సత్యం
ప్రకాశిస్తే అసత్యం నిష్క్రమిస్తుంది
గీటురాయి
22-10-1993
అన్నీ మంచి శకునములే
కన్యాలాభ సూచనలే...
కుడికన్నదిరే, కుడి భుజమదిరే
కోరిన చెలి నను దరిచేరునులే || అన్నీ||
అని పాడుకునే శకున పక్షులకు ఈ దేశంలో
కొదువలేదు. శకునం వేళ ఎక్కడికని అడగకూడదుగాని, ఎక్కడికో చెప్పిపో అన్నాడట ఓ
అపశకునపు పక్షి. శని పడితే ఏడేళ్ళు, నేను పడితే పద్నాలుగేళ్ళు అన్నట్లు
జ్యోతిష్కులు, హస్తసాముద్రికులు, స్వప్నఫలాలు చెప్పేవాళ్ళు, జాతకాలు చూసేవాళ్ళు,
చిలకపస్తీల వాళ్ళు, బాబాలు, అమ్మవార్లూ... ఇలా మూఢాచార పరాయణులెంతో మంది దేశాన్ని
పట్టి పీడిస్తున్నారు. బల్లి, తొండ లాంటివి మనిషి ఒంటిమీద ఎక్కడెక్కడపడితే ఏమేమి
అనర్ధాలు జరుగుతాయో చెప్పి జనాన్ని హడలగొడుతున్నారు. వితంతువు, ఒంటి బ్రాహ్మణుడు,
జడధారి, నూనె, ఉప్పు, కట్టెలు, బెల్లం, మజ్జిగా లాంటివి ప్రయాణ సమయంలో ఎదురైతే
చెడు జరుగుతుందట. నిప్పు, గుర్రం, ఏనుగు, వేశ్య, నక్క లాంటివి ఎదురయితే మంచి
జరుగుతుందట. ఇక తిధి, వార, నక్షత్రాలు, వర్జ్యాలు, రాహుకాలాలు యమగండాలు అంటూ
ప్రజల్ని నానా యాతనలకూ గురి చేస్తున్నారు.
పూర్వం
అరేబియాలో జంతువులు, పక్షుల ప్రయాణాల నుండి శకునాలు చూసుకునే వారు. ఆడ మనిషి
ఎదురైతే అపశకునం (తియారా) మగవాడు ఎదురయితే శుభశకునం (ఫఅల్) అనే వారు. మహాప్రవక్త
ముహమ్మద్ ఈ దురాచారాలను ఖండించారు. “అపశకునాన్ని నమ్మవద్దు. శుభ శకునాన్నే స్వీకరించండి” అని ఆయన అన్నారు. ఏది శుభ
శకునం?
అని
అడిగితే “ప్రతి
మంచి మాటా శుభ శకునమే” అన్నారు. ఆంగ్లేయులు శకునాన్ని ‘OMEN’ అన్నారు. A
sign that something is going to happen in the future అన్నారు.
తుమ్ము తమ్ముడై చెబుతుంది అనే తెలుగు వాళ్ళుకు ఆంగ్లేయులు అన్నలై ఇలా చెప్పారు : “ సోమవారం తుమ్ము ప్రమాదం, మంగళవారం తుమ్ము పరాయివారితో
ప్రణయం, బుధవారం తుమ్ము దూరదర్శనం, గురువారం తుమ్ము శుభం, శుక్రవారం తుమ్ము శోకం,
శనివారం తుమ్ము భార్యకి తద్దినం, ఆదివారం తుమ్ము దయ్యానికి వారమంతా విందు”. కాబట్టి ఏతావాతా తేలిందేమిటంటే
అపశకునాల భయం అందరికీ ఉందనేదే.
అయితే “అప్పళాటార్యస్య సన్నిదౌ, అపశబ్ద
భయం నాస్తి, అపశకున భయంనాస్తి, అనాచార భయం నాస్తి” అన్నట్లుగా తమిళ హీరో,
పెరియార్ రామస్వామి నాయకర్ శిష్యుడు అయిన మంజూర్ అలీఖాన్ తన “రావణ” చిత్రంతో మూఢ నమ్మకాలను వమ్ము
చేశాడు. సినిమా షూటింగ్ ప్రారంభానికి గుర్తుగా ఓ వితంతువు చేత దీపమార్పించాడట. ఆ
సినిమాలో నటించే నటీ నటులంతా తలా ఒక పిల్లిని చంకన పెట్టుకొని సెట్ లోకి వచ్చారట. “వంచకులకు ఓటమి తప్పదు” అనే పాట రావణ పాత్రలో హిట్టయ్యిందట.
సినీ లోకంలో మూహూర్తాల పిచ్చిగల వాళ్లు ఇదాంతా చూచి నివ్వెరపోయారట. అపాన వాయువు
వదిలితే ' అర్జున ఫల్గుణ కిరీటి శ్వేతవాహన' అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లుగా
అలీఖాన్ అల్లరికి వీళ్ళంతా చెల్లాచెదురు అయ్యారట. సత్యం ప్రకాశించినప్పుడు అసత్యం
నిష్క్రమించటం సహజమే గదా !
శకునాలు,జోస్యాలు,మూఢనమ్మకాలు (సూర్య 19.5,2019)
అన్నీ మంచి శకునములే
కన్యాలాభ సూచనలే...
కుడికన్నదిరే, కుడి భుజమదిరే
కోరిన చెలి నను
దరిచేరునులే || అన్నీ||
అని
పాడుకునే శకున పక్షులకు ఈ దేశంలో కొదువలేదు. శకునం వేళ ఎక్కడికని అడగకూడదుగాని, ఎక్కడికో చెప్పిపో అన్నాడట ఓ అపశకునపు పక్షి.
శని పడితే ఏడేళ్ళు, నేను పడితే పద్నాలుగేళ్ళు అన్నట్లు
జ్యోతిష్కులు, హస్తసాముద్రికులు, స్వప్నఫలాలు
చెప్పేవాళ్ళు, జాతకాలు చూసేవాళ్ళు,
చిలకపస్తీల వాళ్ళు, బాబాలు, అమ్మవార్లూ...
ఇలా మూఢాచార పరాయణులెంతో మంది దేశాన్ని పట్టి పీడిస్తున్నారు. బల్లి, తొండ లాంటివి మనిషి ఒంటిమీద ఎక్కడెక్కడపడితే ఏమేమి అనర్ధాలు జరుగుతాయో
చెప్పి జనాన్ని హడలగొడుతున్నారు. వితంతువు, ఒంటి బ్రాహ్మణుడు, జడధారి, నూనె, ఉప్పు, కట్టెలు, బెల్లం, మజ్జిగా
లాంటివి ప్రయాణ సమయంలో ఎదురైతే చెడు జరుగుతుందట. నిప్పు, గుర్రం,
ఏనుగు, వేశ్య, నక్క
లాంటివి ఎదురయితే మంచి జరుగుతుందట.ఏ ఏ ప్రయోగ ఫలితాల ప్రాతిపధికల మీద వీటిని సూత్రీకరించారో
నిర్ణయించారో ఎవరికీ తెలియదు.ఇక తిధి, వార, నక్షత్రాలు, వర్జ్యాలు, రాహుకాలాలు
యమగండాలు అంటూ ప్రజల్ని నానా యాతనలకూ గురి చేస్తున్నారు.చివరికి దొడ్లో కరివేపాకు
చెట్టు కూడా వేయకూడదని ఆంక్షలు పెట్టి పచ్చదనం కార్యక్రమానికి అడ్డుకట్ట వేశారు.
పూర్వం అరేబియాలో జంతువులు, పక్షుల ప్రయాణాల నుండి శకునాలు చూసుకునే వారు.
ఆడ మనిషి ఎదురైతే అపశకునం (తియారా) మగవాడు ఎదురయితే శుభశకునం (ఫఅల్) అనే వారు.
మహాప్రవక్త ముహమ్మద్ ఈ దురాచారాలను ఖండించారు. “అపశకునాన్ని
నమ్మవద్దు. శుభ శకునాన్నే స్వీకరించండి” అని ఆయన అన్నారు. ఏది శుభ శకునం?
అని అడిగితే “ప్రతి మంచి మాటా శుభ శకునమే” అన్నారు.
ఆంగ్లేయులు శకునాన్ని ‘OMEN’ అన్నారు.
A sign
that something is going to happen in the future అన్నారు. తుమ్ము తమ్ముడై చెబుతుంది అనే తెలుగు వాళ్ళకు
ఆంగ్లేయులు అన్నలై ఇలా చెప్పారు
: “ సోమవారం తుమ్ము ప్రమాదం, మంగళవారం
తుమ్ము పరాయివారితో ప్రణయం, బుధవారం తుమ్ము దూరదర్శనం, గురువారం
తుమ్ము శుభం, శుక్రవారం తుమ్ము శోకం,
శనివారం తుమ్ము భార్యకి తద్దినం, ఆదివారం తుమ్ము దయ్యానికి వారమంతా
విందు”. కాబట్టి ఏతావాతా తేలిందేమిటంటే అపశకునాల భయం అందరికీ ఉందనేదే.
అయితే “అప్పళాచార్యస్య
సన్నిధౌ , అపశబ్ధ భయం నాస్తి,
అపశకున భయంనాస్తి, అనాచార భయం నాస్తి” అన్నట్లుగా
తమిళ హీరో, పెరియార్ రామస్వామి
నాయకర్ శిష్యుడు అయిన మంజూర్ అలీఖాన్ తన “రావణ” చిత్రంతో మూఢ
నమ్మకాలను వమ్ము చేశాడు. సినిమా షూటింగ్ ప్రారంభానికి గుర్తుగా ఓ వితంతువు చేత
దీపమార్పించాడట. ఆ సినిమాలో నటించే నటీ నటులంతా తలా ఒక నల్లపిల్లిని చంకన
పెట్టుకొని సెట్ లోకి వచ్చారట. “వంచకులకు ఓటమి తప్పదు” అనే పాట రావణ పాత్రలో హిట్టయ్యిందట. సినీ లోకంలో మూహూర్తాల
పిచ్చిగల వాళ్లు ఇదాంతా చూచి నివ్వెరపోయారట. అపాన వాయువు వదిలితే ' అర్జున ఫల్గుణ కిరీటి శ్వేతవాహన' అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లుగా అలీఖాన్ అల్లరికి వీళ్ళంతా
చెల్లాచెదురు అయ్యారట. సత్యం ప్రకాశించినప్పుడు అసత్యం నిష్క్రమించటం సహజమే గదా !
ఈమధ్య ఎన్నికల ఫలితాల గురించి జ్యోతిష్యం చెబితే ఆ జ్యోతిష్కుడు ఏ పార్టీవాడని అడుగుతున్నారు.జ్యోతిష్కులకు
ఎవరి పార్టీలు వారికున్నాయి. పంచాంగాలూ పార్టీలవారీగా
వెలువడుతున్నాయి.ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అని ఆనాడు చిలక పస్తీ కూడా
తెలియని కొసరాజు బాధపడ్డాడు.కానీ ఈనాటి జోతిష్యులైతే ఫలానా పార్టీ గెలుస్తుందని, ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఫలానా
రోజు ఫలానా సమయానికి ప్రమాణస్వీకారం చేస్తాడని సవాళ్ళు చేస్తున్నారు. ఇక పోల్
సర్వేసంస్థలు ఓటర్లలో దిగి పోటాపోటీగా అంచనాలు జనం మీదకు వదులుతున్నాయి. తరవాత ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా ప్రశ్నించే తత్వం
లేని జనం కదా?.అందరూ కుక్కిన పేనుల్లా పడి ఉంటున్నారు
గానీ చర్యలు తీసుకొనే యంత్రాంగం లేదని ధైర్యం. మ్యానిఫెస్టోల్లో చేసిన
వాగ్ధానాల్లాంటివే ఈ అంచనాలు కూడా అంటున్నారు. ఇలాంటివన్నీ గ్రహించిందో ఏమో
ఎన్నికలవేళ ఎటువంటి జ్యోతిష్యాలూ ఉండకూడదని, రాజకీయ జ్యోతిష్యాలు ప్రసారం చేయకూడదని, ఎన్నికల సంఘం ఆదేశించింది. ‘ఎగ్జిట్ పోల్స్’పేరుతో
ఎన్నికల ఫలితాలను అంచనా వేసి చెప్పకూడదని
స్పష్టం చేసింది. పైగా అమావాస్య,రాహుకాలం,యమగండం లాంటి శుభ ముహూర్తాలు కలిసొచ్చే
వేళ చూసుకొని ఎన్నికల తేదీలు నిర్ణయిస్తూ ఉంది.
---
నూర్
బాషా రహంతుల్లా 6301493266
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి