రోగ గ్రస్థ భారతాన్ని
రిమోట్ సెన్సింగ్ రక్షిస్తుందా ?
గీటురాయి 28-10-1994
500 కోట్ల రూపాయలు
వెచ్చించి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డి2 ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది ఇండియా.
ఇక మీదట క్రయోజనిక్ ఇంజన్ల తయారీ పై దృష్టి సారించబోతున్నారు. ఈ శాటిలైట్ల ద్వారా నదులు, అడవులు, చేపలు, ఖనిజ వనరుల
గురించిన సమాచారం అందుతుందట.
ఇండియాలో నాలుగేళ్ళ లోపు
పిల్లల్లో 63 శాతం మంది పోషకాహార లోపం వల్ల కునారిల్లుతున్నారు అని ఐక్యరాజ్య
సమితి వెల్లడించింది. కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఎఫ్.సి.ఐ గోడౌన్ల లో
చెడిపోతున్నాయి. ఎన్నో నాసిరకం వస్తువులు
ఐయస్ఐ మార్కుతో బజారులో దొరుకుతున్నాయి. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు కలిగిన
సబ్బుగానీ, రోడ్డుగానీ ఇండియాలో లేవు. భారతీయుల జనాభా 85 కోట్లుంటే భారతీయ ఎలుకల
సంఖ్య 102 కోట్లు. ఎలుకల నిర్మూలన కోసం ఈ శాటిలైట్లు ఏమీ పనికిరావని అంటున్నారు.
టెట్రాసైక్లిన్ గొట్టాలు విపరీతంగా మింగి ప్లేగు నుండి తప్పించుకోజూచిన ఇతర
రుగ్మతలకు గురయ్యారు. ఆరోగ్య రంగానికి ఇక మీదట అదనపు కేటాయింపులు ఉండవని మన్మోహన్
సింగ్ ఐయంఎఫ్ కు హామీ ఇచ్చేశాడు. నూతన ఔషద విధానం పుణ్యమా అని భారత్ అగ్రరాజ్యాల
ఔషద వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. మందుల ధరలు మింటినంటాయి.
మత్తుమందులైన సారాయి, బ్రాందీలు మాత్రం గాంధీ విగ్రహాల సాక్షిగా యావద్దేశానా
అందుబాటులో ఉన్నాయి. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలేదు. కుల సంఘాలు
పెచ్చరిల్లుతున్నాయి. రౌడీలు రాజకీయ నాయకులై ఏలుతున్నారు. గ్రామాల్లో కనీస
సదుపాయాలు లేవు. 50 శాతం గ్రామాలకు త్రాగు నీటి సౌకర్యం లేదు. హిరోషిమా ఏషయాడ్ లో
మన క్రీడాకారులు ఎనిమిదో స్థానం సంపాదించుకొచ్చారు. దేశాన్ని తాకట్టి పెట్టి మరో
నందల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుండి రుణం తెస్తామని ప్రధాని అంటున్నాడు.
15 కోట్ల మంది భారతీయులు
ప్రతి ఏటా క్షయవల్ల చనిపోతున్నారు. గొడ్డుమాంసం క్షయరోగాన్ని ఎంతో చక్కగా
నివారిస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పారు. కానీ దేశ జనాకు సరిపడినంత మాంసం ఉత్పత్తి
కావటం లేదు. మాంసాహారం కంటే మద్యపానమే సదాచారంగా మారింది. చేపలు, రొయ్యలు,
పుట్టగొడుగులు, కొబ్బరినీళ్ళు, పళ్ళు, మాంసం, చివరికి నోటి దగ్గర కూడు కూడా ఎగుమతి
చేస్తున్నారు. గాట్ ఒప్పందం మేరకు హాలాండ్ నుండి ఆవుపేడకు దిగుమతి చేసుకుంటున్నాం.
స్ట్రెప్టోకోకస్-ఎ అనే బాక్టీరియా కేవలం
కొన్ని గంటల్లోనే శరీరంలోని కండరాలను కొవ్వును తినేసి మనిషిని చంపుతుంది. ఈ
బాక్టీరియా సోకిన రోగులకు మాంసపూరణం జరగకపోతే ఎముకల గూడు (కళేబరం) గా కొన్ని
రోజుల్లోనే మారిపోతారు. ప్రపంచ ఆరోగ్యసమితి రిపోర్టు ప్రకారం లక్ష ఎయిడ్స్ రోగులతో
ఇండియా ఆసియాలోకెల్లా ప్రధమ స్థానంలో ఉంది. 2000 సంవత్సరం నాటికి భారతీయ ఎయిడ్స్
రోగుల సంఖ్య 2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఎయిడ్స్ కూ క్షయ వ్యాధికి చాలా దగ్గర
సంబంధం ఉంది.
డాన్ స్టాన్ టన్ గారు ఇలా
అంటున్నారు: “మనజాతి అవినీతి, సాంఘీకదురాచారాలు, 50 వేల మంది
బాలికలు వేశ్యాగృహాల్లో మగ్గిపోవటం, లక్షలాది గర్భస్థ శిశువులను వధించటం, లక్షలాది
వెట్టిచికిరీ చేసే కూలీలు, బాల కార్మికులు, సృష్టికర్త అజ్ఞలను ధిక్కరించే జనం.
ఇవన్నీ చూస్తుంటే దేశాన్ని పట్టిపీడిస్తున్న రోగాలు, దారిద్ర్యం అంతా దేవుని
తీర్పు అనిపించటంలేదా ? రాజకీయనాయకుల ప్రేమంతా డబ్బు అధికారాల మీదే ఉంది. ఒక్కసారి
ఓట్లు పడితే చాలు వారు చేసిన వాగ్ధానాలు మరచిపోతారు. ఇదేనా ప్రజాసేన అంటే ? ” (“మారనాధా
ప్రొఫెటిక్ అలర్ట్” ఆగస్ట్ 1994 సంచిక)
దేశం మీదకు ముంచుకురాబోతున్న రోగాల మీద
రిమోట్ సెన్సింగ్ జరగాలి. ఆ పని ఉపగ్రహాల వల్లకాదు. నీతి నియమాల వల్ల అవుతుంది.
దేవుని ఆజ్ఞల అనుసరణ వల్ల అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి