చిన్న జిల్లాలు
ఏర్పరచాలి
గీటురాయి 9-10-1990
కొన్ని
జిల్లాల కోసం ప్రజల ఆందోళన మన రాష్ట్రంలో ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ ఈ ఆందోళన ఉంది. సకాలంలో దానిని
గమనించిన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని, గత మూడేళ్ళ కాలంలో 54 కొత్త జిల్లాలను ఏర్పరచాయి. ఒరిస్సా
ఒకేసారి 10 కొత్త జిల్లాలను ఏర్పరుస్తూ
నోటిఫికేషన్ జారీ చేసింది. అస్సాం 5, హర్యానా 4, తమిళనాడు 2, ఉత్తరప్రదేశ్ 6 జిల్లాలను ఏర్పరచాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో 2 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ
విధంగా 1989 లో 447 గా ఉన్న జిల్లాల
సంఖ్య ఈనాడు 501 కి పెరిగింది.
జిల్లాల
సంఖ్య పెరిగేకొద్ది వాటి సైజు తగ్గుతుంది గనుక జిల్లా అభివృద్ధి రాధానికి సారధుల్లాంటి ఐ. ఎ. ఎస్. ఆఫీసర్లు
జనానికి దగ్గరవుతారు. జిల్లా కేంద్రానికి
మారుమూల గ్రామాల ప్రజలు ప్రయాణం చెయ్యడానికి దూరం భారం తగ్గుతాయి. అధికార వికేంద్రీకరణ జరిగి మరిన్ని ప్రాంతాలు
అభివృద్ధి చెందుతాయి. విపరీతమయిన
జనాభారంతో ఉబ్బిపోయిన నగరాల నుండి జనమూ, ఉద్యో గులు చెదిరిపోయినందువల్ల ఆయా నగరాలు ఊరట చెందుతాయి. ప్రతి జిల్లాలోను భారీ
పరిశ్రమలు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయం
మేరకు జిల్లాల సంఖ్యతో పాటు పరిశ్రమల సంఖ్య పెరుగుతుంది. పరిశ్రమలన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్నీ ప్రాంతాలు సమంగా
అభివృద్ధి చెందుతాయి.
వ. నెం.
|
రాష్ట్రం
|
జిల్లాల సంఖ్య
|
లోక్ సభ స్థానాల సంఖ్య
|
జిల్లాల సగటు వైశాల్యం (వందల చ.కీ)
|
జిల్లాల సగటు జనాభా (వేలలో 91)
|
రాష్ట్ర వైశాల్యం (వందల
చ. కిమీ)
|
1
|
అరుణాచల్
ప్రదేశ్
|
11
|
2
|
81
|
78
|
887
|
2
|
అస్సాం
|
23
|
14
|
34
|
969
|
784
|
3
|
ఆంధ్ర ప్రదేశ్
|
23
|
42
|
119
|
2823
|
2751
|
4
|
ఉత్తర ప్రదేశ్
|
63
|
85
|
47
|
2202
|
2944
|
5
|
ఒరిస్సా
|
23
|
21
|
68
|
1370
|
1557
|
6
|
కర్ణాటక
|
20
|
28
|
962
|
240
|
1918
|
7
|
కేరళ
|
14
|
20
|
28
|
2072
|
389
|
8
|
గుజరాత్
|
19
|
26
|
103
|
2167
|
1960
|
9
|
గోవా
|
2
|
2
|
19
|
584
|
37
|
10
|
జమ్ము కాశ్మీర్
|
14
|
6
|
159
|
551
|
2222
|
11
|
తమిళనాడు
|
22
|
39
|
59
|
2529
|
1300
|
12
|
త్రిపుర
|
3
|
2
|
35
|
915
|
105
|
13
|
నాగాలాండ్
|
7
|
1
|
24
|
175
|
166
|
14
|
పంజాబ్
|
13
|
13
|
38
|
1553
|
504
|
15
|
పశ్చిమ బెంగాల్
|
17
|
42
|
52
|
3999
|
887
|
16
|
బీహార్
|
42
|
34
|
41
|
2056
|
1739
|
17
|
మణిపూర్
|
8
|
2
|
28
|
228
|
225
|
18
|
మధ్య పదేశ్
|
61
|
40
|
73
|
1084
|
4434
|
19
|
మహా రాష్ట్ర
|
31
|
48
|
99
|
2539
|
3077
|
20
|
మిజోరాం
|
3
|
1
|
70
|
229
|
211
|
21
|
మేఘాలయ
|
5
|
2
|
45
|
352
|
224
|
22
|
రాజస్థాన్
|
30
|
25
|
114
|
1462
|
3422
|
23
|
సిక్కిం
|
4
|
1
|
18
|
101
|
71
|
24
|
హర్యానా
|
16
|
10
|
28
|
1020
|
442
|
25
|
హిమాచల్ ప్రదేశ్
|
12
|
4
|
46
|
426
|
557
|
26
|
7 కేంద్ర పాలిత ప్రాంతాలు
|
15
|
13
|
7
|
758
|
110
|
భారతదేశం
|
501
|
523
|
66
|
1684
|
32873
|
విశాలాంధ్ర
ఏర్పడి 36 ఏళ్ళు పూర్తి కావస్తున్నా మనకు ప్రకాశం, విజయనగరం, రంగారెడ్డి అనే మూడు
జిల్లాలు తప్ప వేరే కొత్త జిల్లాలు ఏర్పాటు
కాలేదు. జిల్లాలను రెవిన్యూ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేయకపోగా జనానికి అనువుగా ఉన్న మండలాల సంఖ్యను కుదించటానికి పాలకపార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అధికార
వికేంద్రీకరణ, ప్రజలకు చేరువలో పాలనా సదుపాయాలు అనే అందమైన రాజకీయ
నినాదాలు చేసుకుంటూ 36 సంవత్సరాల
సుధీర్ఘకాలం గడిచిన రాష్ట్ర పాలక పార్టీలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. తూతూ
మంత్రంలాగా ఏర్పాటు చేసిన మండల కేంద్రాల్లో
ప్రాధమిక సదుపాయాలన్నీ కల్పించాలి. జిల్లాల విభజనకు ఒక ప్రామాణిక సూత్రం గానీ, శాస్త్రబద్ధమైన విధానంగానీ ఏదీ లేకుండానే కాలం గడుపుకొచ్చారు. హైదారాబాద్ జిల్లా వైశాల్యం
217 చ.కి.మీ దాని చుట్టూ ఉంగరంలాగా ఉండే రంగారెడ్డి జిల్లా వైశాల్యం 7493 చ.కి.మీ. జిల్లా ఏర్పాటుకు
ప్రాతిపదికగా తీసుకోవలసిన ఆధారం ఏది ? వైశాల్యమా లేక జనాభానా
? లేక ఈ రెండింటి సగటునా?
ప్రస్తుతం ఉన్న ఏడు కేంద్రపాలిత
ప్రాంతాల వైశాల్యం కలిసి 10,973 చ. కి.మీ. అంటే మన తూర్పు గోదావరి జిల్లా అంత అన్నమాట. గోవా, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలంకంటే మన
జిల్లాలు పెద్దగా ఉన్నాయి. రాష్ట్రలే కాదు
కొన్ని దేశాలు కూడా మన జిల్లాల కాంటే చిన్నవి. ఉదాహరణకు
మాల్దీవుల వైశాల్యం 298 చ.కి.మీ.
మాల్టా దేశ వైశాల్యం
316 చ.కి.మీ. గ్రినెడా 344, ఆండొర్రా 464, బెహ్రెయిన్ 669, బ్రూనే 5765, కేప్ వర్దీ 4033, సైప్రస్ 9251, డొమినికా 750, ఫిజీ 18376, గాంబియా 11295, జమైకా 10991, కువైట్ 17656, లెబనాన్ 10400, లక్సింబర్గ్ 2586, మారిషస్ 2040, పోర్టోరికో
8891, కటార్ 1100, సీషెల్స్ 30, సింగపూర్ 616, స్వాజీలాండ్ 17636, టోంగా
748, ట్రినిడాడ్ అండ్ టుబాగో 5128,
వనౌటు 14700 చ.కి.మీ. వైశాల్యం గల దేశాలు. అంటే ఈ దేశాల ప్రజలు దేశ రాజధానికి మనం జిల్లా
కేంద్రానికి
వెళ్ళినట్లు
వెళతారు. మనకైతే దేశ రాజధానికి (ఢిల్లీ) వెళ్ళిరావడం అనే ఊహ అంటే కలలో
లంకెలబిందెలు కనబడినంత లెక్క. రాష్ట్ర రాజధాని (హైదారాబాద్) కి వెళ్ళి రావటమే అతి ప్రయాసకరంగా ఉంది.
అనంతపురం జిల్లా వైశాల్యం 19130 చ.కి.మీ. దీని ముందు ఈ దేశాలన్నీ బలాదూర్, మహబూబ్ నగర్ 18432, కర్నూలు 17658, ప్రకాశం జిల్లా 17626 చ.కి.మీ.
ల భారీ సైజుతో హడలు పుట్టిస్తున్నాయి.
దేశంలోని
జిల్లాల సగటు వైశాల్యం 6581 చ.కి.మీ.
ఉంది. ఈ సగటుకు మన రాష్ట్రం చేరాలంటే మనకు మొత్తం 42 జిల్లాలుండాలి. అంటే పార్లమెంట్ స్థానాల సంఖ్యకు జిల్లాల సంఖ్య కూడా సమానం
చెయ్యాలి. రాష్ట్రంలో ప్రస్తుతం
ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు 15.79 లక్షల ప్రజలకు 6549 చ.కి.మీ.
భూభాగానికి ప్రతినిధ్యం వహిస్తుంటే, ఒక్కొక్క జిల్లా కలెక్టర్ 28.83 లక్షల జనానికి, 11959 చ.కి.మీ.
భూభాగానికి
సేవలండిస్తున్నాడు. ఇది జాతీయ సగటు కంటే 12 లక్షల జనాభా మరియు 5398 చ.కి.మీ. భూభాగం ఎక్కువ. అంటే
శ్రీకాకుళం సైజున్న మరో 18 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని ఆరు జోనుల్లో జోనల్ కార్యాలయాలు
ఏర్పాటు చేయాలి. విజయవాడ
– గుంటూరు ను రాష్ట్ర రెండవ రాజధానిగా ప్రకటించి అసెంబ్లీ సమావేశాలు అక్కడ కూడా జరపాలి. రాయలసీమకు కడపలోను, ఆంధ్ర కు విజయవాడలోను, తెలంగాణాకు హైదారాబాద్ లలో అన్ని శాఖల ప్రాంతీయ కార్యాలయాలు
నెలకొల్పాలి. ఇక కొత్తగా ఏర్పాటు చేయవలసిన జిల్లా కేంద్రాలు ఇవి:
ఉత్తరాంధ్ర
: పార్వతీపురం, నర్సీపట్నం, రాజమండ్రి, అమలాపురం, భీమవరం
దక్షిణాంధ్ర : విజయవాడ, నర్సరావుపేట, మార్కాపురం, బాపట్ల
రాయలసీమ: నంద్యాల, తిరుపతి, గుంతకల్లు,
రాజంపేట
తెలంగాణ: సిద్దిపేట, మెదక్, భద్రాచలం,
మంచిర్యాల, అచ్చంపేట
చరిత్ర
కొన్ని జిల్లాలను కోరుతోంది. పాలకులు వాటిని ఏనాటికైనా ఏర్పాటుచేయక తప్పదు. ప్రజల వాంఛలు, సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంత కాలం తొక్కిపట్టవచ్చు గాని ఎల్ల కాలం కుదరదు. చిన్న
జిల్లాలు – చిన్న రాష్ట్రాలు అనే వాంఛ ప్రజల్లో ప్రబలుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి