27, మార్చి 2013, బుధవారం

నియోజక వర్గాల పునర్విభజన జరగాలి

నియోజక వర్గాల పునర్విభజన జరగాలి
                     గీటురాయి 4-1-1991
1952, 57, 62, 67, 71, 77, 80, 84, 89 సంవత్సరాలలో తొమ్మిదిసార్లు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. తుమ్మితే ఊడే ముక్కు ఎన్నాళ్ళుంటుంది అనే పరిస్థితి పటాపంచలై పదవసారి ఎన్నికలు త్వరలోనే రావచ్చు. 1970 వరకు పార్లమెంటు, అసెంబ్లీలకు కలిసి ఒకేసారి ఎలక్షన్లు జరిగేవి. 1971 నుండి వాటికి విడివిడిగా ఎన్నికలు జరుపుతున్నారు. ఇలా విడదీయటానికి ఆనాటి ప్రభుత్వం ఎలాంటి కారణాలూ చూపలేదు. 1952 ఎలక్షన్లలో 51 పార్టీలు పోటీ చేయగా 21 పార్టీలు పార్లమెంట్ లో ప్రవేశించాయి. 1962 వరకు 494 లోక్ సభ స్థానాలుండేవి. 1967 లో ఈ సంఖ్య 525 కి పెరిగింది. 1971 జనాభా ఆధారంగా పార్లమెంటు నియోజక వర్గాల పునర్విభజన జరిగింది. 1973 లో 31 వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ స్థానాలను 545 కు పెంచారు. 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్లమెంటు అసెంబ్లీ స్థానాల సంఖ్య 2001 వ సంవత్సరం దాకా ఇక మారటానికి వీలు లేదని తీర్మానించారు. వాటి కాలపరిమితి ఆరు సంవత్సరాలు చేశారు.
1977 లో జనతా ప్రభుత్వం లోక్ సభ, అసెంబ్లీ కాలపరిమితిని 43 వ సవరణ ద్వారా అయిదేళ్ళకు తగ్గించింది. కాని నియోజక వర్గాల పునర్విభజన జోలికి పోలేదు. 1971 లో 5 నుండి 7.5 లక్షల జనాభాతో లోక్ సభ నియోజక వర్గాలు ఏర్పరపచబడ్డాయి. రాజ్యాంగంలోని 324-329 ప్రకరణాలు ఎన్నికల యంత్రాంగం గురించి చెబుతున్నాయి. వాటి ప్రకారం ఆరు లక్షల జనాభాకు ఒక లోక్ సభ స్థానం కేటాయించాలి. పదేళ్ళకొక సారి సేకరించే జనాభా లెక్కల్ని బట్టి ఈ స్థానాల సంఖ్య పెరుగుతూ ఉండాలి.

లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను పెరిగిన జనాభాను బట్టి పునర్వి భజించాలని బి.జె.పి. తో సహా వామపక్షాలు ఎంతో కాలం నుండి కోరుతున్నాయి. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. నేషనల్ ఫ్రంట్ పాలనలో శ్రీ దినేష్ గోస్వామి ఎన్నికల సంస్కరణల రిపోర్టులో ఈ విషయం పేర్కొన్నారు. అయితే ఈ పని జరుగక ముందే ఫ్రంట్ పతనమయ్యింది. ఢిల్లీ సింహాసనాన్ని ఇప్పుడు చంద్రశేఖర్ అధిష్టించినా, రాజీవ్ గాంధీ ఎక్కినా స్పష్టమైన మెజారిటీ లేని కారణంగా వారు పడిపోవటం ఖాయం. సమీప భవిష్యత్తులో మధ్యంతర ఎన్నికలు జరగటం తధ్యం. ఈ మధ్య కాలంలో ఉండే ప్రభుత్వం వెంటనే నియోజక వర్గాల పునర్విభజన పనిని మొదలు పెట్టించటం యుక్తంగా ఉంటుంది.

క్రమ సంఖ్య

రాష్ట్రం

ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలు
వాటి సగటు వైశాల్యం (వందల చ.కి.మీ)
1981 జనాభా లెక్కల ప్రకారం
సగటు జనాభా లోక్ సభ స్థానానికి (వేలల్లో)
ఉండవలసిన స్థానాల సంఖ్య
1
అరుణాచలప్రదేశ్
2
443
316
1
2
అస్సాం
14
56
1421
33
3
ఆంధ్రప్రదేశ్
42
65
1275
89
4
ఉత్తరప్రదేశ్
85
35
1304
185
5
ఒరిస్సా
21
74
1256
44
6
కర్నాటక
28
68
1326
62
7
కేరళ
20
19
1272
42
8
గుజరాత్
26
75
1311
57
9
గోవా
2
19
543
2
10
జమ్మూకాశ్మీర్
6
370
998
10
11
తమిళనాడు
39
33
1242
81
12
త్రిపుర
2
52
1026
3
13
నాగాలాండ్
1
165
775
1
14
పంజాబ్
13
39
1291
28
15
పశ్చిమబెంగాల్
42
20
1300
91
16
బీహార్
54
32
1295
116
17
మణిపూర్
2
111
710
2
18
మధ్యప్రదేశ్
40
111
1304
87
19
మహారాష్ట్ర
48
64
1308
105
20
మిజోరం
1
210
494
1
21
మేఘాలయ
2
112
668
2
22
రాజస్థాన్
25
137
1370
57
23
సిక్కిం
1
70
316
1
24
హర్యానా
10
44
1292
22
25
హిమాచల్ ప్రదేశ్
4
139
1070
7
26
7 కేంద్రపాలిత ప్రాంతాలు
13
8
591
13
భారతదేశం
543
60
1262
1142

ప్రస్తుత జనాభా అంచనా ప్రకారం ఒక్కొక్క లోక్ సభ సభ్యుడి 16 లక్షల ప్రజలకు ప్రతినిధిగా ఉన్నాడు. జనాభా పెరిగే కొద్దీ వారి అవసరాలకు అనుగుణమైన నిష్పత్తిలో రాజకీయ ప్రతినిధులు కూడా పెరగాలి. ఇప్పటి జనాభాను బట్టి మన రాష్ట్రానికి వంద మంది లోక్ సభ సభ్యులుండాలి. ప్రజల వాణిమి వినిపించటానికి, వారి అవసరాలను ఏకరువు పెట్టటానికి, ఆయా ప్రాంతాల అభివృద్ధి పనుల్ని సాధించటానికీ, ఈ ప్రజా ప్రతినిధులు అవసరం. వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే జనాభా ప్రతినిదులు నిష్పత్తిని ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలి.

అంతేగాక ఏదైనా ఒక రాష్ట్రంలో పూర్తి స్థానాలను ఒకే పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ అది పార్లమెంటులో ప్రధాన ప్రతి పక్షం కాలేకపోతున్నది. ఉత్తర ప్రదేశ్, బీహార్ లకు తప్ప మరే రాష్ట్రానికీ ఈ ఆధిక్యత లేదు. పైగా ఉత్తరాది పెత్తనం, హిందీని బలవంతంగా రుద్దడం కొనసాగుతున్నాయి. అందువలన దక్షిణ భారత దేశంలో ఎక్కడో ఒక చోట పార్లమెంట్ సమావేశాలు జరపాలి. సుప్రీమ్ కోర్టు బెంచిని కూడా దక్షిణాదిలో ఏర్పాటు చెయ్యాలి. పార్లమెంట్ సభ్యుల జీత భత్యాలను తగ్గించి, సభ్యుల సంఖ్యను పెంచాలి. మధ్యంతర ఎన్నికలు కొత్త నియోజక వర్గాలతో జరిపించగలదని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి