27, మార్చి 2013, బుధవారం

ఇస్లాం – బహుభార్యాత్వం



        ఇస్లాం – బహుభార్యాత్వం
       గీటురాయి 3-3-1989            (అనువాదం)

అల్ బుర్ హాన్ అనే మాసపత్రిక 1988 సంచికలో ముస్లిముల బహు భార్యాత్వం గురించి ఫయజా అంబా అడిగిన ఒక ప్రశ్నకు అహ్మద్ దీదాత్ ఇలా సమాధాన మిచ్చారు :-

ఒక ముస్లిం కేవలం ఆడవాళ్ళ కోసమే జీవించటంలేదు. మన ప్రవర్తనలోను, సంస్కృతిలోను మనం ఇస్లాం బోధనల నుండి తొలగిపోయాము. మనం న్యాయం చెయ్యడంలేదు. ఆ విషయంలో సందేహం లేదు. కాని ఇస్లామ్ కాదు. అలా అన్యాయంగా ఉంటున్నది ముస్లిములే.

ఓ మనిషికి నలుగురు భార్యలుండొచ్చు. ఒక స్త్రీ నలుగురు భర్తలను కలిగి ఉండలేదు. ఒక స్త్రీని అడిగి చూడండి ఆమె నలుగురు భర్తలను కోరుకుంటున్నదేమో ? అందరూ గర్భవతులైన నలుగురు స్త్రీలను ఒక పురుషుడు కలిగి ఉండవచ్చు. అది సమస్యే కాదు. కాని గర్భవతి అయిన ఒక స్త్రీకి నలుగురు భర్తలుంటే, ఆమె కడుపుతో ఉన్న కాలంలోనే నలుగురు భర్తలూ వరుసలో నిలబడతారు.

తరువాత పిల్లవాడు పుడతాడు. ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి? ఆ బిడ్డకు తండ్రి ఎవడు ? ఎవడికి వాడే ఆ బిడ్డ నా బిడ్డేనని ఎందుకు చెప్పాలి? అతను నాలాగా లేడు నీలాగా ఉన్నాడు అని చెప్పుకుంటారు. అది ఎంతో గందరగోళంగా ఉంటుంది.

ఇదే ప్రశ్న మాకు నలుగురు భర్తలు ఎందుకు ఉండకూడదు? అని ఒక స్త్రీ మహా ప్రవక్తను అడిగింది. ఎందుకు ఉండకూడదో నిరూపించటానికి పాలిచ్చే నలుగురు తల్లుల్ని ఒక పాత్రలో తమ పాలను పిండమంటారు ప్రవక్త. అలా పిండాక ప్రతి స్త్రీని తన పాలను తిరిగి వెనక్కి తీసుకోమంటారు. ఒకరి పాలనుండి మరొకరి పాలు వేరు చేయటం సాథ్యం కాదే, మేమీ పని ఎలా చేయగలమండీ అంటారా తల్లులు. సరే, అదే సమాధానం అంటారాయన. పురుషుడికి కూడా ఇదే నేను చెప్పేది. ఏది ఏదో వేరు చేసి తెలుసుకునే మార్గం మనకు లేదు. ఈ ఉదంతం ప్రవక్త (సఅసం) కు సంబంధించింది కాదేమో రచయిత పొరబడ్డారేమో అన్నది మా అనుమానం – ఎడిటర్.

పుట్టేటప్పుడు ఆడ మగ జన్మల సంఖ్య సమానంగానే ఉంటున్నది. కాని ఆడ శిశువుల కంటే మగ శిశువుల మరణ సంఖ్య ఎక్కువగా ఉందనే సంగతి లెక్కలోకి తీసుకోవాలి. పురుషుణ్ణి బలాఢ్యునిగాను ఆడవాళ్ళను అబలలుగాను చెబుతారు గాని అబలల కంటే సబలలే ఎక్కువగా చనిపోతున్నారు.

అమెరికాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ పురుషుల కంటె 78 లక్షల స్త్రీలు ఎక్కువ ఉన్నట్లు గణాంక వివరాలు తెలుపుతున్నాయి. అమెరికాలోని ప్రతి పురుషుడు పెళ్ళిచెసుకుంటే ఇంకా 78 లక్షల మంది స్త్రీలు భర్తలు లేకుండానే ఉంటారు. నాకు అందిన సమాచారం బట్టి అక్కడ ఉన్న పురుషుల్లో మూడవ వంతు మంది స్వలింగ సంపర్కులనీ జైళ్ళల్లో ఉన్న జనంలో 98 శాతం మగవాళ్ళే. యుద్ధాలలో కూడా పురుషులే చస్తారు దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీరు ఊహించగలరా? ఈ సమస్యకు ఇస్లాం పరిష్కారాన్ని చూపుతుంది. నలుగురు పెళ్ళాల్ని కలిగి ఉండండని అది చెప్పటం లేదు. అది చెప్పేదేమిటంటే, మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. ఇద్దరినో ముగ్గురినో లేక నలుగురినో. కాని మీరు వారి మధ్య న్యాయం చేయలేమని భయపడితే ఒక్కరినే వివాహం చేసుకోండి.

ఇస్లాంలో బహుభార్యాత్వం అనేది కేవలం బలవర్ధినిగా తీసుకునే టానిక్కు కాదు. అది సంఘంలోని ఒక సమస్యకు పరిష్కారం. కాని పాశ్చాత్య సమాజం దీనిని నిరోధించటానికి పోరాడుతున్నది. స్త్రీలలో స్త్రీలు, పురుషుల్లో పురుషులు కామ కలాపాలు నడపటం చట్ట సమ్మతం చేయబడ్డాయి. ఎదిగిన పురుషులు ఇద్దరు చర్చిలోనే పెళ్ళిచేసుకుంటున్నారు. కాని బహుభార్యాత్వం సంగతి వచ్చేటప్పటికి శవంతో సంభోగించినట్టు అని వాళ్ళంటారు. కాని కాముకులారా మీకు జబ్బుచేసింది. మీ సమస్యకు ఇది పరిష్కారం అంటాను నేను.

తమ భర్తలను ఇతర స్త్రీలతో కలిసి పంచుకోమని ఎవరూ స్త్రీలను ఒత్తిడి చేయటంలేదు. ఎవరూ అది చెప్పటం లేదు. అధిక భాద్యతను స్వీకరించటానికి వెనుకాడని పురుషుడు ఒక రకమైతే, తోటి స్త్రీలతో కలసి పంచుకోవటాన్ని ఎదిరించని స్త్రీ మరోరకం. టి.వి. లో బహుభార్యాత్వం పై ఒక కెనడియన్ కార్యక్రమం చూశాను. అందులో ఒక పురుషుడు ముందుకొచ్చి, నేను మాజీ మార్మన్ ను, నేను వెలివేయబడ్డాను. నాకు ఎనిమిది మంది భార్యలు అనంటాడు. భార్యలంతా అక్కడే ఉన్నారు. అంతా అతనితో ఆనందంగా ఉన్నారు. ప్రోగ్రాంలోనే ప్రేక్షకుల్లోని ఒక లావుపాటి స్త్రీ నా గురించి ఏమంటావు? అని కవ్విస్తుంది. నీవు కూడా, మేడం, నాకేమీ అభ్యంతరం లేదు. నీ చిరునామా ఇవ్వు అంటాడాయన. అతన్ని చేసుకున్న స్త్రీలందరికీ భర్తలు లేరు. సహజంగా జీవించదలుచుకొన్న వాళ్ళందరికీ, వాళ్ళ సమస్యకు ఇస్లామే పరిష్కారం.

అంతర్జాతీయ ఇస్లామిక్ ప్రచార కేంద్రం ఈ క్రింది పుస్తకాలను ఉచితంగా పంపిస్తున్నది.

1.     Christ in Islam
2.     Crucifixian or Cruel FICTION ?
3.     Is the Bible God’s word?
4.     Arabs and Israels Conflict or conciliation?

పై పుస్తకాలు కావలసిన వారు ఈ క్రింది చిరునామాకు వ్రాసి తెప్పించుకోగలరు.

The Islamic propagation Centre International 124, Queen street, DURBAN 4001, South Africa.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి