలం లోనూ వృత్తి విద్యా కేంద్రాలు విధిగా స్థాపించాలి. జిల్లా కొక వ్యవసాయ, వృత్తి విద్యా కళాశాల స్థాపించాలి. వ్యవసాయాధార పరిశ్రమలను
విరివిగా పల్లెల్లో స్థాపించి ఎక్కడివారికక్కడే
ఉపాథి లభించే ఏర్పాట్లు చెయ్యాలి. ఇలాంటి ప్రయోజనకరమైన
పనులు చేపట్టక పోతే, పట్టణాలకు పల్లె ప్రజల వలస అదే
పనిగా కొనసాగుతూ పట్టణ ప్రజల జీవితం దుర్భరంగా మారి పోతుంది. పల్లెటూళ్లలో పేదరికం, నిరక్షరాస్యత తాండవిస్తుంటుంది. కొత్త ప్రభుత్వం ఈ విషయాల మీద దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా
ఉంది.
1991
నాటికి మన రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల పరిస్థితి
ఈ క్రింది విధంగా ఉంటుంది. 1981
నాటికే వీటి జనాభా 50 వేలు దాటింది.
|
|
|
|
|
|
పట్టణం పేరు
|
1981 నాటికి జనాభా ( వేలల్లో)
|
పెరుగుదల రేటు
|
1991 నాటికి జనాభా
( అంచనా వేలల్లో)
|
1
|
హైదరాబాదు
|
2528
|
41
|
3564
|
2
|
విశాఖపట్టణం
|
594
|
64
|
974
|
3
|
విజయవాడ
|
545
|
58
|
861
|
4
|
గుంటూరు
|
367
|
36
|
500
|
5
|
వరంగల్
|
336
|
62
|
544
|
6
|
రాజమండ్రి
|
268
|
42
|
381
|
7
|
నెల్లూరు
|
236
|
77
|
418
|
8
|
కాకినాడ
|
227
|
38
|
313
|
9
|
కర్నూలు
|
207
|
51
|
313
|
10
|
నిజామాబాద్
|
183
|
58
|
289
|
11
|
ఏలూరు
|
168
|
32
|
222
|
12
|
మచిలీపట్టణం
|
139
|
23
|
171
|
13
|
అనంతపురం
|
120
|
49
|
179
|
14
|
తెనాలి
|
119
|
16
|
138
|
15
|
తిరుపతి
|
115
|
75
|
201
|
16
|
విజయనగరం
|
115
|
33
|
153
|
17
|
ఆధోని
|
109
|
28
|
140
|
18
|
ప్రొద్దుటూరు
|
107
|
51
|
162
|
19
|
కడప
|
103
|
56
|
161
|
20
|
భీమవరం
|
102
|
60
|
163
|
21
|
ఖమ్మం
|
99
|
73
|
171
|
22
|
కొత్తగూడెం
|
95
|
26
|
120
|
23
|
నంద్యాల
|
88
|
30
|
114
|
24
|
మహబూబ్ నగర్
|
87
|
69
|
147
|
25
|
చిత్తూరు
|
86
|
37
|
118
|
26
|
కరీంనగర్
|
86
|
76
|
151
|
27
|
ఒంగోలు
|
85
|
60
|
136
|
28
|
గుంతకల్లు
|
84
|
27
|
107
|
29
|
గుడివాడ
|
80
|
31
|
105
|
30
|
అనకాపల్లి
|
73
|
28
|
94
|
31
|
చీరాల
|
73
|
33
|
97
|
32
|
జనగామ
|
70
|
204
|
213
|
౩౩
|
శ్రీకాకుళం
|
68
|
50
|
102
|
౩4
|
నరసరావుపేట
|
67
|
54
|
103
|
35
|
నల్గొండ
|
63
|
89
|
119
|
36
|
చిలకలూరిపేట
|
62
|
48
|
92
|
37
|
తాడేపల్లిగూడెం
|
61
|
40
|
85
|
38
|
హిందూపూర్
|
56
|
30
|
73
|
39
|
బాపట్ల
|
55
|
32
|
73
|
40
|
మదనపల్లి
|
55
|
51
|
83
|
41
|
తాడిపత్రి
|
54
|
71
|
92
|
nice post thanks for sharing Telugu vilas
రిప్లయితొలగించండి