వికృత చేష్టలు
విపరీత ఫలితాలు
గీటురాయి 27-11-1992
ఆలిని
పంచుకోలేక తగవర్లను బతిమాలుకొనేవాడి బతుకు రోత. నాట్యకత్తెల వెనక జేరి తాళాలు
వాయించే వాడి బతుకు రోత. వేశ్య కడుపున పుట్టిన వాడి బతుకు రోత. చుట్టు పక్కాల జనం
చీదరించుకొనే వాడి బతుకు రోత. ఆఫీసర్ల ఆగ్రహానికి గురైన వాడి బతుకు రోత. సెక్స్
మార్పిడి చేయించుకున్న వాడి బతుకు రోత. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన దాని
బతుకు మరీ రోత అంటూ డెన్మార్క లోని పియరీ తన బతుకును గురించి తెగ బాధపడి పోతోంది.
ఏమిటి
సంగతి అని ఆరా తీస్తే ఆవిడ గారు పెమ్మీ అండర్సన్ అనే మరో ఆమెతో కలసి కాపురం
పెట్టిందట. కొన్నేళ్ల పాటు ఇద్దరు ఆడవాళ్ళూ గుట్టుగా కాపురం నెట్టుకొచ్చారు. ఈ
దశలో పెన్నీ గారికి పిల్లల మీద మక్కువ కలిగింది. పియరీకి తెలియకుండా ఆసుపత్రికి
వెళ్లి కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా చక్కని ఆడపిల్లను కంది. పిల్ల పోషణ భారంలో సగం
పియరీ భరించాలంటూ పేచీ మొదలు పెట్టింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నది.
సలక్షణంగా
మగాళ్లను పెళ్ళి చేసుకొని కాపురం చేసి పిల్లలని కని మంచి కుటుంబాలను
నిర్మించుకోలేక, ఇలాంటి కృత్రిమమయిన, నీచమయిన అస్వభావికమయిన పనులకు పాల్పడి వాళ్ళు
సాధించింది ఏమిటి? మీగాళ్ళు వాచినమ్మ, నీ బిడ్డ పెళ్ళి ఎప్పుడంటే మోకాళ్ళు
వాచినమ్మ, మొన్ననే అయ్యింది అన్నదట. ఈ పాపపు అలవాటులో పెద్ద పెద్ద క్రీడాకారులు,
సినిమా తారలు, రాజకీయ వేత్తలు కూడా ఉండటం గమనించాలి. బాగుపడదామని పోతే బండ చాకిరీ
తగులు కుందట. అలాగే వీళ్ళేదో సుఖపడదామని వెర్రి వ్యామోహంలో ఇలాంటి పాడుపనులకు
పాల్పడతారు గాని దాని పర్యవసానం మహా దిక్కుమాలిన తనంగా ఉంటుంది.
భాస్కరాచార్యుల
వెంట్రుకలైతే మాత్రం వీణకు తంత్రుతౌతాయా ? అలాగే ఎంతటి అందగత్తెలైనా ఏక జాతి
కాపురంతో వారసత్వం వర్ధిల్లుతుందా ? కాపురం ఎట్లా చేశావే కమ్మ తిమ్మక్కా అంటా,
నువ్వు చెప్పినట్లే చేశానే బొచ్చు తిమ్మక్కా అందట. పాశ్చాత్య దేశాల మహిళలు స్వలింగ
వివాహాలను చట్ట బద్ధం చెయ్యాలని ఉద్యమాలు చేశారు. తమ వక్షోజాలను కనబరుస్తూ
స్వేచ్ఛగా తిరగటానికి అనుమతించాలంటూ కెనడా నుండి అమెరికా సరిహద్దు వరకూ యాత్ర
చేశారు. అక్కడి పురుషులు కూడా స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చెయ్యాలని కోరుతూ
సంఘాలు పెట్టారు. ఎయిడ్స్ లాంటి వికృత వ్యాధులు ఈ అలవాట్ల వల్లనే వస్తున్నాయని
చెప్పినా వారు వినటం లేదు.
సొదొమ,
గొమెర్రా పట్టణాలు ఈ అలవాటు వల్ల ఎలా మాడి మసై పోయాయో మనకు తెలుసు. ఆనాడు ఈ
దురలవాటు ఆ పట్టణాలకే పరిమితమై ఉంటే, ఈనాడు క్రమేణా దేశ దేశానా విస్తరిస్తోంది.
దీనికి కారణాలు చాలా ఉన్నాయి. హాస్టళ్ళలో, జైళ్ళలో, స్కూళ్ళలో ఈ అలవాటు స్నేహంవల్ల
పుడుతుందనీ, దీన్ని నైతిక విద్య ద్వారా అరికట్టాలని కొందరు
సిఫారసు
చేశారు. వివాహానంతర జీవితం పట్ల, పిల్లల పెంపకం పట్ల భయంతో కొందరు తీనికి
అలవడతారని వారి భయం పోగొట్టాలనీ కొందరు చెప్పారు. చిలకను పెంచి బావురు గానికి
అప్పజెప్పినట్లు కాకుండా తల్లి దండ్రులు తమ పిల్లల పెంపకం లో తగిన జాగ్రత్త
తీసుకోవాలి. సమాజంలో మెజారిటీ జనం చెడిపోయినప్పుడు సొదొమ గతే మనకూ పడుతుంది.
చీరపోతు లేరేయటం కంటే బొంతను కాల్చేయటమే మేలనుకుంటాడు దైవం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి