భారతీయ ముస్లిముల్లో
బహుభార్యాత్వం
(1924 లో సిల్హెట్ లోని కేల్వానిక్ మెతడిస్ట్ మిషనరీ రెవరెండ్ టి. డబ్ల్యూ. రీస్ లండన్ లోని రాబర్ట్ రాబర్ట్స్ గారికి వ్రాసిన
లేఖలోని భాగం ఇది).
“ సిల్హెట్, కచార్ లోని ముహమ్మదీయుల గురించి నా
అనుభవం మీద తెలుసుకున్నదేమంటే ఇక్కడ
ఎవరికైనా ఒకరికంటే ఎక్కువ మంది భార్యలుండటం చాలా అరుదు. అలాంటి వాళ్ళు
ఒకరిద్దరిని కలిశాను. కాని అలాంటి
వారి సంఖ్య ఒక్క శాతం కూడా లేదని నేను నిశ్చయంగా చెప్పగలను.
కురాను అనుగ్రహించిన ఈ అవకాశాన్ని ఒక్క శాతం ప్రజలు కూడా వాడుకోవటం లేదు. బహుశా వెయ్యి కొక్కడు ఉంటాడేమో, బహుభార్యాత్వం
పాటించే కొద్ది మందిలో కూడా అలా ఎందుకు జరుగున్నదంటే మొదటి భార్యకు సంతానం కలుగకపోతేనో, ఇంటి పని చేసే శక్తి లేక రోగిష్టి అయ్యుంటేనో మాత్రమే. ప్రతి భార్యకు ప్రత్యేక ఇల్లు కేటాయించాలన్న కురాన్ లో నియమం వల్ల చాల మంది పేదలు బహు భార్యాత్వం పాటించటం లేదు. ఏక పత్నీ వ్రతాన్నే ఈ మతస్తులు సమర్ధిస్తున్నారు. ఎక్కువ మంది భార్యలున్న వాడిని అతని మతస్తులే గౌరవంగా
చూడటం లేదు. సంపన్నుల్లో ఉంపుడు గత్తెలు, విడాకుల వ్యవహారాలు
జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలు డబ్బుతో కూడుకున్నాయి
గనుక పేదలు ఆగిపోతున్నారు.
ఇక
స్త్రీలను పిల్లలను చూచుకునే విషయం :
మిగతా
మనుషుల కంటే మిషనరీ చాలా నిరపాయకరమైన మనిషి అని
భావిస్తుంటారు గనుక నేను గ్రామాలలో చాల మంది స్త్రీలను చూచాను. హిందూ సమాజంలో లాగానే ముహమ్మదీయ స్త్రీలు, పిలల్లూ ఎంతో శ్రద్ధగా సంరక్షించబడతారు. మగపిల్లలను, హిందువులు మరింత బాగా చూస్తారు. మహమ్మదీయులు కూడా అంతే. అదే సందర్భంలో ముహమ్మదీయ స్త్రీలు. హిందూ స్త్రీల కంటే చాలా ఖచ్చితంగా ఇళ్ల లోనే ఉంచబడతారు. ముహమ్మదీయ బాలికల పాఠశాల అనేది కానరావటం
మహా అరుదు. మైదానాలలోని మా బాలికల
పాఠశాలన్నీ హిందూ బాలికలతోటే నిండి ఉన్నాయి.
సిల్బార్ స్కూల్లో 150 మంది బాలికలుంటే ఒక్క ముహమ్మదీయ బాలిక కూడా లేదు. మళ్ళీ ఆ ఊళ్ళో ముహమ్మదీయుల జన
శాతం చాల ఎక్కువే. హిందువుల ఆడపిల్లల కంటే ముహమ్మదీయుల ఆడపిల్లలు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. రజస్వల అయిన మీదట పెళ్లి చేయవచ్చు అనేది
మహమ్మదీయుల్లో నియమం అయితే, హిందువుల్లో రజస్వల కాకముందే
పెళ్లి అయిపోతూ ఉంది. “
ఆంగ్ల మూలం : - రాబర్ట్ రాబర్ట్స్
వ్రాసిన “ The social laws of the quaran” (1924) Reprint
Cosmo Publications 1978 p 121, 122 ) N. Delhi.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి