27, మార్చి 2013, బుధవారం

ఇళ్ళ నిర్మాణం పై దృష్టి సారించాలి



ఇళ్ళ నిర్మాణం పై దృష్టి సారించాలి
గీటురాయి 26-4-1991

2000 సంవత్సరం నాటికి దేశంలో అన్ని కుటుంబాలకు ఇల్లు సమకూరుస్తామని, 1987 లో అన్ని రాష్ట్రాల గృహనిర్మాణ శాఖా మంత్రులు శ్రీ నగర్ లో చేసిన శపథం శపథంగానే మిగిలిపోయింది. బొంబాయి మహానగరం జనాభా ప్రస్తుతం 120 లక్షలు  కాగా అందులో సగం మంది అంటే 60 లక్షల మంది మురికి వాడల్లో నివసిస్తున్నట్లు అంచనా. మన భాగ్యనగరం పరిస్థితి కూడా అతి దారుణంగా తయారయ్యింది. జనాభా 36 లక్షలు అనుకుంటే అందులో 9 లక్షల మంది 700 మురికి వాడల్లో నివసిస్తున్నారు. హైదరాబాదు నగరంలో చదరపు కిలోమీటరుకు 16600 మంది కిక్కిరిసి జీవిస్తున్నారు. అంటే చదరపు మీటరు స్థలంలో 17 మంది ఉంటున్నారు.

జనాభా లెక్కలు తీసే సమయంలో ఫిబ్రవరి 28 వ తేదీ అర్ధరాత్రి దాటగానే ఎన్యూమరేటర్లు బయలుదేరి రోడ్డు ప్రక్కలు, పేవ్ మెంట్లు, హ్యూమ్ పైపులు, వీధి అరుగులు, గుడులు, మండపాలు, ఫ్లాట్ పారాలు మొదలైన చోట్లన్నీ సర్వే చేసి మార్చ్ 1 ఉదయానికి ముందే ఇల్లు లేని ప్రజల లెక్కలు సిద్ధం చేస్తారు. ఈ లెక్కల్లోకి అద్దె ఇళ్ళలో అవస్థలు పడేవారు ఎక్కరు. కేవలం బిక్షగాళ్ళు, దిక్కులేని దీనులు మాత్రమే లెక్కించబడతారు. జనాభా లెక్కల షెడ్యూళ్ళలో వీరికి గుర్తు చేస్తారు. 1981 లెక్కల్లో వీరి సంఖ్య 14 కోట్లు. వీళ్ళకు ఆశ్రయం నిర్మించవలసి ఉందని జాతీయ గృహ నిర్మాణ సమితి అంచనా వేసింది. 199 నాటికి 638 లక్షల ఇళ్ళు, 2000 సంవత్సరం నాటికి 871 లక్షల ఇళ్ళు కొరతగా ఉంటాయని భారత ప్రభుత్వం అంచనా వేసింది.

ఇక మన రాష్ట్రం విషయానికొస్తే, తెలుగుదేశం ప్రభుత్వం పతనమయ్యాక గృహ నిర్మాణ రంగం ప్రాముఖ్యతను కోల్పోయి నత్తనడక నడుస్తోంది. నిముషానికి ఇల్లు అనే నినాదాన్ని నిజం చేసి గత ప్రభుత్వ కేంద్రం చేత కీర్తించబడింది. పక్కా ఇళ్ళ నిర్మాణం ఇప్పడు ఎక్కడోగాని జరగటం లేదు. ఈ క్రింది అంకెలు ఈ విషయాన్ని మనకు ఋజువు చేస్తాయి : -

సం||
తలపెట్టిన ఇళ్ళ సంఖ్య
పూర్తి చేసిన ఇళ్ళ సంఖ్య
1983-84
1,55,256
1,53,962
84-85
1,36,979
1,36,198
85-86
1,44,762
1,43,557
86-87
2,05,307
2,02,650
87-88
1,52,938
1,47,241
88-89
1,15,265
81,362
89-90
97,405
46,096
90-91
1,67,622
2,851

రాష్ట్రంలో ఇళ్ళ నిర్మాణం కోసం వివిధ సంస్ధలిచ్చిన అప్పులు

సం||
హడ్కో
ఎల్ ఐ సి
జిఐసి
బ్యాంకులు
మొత్తం
1983-85
31
12
8
1
52
  85-87
46
11
5
57
119
  87-89
40
13
7
48
108
  89-91
21
5
5
22
53
           138
41
25
128
332


1989 తరువాత ఇళ్ళ నిర్మాణం ఒక్కసారిగా తగ్గిపోవటం స్పష్టంగా కనిపిస్తోంది. 1981 నాటికే మన రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ళ కొరత ఉంది. ప్రస్తుతం అది 33 లక్షలకు చేరింది. ప్రతి ఏటా రాష్ట్రంలో 75 వేల ఇళ్ళ కొరత హెచ్చుతుంది. రెండువేల సంవత్సరం నాటికి రాష్ట్రంలో ఇళ్ళ కొరత 40 లక్షలకు చేరవచ్చు. అందువలన ఈ ఇళ్ళ కొరతను పూర్తిగా నివారించాలంటే ఏడాదికి నాలుగున్నర లక్షల ఇళ్ళు నిర్మించుకుంటూ పోవాలి. ఇంటికి 12 వేలు ఖర్చు అవుతుందనుకున్నా సంవత్సరానికి ఖచ్చితంగా 540 కోట్ల రూపాయలు కేటాయించవలసి వస్తుంది. ఇందులో హడ్కో, ఎల్ఐసి, జిఐసి, వాణిజ్య బ్యాంకులు పాలుపంచుకునేలా చెయ్యాలి. రెండు రూపాయలకు కిలో బియ్యం పధకాన్ని రద్దుచేసి, దానికి వస్తున్న సబ్సిడీ డబ్బును ఇళ్ళ నిర్మాణానికి సబ్సిడీగా ఇవ్వవచ్చు. గృహ నిర్మాణంపై పెట్టుబడిని ఉత్పాదక వ్యయంగా భావించాలి. ప్రజలకు స్వంత ఇల్లు సమకూరి అద్దె వ్యయం తగ్గుతుంది. సంక్షేమ సమాజం నెలకొంటుంది.

గృహ నిర్మాణం పై పెట్టే ఈ పెట్టుబడి వల్ల ఒక లక్షమంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. గృహ నిర్మాణ సామాగ్రి తయారీ కేంద్రాలు విస్తృతంగా నెలకొంటాయి. కొన్ని వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పని దొరుకుతుంది. ఒక పక్క ఉపాధి మరో వైపు నిర్మాణం కొనసాగుతాయి. ప్రభుత్వం డబ్బు ఒక్క పైసా కూడా దుర్వ్యయంకాదు. ఎన్జీవో రిటైర్ అయ్యే నాటికి స్వంత ఇల్లు సమకూరుస్తానని తెలుగుదేశం మెనిఫెస్టో ప్రకటించింది. అదే వాగ్దానం ఈనాడు ముఖ్యమంత్రి శ్రీ జనార్ధన రెడ్డిగారు చేస్తున్నారు. ప్రజలందరికీ మేలు కలిగించే ఈ ఇళ్ళ నిర్మాణంపై దృష్టి సారించటం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి